IND vs ENG 1st Test: తొలి టెస్ట్‌కు ముందే షాకింగ్ న్యూస్.. పిచ్‌పై కీలక ప్రకటన చేసిన క్యూరేటర్

IND vs ENG 1st Test Pitch Report: భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగే 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ జూన్ 20న ప్రారంభమవుతుంది. రెండు జట్లు లీడ్స్‌లోని హెడింగ్లీలో తలపడనున్నాయి. మ్యాచ్‌కు 3 రోజుల ముందు, అక్కడి పిచ్ గురించి అనేక ఊహాగానాలు వస్తున్నాయి.

IND vs ENG 1st Test: తొలి టెస్ట్‌కు ముందే షాకింగ్ న్యూస్.. పిచ్‌పై కీలక ప్రకటన చేసిన క్యూరేటర్
Ind Vs Eng 1st Test

Updated on: Jun 18, 2025 | 7:04 AM

IND vs ENG 1st Test Pitch Report: భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగే 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ జూన్ 20న ప్రారంభమవుతుంది. రెండు జట్లు లీడ్స్‌లోని హెడింగ్లీలో తలపడనున్నాయి. మ్యాచ్‌కు 3 రోజుల ముందు, అక్కడి పిచ్ గురించి అనేక ఊహాగానాలు బయటికి వస్తున్నాయి. కొందరు ఇక్కడ బౌలర్లకు చాలా సహాయం లభిస్తుందని చెబుతుండగా, మరికొందరు బ్యాట్స్‌మెన్స్ పరుగుల వర్షం కురిపిస్తారని చెబుతున్నారు. ఇంతలో, హెడింగ్లీ పిచ్ క్యూరేటర్ చేసిన ఒక కీలక ప్రకటన బయటకు వచ్చింది. అది వెంటనే వైరల్ అయింది.

మ్యాచ్ మూడు రోజుల్లో ముగియనుందా?

పిచ్ క్యూరేటర్ రిచర్డ్ రాబిన్సన్ సోమవారం (జూన్ 16) పిచ్ పరిస్థితి గురించి చెప్పుకొచ్చాడు. ఆటలో బ్యాట్, బంతి మధ్య మంచి సమతుల్యతను కోరుకుంటున్నానని చీఫ్ క్యూరేటర్ అన్నారు. రెవ్స్‌పోర్ట్జ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, రాబిన్సన్ మాట్లాడుతూ, గత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌ల మాదిరిగా ఈ మ్యాచ్ పూర్తి 5 రోజులు కొనసాగాలని, మూడు రోజుల్లో ముగియకూడదని కోరుకుంటున్నానని అన్నారు. హెడింగ్లీ పిచ్‌లో సీమ్, బౌన్స్ చరిత్ర ఉన్నప్పటికీ, టెస్ట్ మ్యాచ్‌లో ఏ జట్టు ముందుగా బ్యాటింగ్ చేస్తుందో మొత్తం 300 పరుగులు సాధించాలని తాను ఆశిస్తున్నానని చీఫ్ క్యూరేటర్ అన్నారు.

గడ్డి తీసివేశాం: క్యూరేటర్

మొదటి టెస్ట్‌కు మూడు రోజుల ముందు, పిచ్ ‘గ్రీన్-టాప్’ లాగా కనిపిస్తుంది. దీనిపై రాబిన్సన్ మాట్లాడుతూ, “ఇక్కడ చాలా వేడి వాతావరణం ఉంటుంది. కాబట్టి ప్రారంభంలో కొంత తేమను వదిలి, అది ఎలా ఉంటుందో చూడటం మంచిది. గడ్డిని తగ్గించివేస్తాం. ఇటీవలి రోజుల్లో చాలా పొడిగా ఉంది. కాబట్టి పిచ్ 5 రోజులు ఉండేలా మేం చాలా నీళ్లు పోస్తున్నాం. ఇది 5 రోజుల టెస్ట్ మ్యాచ్ అవుతుందని, 3 రోజుల టెస్ట్ మ్యాచ్ కాదని ఆశిస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు.

బ్యాట్స్‌మెన్స్‌కు సహాయం..

మ్యాచ్ సాగుతున్న కొద్దీ వికెట్ ఫ్లాట్ అవుతుందని, బ్యాట్స్‌మెన్ పిచ్‌పై తమ సమయాన్ని ఆస్వాదిస్తారని క్యూరేటర్ ఆశాభావం వ్యక్తం చేశారు. “ఇది బ్యాట్, బంతి రెండింటికీ మంచిదని ఆశిస్తున్నాను. బౌలర్లకు ప్రారంభంలో సహాయం లభిస్తుంది. ఆట ముందుకు సాగుతున్న కొద్దీ అది ఫ్లాట్ అవుతుంది. మొదటి ఇన్నింగ్స్‌లో 300 పరుగులు చేస్తే, అది మంచి మొత్తం అవుతుంది. తదుపరి రెండు ఇన్నింగ్స్‌లు కొంచెం ఎక్కువగా ఉండవచ్చు” అని తెలిపాడు.

యువ ఆటగాళ్లపై కీలక బాధ్యత..

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత భారతదేశం కొత్త జట్టుతో ఇంగ్లాండ్‌కు చేరుకుంది. చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే అందుబాటులో ఉన్నప్పటికీ, సెలెక్టర్లు సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్ వంటి కొత్త ఆటగాళ్లపై విశ్వాసం ఉంచారు. శుభ్‌మాన్ గిల్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. కేఎల్ రాహుల్, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా వంటి సీనియర్ ఆటగాళ్ల మద్దతు అతనికి లభిస్తుంది. ఈ సిరీస్ కోసం శుభ్‌మాన్ జట్టుకు రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..