దేశవాళీ ప్రీమియర్ టోర్నీ దులీప్ ట్రోఫీ గురువారం (సెప్టెంబర్ 05) ప్రారంభమైంది. తొలిరోజు 2 మ్యాచ్‌లు జరిగాయి. తొలి మ్యాచ్‌లో భారత్ ఎ జట్టు భారత్ బి జట్టుతో తలపడుతోంది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. రెండో మ్యాచ్‌లో ఇండియా సి జట్టు భారత్ డి జట్టుతో పోటీ పడుతోంది. అనంతపురం రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదికైంది. ఇండియా సి, ఇండియా డి మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా డి తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా సి జట్టు కూడా తడబడింది.సాయి సుదర్శన్ 7 పరుగులు, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 19 బంతుల్లో 5 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. భారత్ సి జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, హర్షిత్ రాణా బౌలింగ్ లో శ్రీకర్ భరత్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అంతకు ముందు రానా సాయి సుదర్శన్ ను కూడా పెవిలియన్ పంపించాడు. అయితే రుతురాజ్ వికెట్ పడగొట్టిన తర్వాత, హర్షిత్ రాణా మైదానంలో అతనికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి సంబరాలు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిజానికి హర్షిత్ రాణా ఇలా ఫ్లయింగ్ కిస్ లు ఇచ్చి నిషేధానికి గురికావడం ఇదేమీ మొదటి సారి కాదు. గతంలో IPL 2024 సందర్భంగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనింగ్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ ను ఔట్ చేసి హర్షిత్ రానా పెవిలియన్ దారి చూపించాడు. అనంతరం ఫ్లయింగ్ కిస్ ఇచ్చి సంబరాలు చేసుకున్నారు. దీంతో రాణాకు మ్యాచ్ ఫీజులో 60 శాతం జరిమానా విధించారు. ఆ తర్వాత కూడా తన పంథాను మార్చుకోలేదు హర్షిత్. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అదే ఫ్లయింగ్ కిస్ సెలబ్రేషన్స్ ను పునరావృతం చేశాడు. దీంతో ఈసారి రానాపై ఒక మ్యాచ్ నిషేధం పడింది. అంతేకాకుండా మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా కూడా విధించారు. అయితే ఇన్నీ జరిమానాలు, శిక్షలు పడినా రానా ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేసాడు. కనుక రానా ఈ చర్యను బీసీసీఐ సీరియస్‌గా తీసుకుంటే అతడికి మళ్లీ శిక్ష పడే అవకాశాలున్నాయి.
— Gill Bill (@bill_gill76078) September 5, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..