
Fastest T20I Century: ప్రస్తుతం భారత్‌లో క్రికెట్ పండుగ జరుగుతున్న వేళ, అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. టీ20లలో రెండుసార్లు ఒకే ఓవర్లో 6 సిక్సర్లు బాదిన నేపాల్ డేంజరస్ బ్యాటర్ దీపేంద్ర సింగ్ ఐరీ, ఇప్పుడు వన్డేల్లోనూ తనదైన ముద్ర వేశాడు. మే 1న యూఏఈతో జరిగిన ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ లీగ్ 2 క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఆయన అద్భుత శతకంతో చెలరేగాడు. కీర్తిపూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన దీపేంద్ర, 94 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్‌తో వంద పరుగులు పూర్తి చేశాడు.
ఈ ఇన్నింగ్స్‌తో నేపాల్ క్రికెట్ చరిత్రలో దీపేంద్ర ఒక అరుదైన హ్యాట్రిక్ సాధించాడు. వరుసగా 3 వన్డే మ్యాచ్‌ల్లో యాభైకి పైగా పరుగులు చేసిన మొదటి నేపాల్ బ్యాటర్‌గా ఆయన రికార్డు సృష్టించాడు. గత మ్యాచ్‌ల్లో 76, 60 పరుగులతో రాణించిన ఆయన, తాజాగా శతకంతో ఈ ఘనతను అందుకున్నాడు. అంతేకాకుండా, వన్డేల్లో నేపాల్ తరపున అత్యధిక శతకాలు బాదిన ఆటగాళ్ల జాబితాలో కెప్టెన్ రోహిత్ పౌడెల్‌తో కలిసి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరి పేరిట చెరో 2 శతకాలు ఉన్నాయి.
#Watch : 9 गेंदें, 50 रन! दीपेंद्र सिंह ऐरी ने इतिहास रच दिया. युवराज सिंह का सबसे तेज 50 का रिकॉर्ड तोड़ा 🔥🏏 #DipendraSinghAiree #NepalCricket #T20I #YuvrajSingh pic.twitter.com/za4oEW5vfn
— Vikas Rawat (@TweetViku) August 18, 2025
2000 సంవత్సరంలో జన్మించిన దీపేంద్ర సింగ్ ఐరీ, తన పవర్‌ఫుల్ హిట్టింగ్‌కు, స్పిన్ బౌలింగ్‌కు పేరుగాంచాడు. ఆయన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అతిపెద్ద అభిమాని. తన అభిమాన క్రికెటర్, కెప్టెన్, కలల బ్యాటింగ్ భాగస్వామి ఎవరని అడిగితే తడుముకోకుండా ధోనీ పేరే చెబుతారు. ధోనీ తరహాలోనే మ్యాచ్‌లను ముగించడంలో ఈయన సిద్ధహస్తుడు. ఇప్పటివరకు 71 వన్డేల్లో 1476 పరుగులు చేయడమే కాకుండా, బంతితో 45 వికెట్లు తీసి అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు.
దీపేంద్ర పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది ఆయన సిక్సర్ల వేట. అంతర్జాతీయ టీ20 చరిత్రలో రెండుసార్లు ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన ఏకైక ఆటగాడు ఆయనే. సెప్టెంబర్ 2023లో మంగోలియాపై మొదటిసారి, ఆ తర్వాత ఏప్రిల్ 2024లో ఖతార్‌పై రెండోసారి ఈ అసాధ్యమైన ఘనతను సాధించాడు. ఈ రికార్డును తిరగరాయడం ఎవరికైనా కష్టతరమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తారు. నేపాల్ క్రికెట్ ఎదుగుదలలో దీపేంద్ర సింగ్ ఐరీ పాత్ర వెలకట్టలేనిది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..