క్రికెటర్లు ఎన్ని పరుగులు చేసినా, వికెట్లు తీసినా.. వారి ఖాతాలో ఎన్ని ఐసీసీ ట్రోఫీలు ఉన్నాయన్నదే క్రికెట్ అభిమానులు చూస్తారు. గతంలో భారత్ తరఫున పరుగుల వర్షం కురిపించిన సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ కనీసం ఒక్క ప్రపంచకప్ కూడా గెలవలేకపోయారు. అలాగే టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆరో ప్రపంచకప్ లో కానీ వరల్డ్ కప్ ను ముద్దాడ లేకపోయాడు. విరాట్ కోహ్లీ 15 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ అందుకున్నాడు. రోహిత్ శర్మ కూడా ఇటీవలే కెప్టెన్ గా పొట్టి ఫార్మాట్ లో ఐసీసీ కప్పును అందుకున్నాడు. అయితే కింగ్ కోహ్లీ, రోహిత్ శర్మలకు గట్టి పోటీని ఇచ్చి కనీసం ఒక్క ఐసీసీ కప్పు కూడా అందుకోలేని ది మోస్ట్ అన్ లక్కీ ప్లేయర్ మరొకరు ఉన్నారు. అతనే కేఎల్ రాహుల్. వన్డే వరల్డ్ కప్ తో పాటు, ఐపీఎల్ లోనూ పరుగుల వర్షం కురిపించిన అతను టీ20 ప్రపంచకప్ లో ఆడలేకపోయాడు. అంతకు ముందు 2023 ప్రపంచకప్ లో ఆడినా దురదృష్టవశాత్తూ ఫైనల్ లో భారత్ ఓటమి చవి చూసింది.
టీమిండియాకు చాలా ఏళ్లుగా వైస్ కెప్టెన్ గా సేవలందించిన కేఎల్ రాహుల్ వన్డే వరల్డ్ కప్ 2023, టీ20 వరల్డ్ కప్ 2022, 2021, వన్డే వరల్డ్ కప్ 2019 టీమ్స్‌లో ఆడాడు. ఆటగాడిగా అమోఘంగా రాణించాడు. కానీ భారత జట్టు ప్రపంచకప్ గెలవలేకపోయింది. ఇక ట్యాలెంట్, టెక్నిక్ విషయంలో కోహ్లీ, రోహిత్ లకు కేఎల్ రాహుల్ ఏ మాత్రం తక్కువ కాడు. భారత జట్టు తరఫున అన్ని ఫార్మాట్లలోనూ పరుగుల వర్షం కురిపించాడు. జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు.
అయితే దురదృష్టం కూడా రాహుల్ ను వెంటాడుతోంది. అందుకే 2014 నుంచి సుమారు పదేళ్లుగా భారత జట్టులో ఆడుతున్నా ఒక ఐసీసీ కప్ కూడా గెలవలేకపోయాడు. భారత జట్టు వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడనుంది. మరి దీంతోనైనా కేఎల్ రాహుల్ ఐసీసీ కప్ కల సాకారం చేసుకుంటాడో లేదో చూడాలి.
#T20WorldCup2024 #KLRahul pic.twitter.com/BX0lFw7Jwa
— Sayyad Nag Pasha (@nag_pasha) July 2, 2024
We can literally see how much hate this man is getting right now 💔🥺
This is unreal & pathetic!! 😑#KLRahul https://t.co/7YB7fHvg6f pic.twitter.com/V0wmwGm5Vj— Pawan kumar (@Pawanar02106943) July 1, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..