IND vs ENG Test: చరిత్రలో మొదటిసారి.. హెల్మెట్ కెమెరాతో బరిలోకి ఆటగాడు.. ఎందుకంటే?

|

Jun 30, 2022 | 9:27 PM

ఇంగ్లండ్ క్రికెట్ జట్టు తమ స్వదేశంలో టీమిండియాతో ఐదో టెస్టు మ్యాచ్ ఆడాల్సి ఉంది. జులై 1 నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ఈ మ్యాచ్ జరగనుంది.

IND vs ENG Test: చరిత్రలో మొదటిసారి.. హెల్మెట్ కెమెరాతో బరిలోకి ఆటగాడు.. ఎందుకంటే?
England Cricketer Ollie Pope Wearing Camera
Follow us on

క్రికెట్ చరిత్రలో మరోసారి కొత్త ప్రయోగం జరుగుతోంది. టెస్టు మ్యాచ్‌లో తొలిసారిగా హెల్మెట్‌లో కెమెరాతో ఫీల్డింగ్ చేసేందుకు రంగం సిద్ధమైంది. జులై 1 నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగనున్న ఎడ్జ్‌బాస్టన్ టెస్టు మ్యాచ్‌లో ఈ ప్రయోగానికి వేదికైంది. స్కై స్పోర్ట్స్ ఈ కొత్త పరికరాన్ని లాంచ్ చేయబోతోంది. క్రికెట్ కవరేజీ కోసం ఇలా చేస్తున్నారు. టీమిండియాతో జరిగే టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లిష్ ఆటగాడు ఓలీ పోప్ హెల్మెట్‌లో ఈ కెమెరాతో ఫీల్డింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు.

ఈ కెమెరా ధ్వనిని రికార్డ్ చేస్తుందా?

ఒల్లీ పోప్ షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మాత్రమే ఈ కెమెరాను ఇన్‌స్టాల్ చేస్తారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC), ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) కూడా ఈ కొత్త ప్రయత్నానికి గుర్తింపునిచ్చాయి.

ఇవి కూడా చదవండి

అయితే, ఈ కెమెరాలో ఎలాంటి సౌండ్ రికార్డ్ కావని తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితిలో, ఆటగాళ్ళు తమలో తాము ఏమి మాట్లాడుకుంటారనేది మాత్రం తెలియదు. వాయిస్ కోసం స్టంప్ మైక్ ఇప్పటికే ఉపయోగిస్తున్న నేపథ్యంలో, ఇందులో వాయిస్ రికార్డ్ ఆఫ్షన్ అందివ్వడంలేదని తెలుస్తోంది.

ఈ సాంకేతికత ఇంతకు ముందు కూడా..

గత సంవత్సరం జరిగిన ‘ది హండ్రెడ్’ టోర్నమెంట్ మొదటి సీజన్‌లో స్కై స్పోర్ట్స్ ఈ కొత్త టెక్నాలజీని ఉపయోగించింది. ఆ తర్వాత ట్రెంట్ రాకెట్స్ జట్టు వికెట్ కీపర్ టామ్ మూర్స్ కెమెరాతో ఆడాడు. ఇప్పుడు ఈ టెక్నిక్ హాట్ ఫేవరేట్‌గా మారింది. ముఖ్యంగా బ్యాట్స్‌మెన్ బ్యాట్ నుంచి బంతి ఎడ్జ్‌తో వికెట్ కీపర్‌కి క్యాచ్ ఇచ్చినప్పుడు చాలా కీలకంగా మారింది.

ఇంగ్లండ్‌ ప్లేయింగ్‌-11..

టీమ్ ఇండియాతో ఎడ్జ్‌బాస్టన్ టెస్టు కోసం ఇంగ్లండ్ ప్లేయింగ్-11 ప్రకటించింది. అందులో ఓలీ పోప్‌కు చోటు దక్కింది. వీరితో పాటు ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్, వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ తిరిగి ఇంగ్లిష్ జట్టులోకి వచ్చారు.

టెస్టులకు ఇంగ్లండ్ ప్లేయింగ్ XI..

అలెక్స్ లీస్, జాక్ క్రౌలీ, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (సారథి), సామ్ బిల్లింగ్స్ (కెప్టెన్), మాథ్యూ పాట్స్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, జేమ్స్ ఆండర్సన్.