AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ENG vs PAK: 2001 లార్డ్స్ సీన్ రిపీట్.. 25 ఏళ్ల తర్వాత పాక్ పై ఇంగ్లాండ్ ఆల్ టైమ్ రికార్డు

ENG vs PAK: లీడ్స్ మైదానం వేదికగా జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ పేసర్లు పంజా విసిరారు. మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి పాకిస్థాన్ కోల్పోయిన మొత్తం 20 వికెట్లను ఇంగ్లండ్ పేసర్లే పడగొట్టడం గమనార్హం. ఈ సంచలన ప్రదర్శనతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్, 103 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది.

ENG vs PAK: 2001 లార్డ్స్ సీన్ రిపీట్.. 25 ఏళ్ల తర్వాత పాక్ పై ఇంగ్లాండ్ ఆల్ టైమ్ రికార్డు
Eng Vs Pak
Rakesh
|

Updated on: Aug 22, 2026 | 8:50 AM

Share

ENG vs PAK: ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ అరుదైన రికార్డు నమోదు అయింది. టెస్టు మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టుకు చెందిన అన్ని 20 వికెట్లను కేవలం పేస్ బౌలర్లు మాత్రమే తీయడం గత 25 ఏళ్లలో ఇది మొదటిసారి. సరిగ్గా 2001లో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టులో ఇంగ్లండ్ పేసర్లు కాడిక్, గఫ్, కార్క్ కలిసి పాకిస్థాన్‌కు చెందిన 20 వికెట్లను నేలకూల్చారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత జోఫ్రా ఆర్చర్, ఆలీ రాబిన్సన్, జోష్ టంగ్ త్రయం అదే సీన్‌ను రిపీట్ చేస్తూ పాక్ బ్యాటింగ్ లైనప్‌ను కోలుకోలేని దెబ్బ తీశారు.

ఇది కూడా చదవండి: Mitchell Starc: వీడు మగాడ్రా బుజ్జి.. 42 నిమిషాల్లో 22 బంతులు వేసి 5 వికెట్లు.. ఇది ఆల్ టైమ్ రికార్డ్

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో విఫలమవ్వగా, ఇంగ్లండ్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 409 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్‌కు 238 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్‌ను ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో కట్టడి చేశారు. కేవలం 37.3 ఓవర్లలోనే 135 పరుగులకు పాక్ రెండో ఇన్నింగ్స్ సమాప్తమైంది. జోఫ్రా ఆర్చర్ కొత్త బంతితో ఓపెనర్లను అవుట్ చేయగా, ఆలీ రాబిన్సన్, జోష్ టంగ్ మిగతా వికెట్లను పంచుకుని మ్యాచ్‌ను మూడో రోజే ముగించారు.

ఇది కూడా చదవండి: Love Affairs: ఆటగాడు మామూలు ఆటగాడు కాదు.. పాక్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌తో బాలీవుడ్ భామల అఫైర్లు

గత దశాబ్ద కాలంలో లీడ్స్‌లోని హీడింగ్లీ మైదానం ఇంగ్లండ్‌కు అజేయమైన కోటగా మారింది. ఈ మైదానంలో ఆడిన గత తొమ్మిది టెస్టుల్లో ఇంగ్లండ్‌కు ఇది ఎనిమిదో విజయం కావడం విశేషం. అందులోనూ నాలుగు విజయాలు ఇన్నింగ్స్ తేడాతో రాగా, అవన్నీ ఆసియా జట్లపైనే నమోదు కావడం గమనార్హం. పాకిస్థాన్‌పై రెండుసార్లు, భారత్, శ్రీలంకలపై తలోసారి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ విజయాలు సాధించింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టు గురువారం నుంచి లార్డ్స్‌లో ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ పేసర్ల దాటికి పాకిస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్ మరోసారి పూర్తిగా చేతులెత్తేసింది. రాబోయే లార్డ్స్ టెస్టులోనైనా పాక్ కోలుకుని పుంజుకుంటుందో లేదో వేచి చూడాలి.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us
25 ఏళ్ల తర్వాత పాక్ పై ఇంగ్లాండ్ ఆల్ టైమ్ రికార్డు
25 ఏళ్ల తర్వాత పాక్ పై ఇంగ్లాండ్ ఆల్ టైమ్ రికార్డు
డిగ్రీ గ్రాడ్యుయేట్లకు 2,482 బ్యాంక్ ఉద్యోగాలు.. కళ్లుచెదిరే జీతం
డిగ్రీ గ్రాడ్యుయేట్లకు 2,482 బ్యాంక్ ఉద్యోగాలు.. కళ్లుచెదిరే జీతం
మెగాస్టార్ చిరంజీవికి సీఎం చంద్రబాబు బర్త్‌డే విషెస్
మెగాస్టార్ చిరంజీవికి సీఎం చంద్రబాబు బర్త్‌డే విషెస్
2 నెలల పరిచయానికే ప్రాణం తీసుకోవాలా?.. యువతి రిప్లే ఇవ్వలేదని
2 నెలల పరిచయానికే ప్రాణం తీసుకోవాలా?.. యువతి రిప్లే ఇవ్వలేదని
రెండో టెస్టుకు ముందు లంక జట్టులో 2 మార్పులు.. ఎందుకో తెలుసా?
రెండో టెస్టుకు ముందు లంక జట్టులో 2 మార్పులు.. ఎందుకో తెలుసా?
పీఎఫ్ అకౌంట్లో వడ్డీ ఎప్పుడు ఆగిపోతుంది.. ఈపీఎఫ్ఓ రూల్స్ ఇవే..
పీఎఫ్ అకౌంట్లో వడ్డీ ఎప్పుడు ఆగిపోతుంది.. ఈపీఎఫ్ఓ రూల్స్ ఇవే..
42 నిమిషాల్లో 22 బంతులు వేసి 5 వికెట్లు.. ఇది ఆల్ టైమ్ రికార్డ్
42 నిమిషాల్లో 22 బంతులు వేసి 5 వికెట్లు.. ఇది ఆల్ టైమ్ రికార్డ్
యమహా నుంచి అదిరిపోయే అప్‌డేట్స్: 2026 హైబ్రిడ్ స్కూటర్లు ఇవే
యమహా నుంచి అదిరిపోయే అప్‌డేట్స్: 2026 హైబ్రిడ్ స్కూటర్లు ఇవే
నీలిరంగు పూలతో నల్లమల అడవికి కొత్త అందం..
నీలిరంగు పూలతో నల్లమల అడవికి కొత్త అందం..
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త ఎడిషన్ విడుదలకు కారణమిదే
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త ఎడిషన్ విడుదలకు కారణమిదే