ENG vs AUS: ఇంగ్లాండ్ వేదికగా యాషెస్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఆసీస్ తరఫున తొలి ఇన్సింగ్స్‌లో 66 పరుగులు చేసిన కంగారుల వికెట్ కీపర్ ఆలెక్స్ క్యారీపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 393/8 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా.. ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(141), ఆలెక్స్ క్యారీ(66) టాప్ స్కోరర్లుగా ఆసీస్ స్కోర్ ఆ మాత్రం పెరిగేలా చేశారు. ఈ నేపథ్యంలో ఇంగ్లాంగ్ మాజీ మోర్గాన్ మాట్లాడుతూ ‘‘ఇది (శనివారం) ఆస్ట్రేలియా రోజు అనుకుంటున్నాను. ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చొవడానికి నేను ఇష్టపడతాను. అందుకు క్యారీనే కారణం. ఈ వికెట్‌పై ఆస్ట్రేలియన్ ప్లేయర్లు కొన్ని పరుగులు చేయాలని ఆశించారు. కానీ అది ఖవాజా, కారీ నుంచి సాధ్యమైంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
అయితే శనివారం క్యారీ క్రీజులోకి రాకముందు ఆసీస్ 67 పరుగులకే డేవిడ్ వార్నర్(9), మార్నస్ లాబుషెన్(0), స్టీవ్ స్మిత్(16)ల వికెట్లను కోల్పోయింది. అనంతరం వచ్చిన ట్రావిస్ హెడ్(50).. ఉస్మాన్ ఖావాజాతో కలిసి నాల్గో వికెట్‌కి మెరుగైన భాగస్వామ్యం అందించి 148 పరుగులు వద్ద పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే వచ్చిన ఆలెక్స్ క్యారీ శనివారం ఆట ముగిసేసరికి 52 (80)* పరుగులు చేయగా, ఖవాజా ఇంగ్లాండ్‌పై తన తొలి టెస్ట్ సెంచరీని సాధించాడు.
కాగా, ప్రస్తుతం 4వ రోజు ఆట జరుగుతోంది. ఆదివారమే తమ రెండో ఇన్నింగ్ ప్రారభించిన ఇంగ్లాండ్ టీమ్.. 18 ఓవర్ల ఆట ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. ఇక క్రీజులో జో రూట్(34), హ్యరీ బ్రూక్(1) ఉన్నారు. వీరిద్దరి కంటే ముందు ఓపెనర్లుగా వచ్చిన జాక్ క్రాలే(7), డెన్ డక్కెట్(19).. వన్‌డౌన్ బ్యాట్స్‌మ్యాన్ ఒల్లీ పోప్(14) పరుగులకే వెనుదిరిగారు. ఇక ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ కమ్మిన్స్ 2, స్కాట్ బోలాండ్ 1 వికెట్ తీసుకున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..