వీడు మామూలోడు కాదు.. సెహ్వాగ్, డివిలియర్స్‌ను మించిపోయాడు.. 20 బంతుల్లో సెంచరీ బాదేశాడు..

|

Jun 08, 2021 | 9:43 AM

యూరోపియన్ క్రికెట్ సిరీస్‌లో ఓ బ్యాట్స్‌మెన్ విధ్వంసం సృష్టించాడు. 13 సిక్సర్లు, ఏడు ఫోర్ల సహాయంతో 28 బంతుల్లో సెంచరీ చేసి అభారత సంతతికి..

వీడు మామూలోడు కాదు.. సెహ్వాగ్, డివిలియర్స్‌ను మించిపోయాడు.. 20 బంతుల్లో సెంచరీ బాదేశాడు..
Cricket
Follow us on

యూరోపియన్ క్రికెట్ సిరీస్‌లో ఓ బ్యాట్స్‌మెన్ విధ్వంసం సృష్టించాడు. 13 సిక్సర్లు, ఏడు ఫోర్ల సహాయంతో 28 బంతుల్లో సెంచరీ చేసి అభారత సంతతికి చెందిన గౌహర్ మనన్ నెలకొల్పిన రికార్డును చెరిపేశాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఆ ప్లేయర్.. చివరి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఇక ఆ ఆటగాడు కేవలం 10 ఓవర్లలోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఆ వివరాలు..

కుమ్మర్‌ఫెల్డర్ స్పోర్ట్‌వెరిన్ తరఫున ఆడుతున్న అహ్మద్ ముసాదిక్ అనే ఆటగాడు టిహెచ్‌సిసి హాంబర్గ్‌పై ఈ ఫీట్ సాధించాడు. అహ్మద్ ముసాదిక్ యూరోపియన్ క్రికెట్ సిరీస్ చరిత్రలో అత్యంత వేగవంతమైన(28 బంతుల్లో) సెంచరీని సాధించాడు. అంతకముందు ఈ రికార్డు భారత సంతతికి చెందిన బ్యాట్స్‌మెన్ గౌహర్ మనన్(29 బంతుల్లో) పేరిట ఉంది. క్లౌజ్ క్రికెట్ క్లబ్‌పై గౌహర్ ఈ రికార్డు నెలకొల్పాడు.

32 ఏళ్ల అహ్మద్ మొదటి బంతి నుండే బౌలర్లపై ఎటాకింగ్‌కు దిగాడు. 33 బంతుల్లో 115 పరుగులు సాధించాడు. అహ్మద్ అద్భుత ఇన్నింగ్స్‌తో కుమ్మర్‌ఫెల్డర్ స్పోర్ట్‌వెరిన్ రెండు వికెట్లకు 198 పరుగులు చేసింది. అహ్మద్ తన ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, 13 సిక్సర్లు కొట్టాడు, అంటే కేవలం 20 బంతుల్లో 106 పరుగులు చేశాడు. మొదటి బంతి నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లు ఎవరైనా సరే.. బంతిని బౌండరీకి తరలించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.

13 బంతుల్లో అర్ధ శతకం, చివరి బంతికి అవుట్..

ఇన్నింగ్స్ ఐదవ ఓవర్‌లో అహ్మద్ బహ్రామ్ అలీ బౌలింగ్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టాడు. అలాగే 13 బంతుల్లో తన అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అహ్మద్ ముసాదిక్ తొమ్మిదవ ఓవర్లో ఒక సింగిల్ తీసుకొని సెంచరీ పూర్తి చేయగా.. ఇన్నింగ్స్ చివరి బంతికి అవుట్ అయ్యాడు. దీనితో అతడు 33 బంతుల్లో 115 పరుగులు చేశాడు.

ప్రత్యర్థి జట్టుపై 145 పరుగుల తేడాతో విజయం..

198 పరుగుల భారీ టార్గెట్‌ను ప్రత్యర్ధి జట్టు చేధించలేకపోయింది. 10 ఓవర్లలో, ఏడు వికెట్ల నష్టానికి 53 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనితో కుమ్మర్‌ఫెల్డర్ స్పోర్ట్‌వెరిన్ 145 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది.

Also Read:

ప్రతీ నెలా రూ. 3810 డిపాజిట్ చేస్తే.. మీ కూతురు కోసం రూ. 27 లక్షలు పొందొచ్చు.. పూర్తి వివరాలు..

టీమిండియా చరిత్రలో చెత్త మ్యాచ్.. జీరోకి నాలుగు వికెట్లు.. ఆ ఇంగ్లీష్ బౌలర్ ఎవరంటే.?