ILT20: మరో టీ20 లీగ్‌పై కన్నేసిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు.. వచ్చే ఏడాది నుంచే డబుల్ ఎంటర్టైన్మెంట్.. ఎప్పుడు, ఎక్కడంటే?

|

Jun 07, 2022 | 9:49 AM

ఆరు ఫ్రాంచైజీలలో ఐదు భారతీయ కంపెనీలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, నైట్ రైడర్స్ గ్రూప్, GMR, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, అదానీ స్పోర్ట్స్ లైన్, కాప్రి గ్లోబల్ కాకుండా లాన్సర్ క్యాపిటల్స్‌ దక్కించుకున్నాయి.

ILT20: మరో టీ20 లీగ్‌పై కన్నేసిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు.. వచ్చే ఏడాది నుంచే డబుల్ ఎంటర్టైన్మెంట్.. ఎప్పుడు, ఎక్కడంటే?
Ilt20
Follow us on

ఫ్రాంచైజీ క్రికెట్ అభిమానుల క్యాలెండర్ మరింత బిజీగా మారబోతోంది. మరింత మజాను అందించేందుకు సరికొత్త రూపంలో రెడీ అవుతోంది. టీ20 లీగ్ ప్రపంచంలోకి మరో లీగ్ అడుగుపెట్టబోతుంది. దీంతో ఏకకాలంలో వివిధ దేశాల్లో టీ20 టోర్నీల జాతర ప్రారంభం కానుంది. IPL, BBL, CPL, PSL వంటి ప్రసిద్ధ లీగ్‌లతో పాటు ప్రస్తుతం ILT20 అంటే ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ILT20) పేరు కూడా చేరనుంది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) తన కొత్త లీగ్ మొదటి సీజన్‌ను వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. టోర్నమెంట్‌లో ఆరు జట్లు పాల్గొంటాయి. ఇందులో ఐదు భారత కంపెనీలు కూడా భాగస్వామ్యం కానుండడంతో, ఈ హీట్ మరింత ఎక్కువైంది.

ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు జూన్ 6 సోమవారం లీగ్ తేదీలను అధికారికంగా ప్రకటించింది. దీని ప్రకారం, 6 జట్ల టోర్నమెంట్ 6 జనవరి 2023 నుంచి 12 ఫిబ్రవరి 2023 వరకు UAEలోని వివిధ నగరాల్లో నిర్వహించనున్నారు. కొన్ని ప్రధాన IPL ఫ్రాంచైజీలు కూడా ఈ లీగ్‌లో పాల్గొంటున్నాయి. ముంబై ఇండియన్స్ యాజమాన్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, షారుఖ్ ఖాన్ నైట్ రైడర్స్ గ్రూప్, ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని GMR ఈ లీగ్‌లోని జట్లను కొనుగోలు చేశాయి.

ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు తన ట్విట్టర్ ఖాతాలో లీగ్ నిర్వహణను ప్రకటించింది. ECB విడుదల చేసిన ప్రకటన మేరకు, బోర్డు ఛైర్మన్ షేక్ నహ్యాన్ మబారెక్ అల్ నహ్యాన్ మాట్లాడుతూ, “రిలయన్స్ ఇండస్ట్రీస్, కోల్‌కతా నైట్ రైడర్స్, కాప్రి గ్లోబల్, GMR, లాన్సర్ క్యాపిటల్, అదానీ స్పోర్ట్స్ లైన్ సహకారంతో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు త్వరలో టీ20 లీగ్‌ను మొదలుపెట్టునుంది. బ్రాడ్‌కాస్టర్‌గా జీ గ్రూప్‌తో పాటు ఇతర వాటాదారులు కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యారు. UAE కొత్త T20 లీగ్‌తో క్రికెట్ ఫ్యాన్స్‌కు మరింత జోష్‌ను అందంచేందుకు సిద్ధమైంది” అంటూ ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

5 భారత కంపెనీలు..

ఈ లీగ్‌తో స్థానిక ఆటగాళ్లు కూడా తమ సత్తా చాటుకునే అవకాశం ఉంటుంది. ఆరు ఫ్రాంచైజీలలో ఐదు భారతీయ కంపెనీలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, నైట్ రైడర్స్ గ్రూప్, GMR, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, అదానీ స్పోర్ట్స్ లైన్, కాప్రి గ్లోబల్ కాకుండా లాన్సర్ క్యాపిటల్స్‌ దక్కించుకున్నాయి. లాన్సర్ క్యాపిటల్స్ అనేది మాంచెస్టర్ యునైటెడ్ గ్లేజర్ కుటుంబానికి చెందిన సంస్థ.

BBLకు గట్టిపోటీగా..

అయితే లీగ్ ఇచ్చిన డేట్స్ వల్ల మిగతా లీగ్ లతో విభేదాలు తలెత్తుతాయి. ఆస్ట్రేలియా ప్రసిద్ధ బిగ్ బాష్ లీగ్ ప్రతి సంవత్సరం డిసెంబర్ నుంచి జనవరి వరకు, అలాగే ఫిబ్రవరి ప్రారంభంలో నిర్వహిస్తుంటారు. అదే సమయంలో, పాకిస్తాన్ సూపర్ లీగ్ కూడా జనవరి చివరి నుంచి ప్రారంభమవుతుంది. వీటితో పాటు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ కూడా ఈ సమయంలో నిర్వహించనున్నారు. ఇటువంటి పరిస్థితిలో, లీగ్‌లోకి చాలా మంది కీలక ఆటగాళ్లు వస్తారని అంచనా వేయడం కష్టమే. ఏం జరగనుందో చూడాలి.