సచిన్, కోహ్లీ కెరీర్‌లో సాధ్యం కాని రికార్డ్.. కేవలం 10వ టెస్ట్‌లోనే ఆ జాబితాలో చేరిన బ్యాటర్..

ENG vs NZ 1st Test: మిచెల్ ఈ ఇన్నింగ్స్‌లో 108 పరుగులతో ఆకట్టుకున్నాడు. టామ్ బ్లండెల్‌తో కలిసి మిచెల్ 195 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. తన జట్టును క్లిష్ట పరిస్థితి నుంచి..

సచిన్, కోహ్లీ కెరీర్‌లో సాధ్యం కాని రికార్డ్.. కేవలం 10వ టెస్ట్‌లోనే ఆ జాబితాలో చేరిన బ్యాటర్..
Daryl Mitchel

Updated on: Jun 05, 2022 | 2:01 AM

ENG vs NZ 1st Test: కరోనా వైరస్(Carona Virus) కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాలు పూర్తిగా మారిపోయాయి. దీని ప్రభావం క్రీడలపైనా పడింది. ఇటువంటి పరిస్థితిలో ఒక ప్లేయర్ అదృష్టంలో మాత్రం సానుకూల మార్పును తీసుకొచ్చింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ డారిల్ మిచెల్.. ఈ విషయంలో తనను తాను కొంచెం అదృష్టవంతుడిగా భావించుకుంటున్నాడు. ఎందుకంటే కరోనా కారణంగా, అతనికి చరిత్ర సృష్టించే అవకాశం వచ్చింది. న్యూజిలాండ్ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉంది. ఇక్కడ చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలోఇంగ్లాండ్ టీంతో మొదటి టెస్ట్‌లో కివీస్ జట్టు తలపడుతోంది. ఈ టెస్టు మ్యాచ్ మూడో రోజు మిచెల్ చిరస్మరణీయ సెంచరీ సాధించాడు.

దీంతో లార్డ్స్‌లో సెంచరీ చేసిన ఘనత సాధించిన బ్యాట్స్‌మెన్ల జాబితాలో అతని పేరు చేరిపోయింది. 10వ టెస్టులో మిచెల్ ఈ ఘనత సాధించాడు. విశేషమేమిటంటే, భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో లార్డ్స్‌లో ఒక్క టెస్టు సెంచరీ కూడా చేయలేకపోయాడు. అదే సమయంలో 100కి పైగా టెస్టులు ఆడిన భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ఇందులో రాణించలేకపోయాడు.

మిచెల్ ఈ ఇన్నింగ్స్‌లో 108 పరుగులతో ఆకట్టుకున్నాడు. టామ్ బ్లండెల్‌తో కలిసి మిచెల్ 195 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. తన జట్టును క్లిష్ట పరిస్థితి నుంచి గట్టెక్కించడం ద్వారా అతని జట్టు విజయంపై ఆశలను పెంచాడు.

ఇవి కూడా చదవండి

కివీస్ జట్టులో కరోనా వైరస్ కేసు కారణంగా మిచెల్ ఈ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. వాస్తవానికి, న్యూజిలాండ్ జట్టులో మిడిల్ ఆర్డర్ స్థానం హెన్రీ నికోల్స్‌ ఉన్నాడు. కానీ ఇంగ్లండ్‌కు చేరుకున్న తర్వాత, అతను కరోనా ఇన్‌ఫెక్షన్‌గా తేలాడు. ఈ కారణంగా అతను ఈ టెస్టులో ఆడలేకపోయాడు. ఆ తర్వాత మిచెల్‌కు అవకాశం లభించింది. అతను చిరస్మరణీయ సెంచరీ చేయడంతో రెండో టెస్టులో అతని వాదనకు బలం చేకూరింది.