Ben Stokes: యాషెస్ సిరీస్ ముందు ఇంగ్లాండ్‌కు గట్టి దెబ్బ.. గాయం కారణంగా తప్పుకున్న ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్..!
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ అంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానులకు పండుగే.. ఈ సిరీస్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ అంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానులకు పండుగే.. ఈ సిరీస్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ చేతి వేలికి మరో సర్జరీ జరగడంతో యాషెస్ సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది భారత్‌లో జరిగిన ఐపీఎల్-2021 తొలి దశ సందర్భంగా స్టోక్స్ గాయపడ్డాడు. ఆ సమయంలో అతను గాయానికి సర్జరీ చేయించుకున్నాడు. అతను ఐపీఎల్ రెండోదశతోపాటు, టీ20 వరల్డ్ కప్ కూడా ఆడటంలేదు. అయితే తాజాగా అదే చేతి వేలికి మరో సర్జరీ జరగడంతో అతను యాషెస్ నుంచి తప్పుకుంటాడని వార్తలు వినిపిస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్‌కు మరో ఆల్ రౌండర్ సామ్ కరన్ కూడా దూరమయ్యాడు. దీంతో ఇంగ్లాండ్‌కు ఇద్దరు ఆల్ రౌండర్లు దూరమయ్యారు.
ప్రస్తుతానికి స్టోక్స్ పూర్తి ఫిట్‌గా ఉన్నా.. ఇప్పట్లో క్రికెట్ ఆడే అవకాశం మాత్రం లేదని ఓ నివేదిక వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్టోక్స్ సైతం సూచనప్రాయంగా అంగీకరించాడు. బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను పోస్ట్ చేయగా.. అందులో అతను చేతి వేలికి బ్యాండేజీతో కనిపించాడు. ఈ ఫోటోలో స్టోక్స్ భార్య క్లేర్ కూడా ఉంది. కాగా, స్టోక్స్.. ఐపీఎల్‌లో గాయం కారణంగా భారత్‌తో టెస్ట్ సిరీస్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా వేదికగా జరిగే యాషెస్ సిరీస్‌లో పాల్గొనేందుకు ఇంగ్లండ్ జట్టు సిద్ధమైనట్లు ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది. కరోనా కఠిన క్వారంటైన్ నిబంధనలను సడలించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒప్పుకోవడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఈ మేరకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే స్టార్ ఆటగాళ్లు జోస్ బట్లర్, బెన్ స్టోక్స్‌లు ఈ సిరీస్‌కు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఆసీస్-ఇంగ్లండ్ జట్ల మధ్య డిసెంబర్ 8 నుంచి జనవరి 18 వరకు యాషెస్ సిరీస్ జరుగనుంది.
View this post on Instagram