AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: ధోని చేసిన పనికి నేను బలయ్యాను! సంచలన విషయాన్ని బయటపెట్టిన వెంకటేశ్‌ అయ్యర్‌

వెంకటేశ్ అయ్యర్, కోల్‌కతా నైట్ రైడర్స్ వైస్ కెప్టెన్, ఐపీఎల్ 2023లో ధోని తనను అవుట్ చేసిన విధానాన్ని వివరించాడు. ధోని కచ్చితమైన ఫీల్డింగ్ వ్యూహం అయ్యర్‌ను ఆశ్చర్యపరిచింది. అయ్యర్ షాట్ ఆడే విధానాన్ని ముందే ఊహించి ధోని ఫీల్డర్లను ఉంచాడు. ఈ సంఘటన తర్వాత ధోనితో జరిగిన సంభాషణ అయ్యర్‌ను షాక్‌కు గురిచేసింది. అయ్యర్‌ కెకెఆర్‌కు కీలకమైన ఆటగాడు అని తెలుసుకున్నాం.

MS Dhoni: ధోని చేసిన పనికి నేను బలయ్యాను! సంచలన విషయాన్ని బయటపెట్టిన వెంకటేశ్‌ అయ్యర్‌
Ms Dhoni
SN Pasha
|

Updated on: Mar 14, 2025 | 4:53 PM

Share

కోల్‌కతా నైట్ రైడర్స్ వైస్‌ కెప్టెన్‌ వెంకటేశ్‌ అయ్యర్‌.. టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. ధోని ఎంత గొప్ప కెప్టెనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా వెంకటేశ్‌ అయ్యర్‌ ధోని కెప్టెన్సీ గురించి, అతని మాస్టర్ మైండ్‌ గురించి ఓ సంచలన విషయాన్ని వెల్లడించాడు. ఐపీఎల్‌ 2023 సమయంలో జరిగిన ఒక మ్యాచ్‌లో ధోని తనను అవుట్ చేయడానికి రచించిన వ్యూహాన్నివెంకటేష్ వెల్లడించాడు. “ధోని డీప్ స్క్వేర్ లెగ్ నుండి ఒక ఫీల్డర్‌ను తీసేసి, షార్ట్ థర్డ్ సాధారణంగా ఉండే ప్రదేశానికి కొంచెం దూరంగా షార్ట్ థర్డ్‌లో ఫీల్డర్‌ను పెట్టాడు.

ఆ తర్వాతి బంతిని నేను నేరుగా షార్ట్ థర్డ్ చేతుల్లోకి కొట్టాను” అని వెంకటేష్ పేర్కొన్నాడు. ఆ రోజు నాలుగు బంతుల్లో తొమ్మిది పరుగులు చేసిన తర్వాత వెంకటేష్ దీపక్ చాహర్ బౌలింగ్‌లో అవుట్‌ అయ్యాడు. ఆ మ్యాచ్‌ ముగిసిన తర్వాత వెంకటేశ్‌ అయ్యర్‌ ధోనితో కూడా ఈ విషయం గురించి మాట్లాడినట్లు వెల్లడించాడు. దానికి ధోని చెప్పిన సమాధానం తనను షాక్‌కు గురి చేసిందని తెలిపార. “నేను షాట్‌ ఆడితే.. నా బ్యాట్‌ నుంచి బాల్‌ ఏ యాంగిల్‌లో వెళ్తుందో కూడా ధోని గమనించాడు. ఒక వేళ నేను ఫలానా షాట్ కొడితే, అది షార్ట్‌ థర్డ్‌ మ్యాన్‌ మ్యఆ దిశగా వెళ్తుందని ధోనికి ముందే తెలుసు. కాబట్టి అతను అక్కడ ఒక ఫీల్డర్ ని పెట్టాడు. అది నెక్ట్స్‌ లెవెల్‌ కెప్టెన్సీ.

ధోని ఊహించినట్టే నేను అదే షాట్ ఆడి, షార్ట్‌ థర్డ్‌ మ్యాన్‌ చేతుల్లోకి బంతి కొట్టి అవుట్‌ అయ్యాను.” అని అయ్యర్ తెలిపాడు. కాగా అయ్యర్‌ కేకేఆర్‌ టీమ్‌లో కీలక ప్లేయర్‌గా మారిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌ 2025 సీజన్‌ కోసం అయ్యర్‌కు కేకేఆర్‌ రూ.23.75 కోట్లు చెల్లించనుంది. ఇది చాలా భారీ ధర. అయినా కూడా అయ్యర్‌ను తమ ఫ్యూచర్‌ కెప్టెన్‌గా కేకేఆర్‌ భావిస్తున్న క్రమంలో అయ్యర్‌కు అంత ధర పెట్టినట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌తో పాటు దేశవాళి క్రికెట్‌లోనూ అయ్యర్‌ అద్భుతంగా రాణిస్తుండటంతో కేకేఆర్‌ మేనేజ్‌మెంట్‌ అతనిపై నమ్మకం ఉంచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!