ODI Records: వన్డేల్లో 4వ అతిపెద్ద ఓటమి.. ఆ ఇద్దరి దెబ్బకు ఛాంపియన్ టీం చెత్త రికార్డ్

|

Sep 28, 2024 | 9:04 AM

England vs Australia, 4th ODI: ఇంగ్లండ్ -ఆస్ట్రేలియా మధ్య ఐదు వన్డేల సిరీస్‌లో నాలుగో మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 39-39 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 39 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా జట్టు 24.4 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది.

ODI Records: వన్డేల్లో 4వ అతిపెద్ద ఓటమి.. ఆ ఇద్దరి దెబ్బకు ఛాంపియన్ టీం చెత్త రికార్డ్
England Vs Australia, 4th O
Follow us on

England vs Australia, 4th ODI: ఇంగ్లండ్ -ఆస్ట్రేలియా మధ్య ఐదు వన్డేల సిరీస్‌లో నాలుగో మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 39-39 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 39 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా జట్టు 24.4 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్ తుఫాను బ్యాటింగ్..

ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అతని నిర్ణయం పూర్తిగా తప్పు అని తేలింది. ఇంగ్లండ్‌ వైపు నుంచి చాలా దూకుడు బ్యాటింగ్‌ కనిపించింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 27 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఇది కాకుండా, బెన్ డకెట్ 62 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ సహాయంతో 63 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. మిడిలార్డర్‌లో కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 58 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 87 పరుగులు చేశాడు. ఇది కాకుండా జామీ స్మిత్ 1 ఫోర్, 2 సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేశాడు. లియామ్ లివింగ్‌స్టోన్ లోయర్ ఆర్డర్‌లో చాలా తుఫాను బ్యాటింగ్ చేశాడు. 27 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయంగా 62 పరుగులు చేశాడు. మిచెల్ స్టార్క్ వేసిన ఒకే ఓవర్‌లో లియామ్ లివింగ్‌స్టోన్ 28 పరుగులు ఇచ్చాడు.

దారుణంగా ఆస్ట్రేలియా బ్యాటింగ్..

లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియాకు శుభారంభం లభించింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్, కెప్టెన్ మిచెల్ మార్ష్‌లు తొలి వికెట్‌కు 8.4 ఓవర్లలో 68 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మార్ష్ 34 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 28 పరుగులు చేశాడు. కాగా, ట్రావిస్ హెడ్ 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేశాడు. అయితే, ఆ తర్వాత ఇన్నింగ్స్ తడబడింది. జట్టులోని మిడిల్, లోయర్ ఆర్డర్ పూర్తిగా ఫ్లాప్ అయింది. ఇంగ్లండ్‌ తరపున మాథ్యూ పాట్స్‌ 4 వికెట్లు తీయగా, బ్రైడెన్‌ కార్సే 3 వికెట్లు తీయడంతో వెంటనే ఇన్నింగ్స్‌ను ముగించారు. ప్రస్తుతం 5 మ్యాచ్‌ల సిరీస్‌ 2-2తో సమమైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..