MS Dhoni: కోహ్లీతో తనకున్న బాండింగ్‌ గురించి చెప్పిన ధోని! అతను టీమ్‌లోకి వచ్చిన కొత్తలో..

ధోని, కోహ్లీల మధ్య అద్భుతమైన స్నేహం గురించి ధోని తాజాగా వెల్లడించిన విషయాలు వైరల్‌గా మారాయి. కోహ్లీ ధోని కెప్టెన్సీలో రాటుదేలి, ధోని వారసుడిగా కెప్టెన్సీని చేపట్టాడు. ఇద్దరూ ఐపీఎల్‌లో కలిసి ఆడుతున్నప్పటికీ, వారు తరచుగా సంభాషిస్తారని ధోని తెలిపాడు. ఈ స్నేహం క్రికెట్ అభిమానులను మురిపించింది, ఇద్దరు స్టార్ ఆటగాళ్ల అభిమానుల మధ్య పెద్దగా విభేదాలు లేకుండా చేసింది.

MS Dhoni: కోహ్లీతో తనకున్న బాండింగ్‌ గురించి చెప్పిన ధోని! అతను టీమ్‌లోకి వచ్చిన కొత్తలో..
Ms Dhoni Virat Kohli

Updated on: Mar 24, 2025 | 2:51 PM

ఎంఎస్‌ ధోని, విరాట్‌ కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే వారివారి టీమ్స్‌ ఒక్కో విజయం సాధించి మంచి జోష్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో ధోని, విరాట్‌ కోహ్లీతో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సాధారణంగా ధోని తోటి క్రికెటర్లతో తనకున్న బాండింగ్‌ గురించి కానీ, స్నేహం గురించి కానీ పెద్దగా మాట్లాడడు. కానీ, విరాట్‌ కోహ్లీ అంటే మాత్రం ధోనికి కాసింత అభిమానం ఎక్కువే. ధోని కెప్టెన్‌గా ఉన్న సమయంలో ధోని టీమ్‌లోకి వచ్చాడు. అప్పటి నుంచి ధోని కెప్టెన్సీలోనే రాటుదేలిన కోహ్లీ, ధోని వారసుడిగా అతని తర్వాత టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు కూడా అందుకున్నాడు.

తాజాగా కోహ్లీ గురించి ధోని మాట్లాడుతూ.. “ఆరంభంలో కోహ్లీకి నాకు.. ఒక కెప్టెన్‌ ఇంక యంగ్‌ ప్లేయర్‌ మధ్య ఎలాంటి రిలేషన్‌ ఉండేదో అదే ఉంది. కానీ, కాలం గడుస్తున్న కొద్ది మేమిద్దరం మంచి ఫ్రెండ్స్‌ అయిపోయాం. ఇప్పటికీ చాలా విషయాలు పంచుకుంటూ ఉంటాం” అంటూ తెలిపాడు. ధోని అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయి చాలా కాలం అయినా ఐపీఎల్‌ ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో మాత్రమే ధోని, కోహ్లీ కలిసి మాట్లాడుకుంటారని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ, వాళ్లిద్దరూ తరచూ మాట్లాడుకుంటారనే ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని ధోని వెల్లడించడంతో వైరల్‌గా మారింది.

అయితే గతంలో అనేక సార్లు విరాట్‌ కోహ్లీ సైతం ధోని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని అంటే తనకు ఎంతో అభిమానమో కూడా వెల్లడించాడు. ఈ ఇద్దరు క్రికెటర్ల మధ్య ఉన్న ఈ బాండింగ్‌ చూసి క్రికెట్‌ ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. సాధారణంగా ఇద్దరు స్టార్‌ క్రికెటర్ల అభిమానుల మధ్య ఫ్యాన్‌ వార్‌ ఉంటుంది. కానీ, ధోని, కోహ్లీ ఒకరి గురించి ఒకరు ఇలాంటి విషయాలు వెల్లడించడంతో ఈ ఇద్దరు ఆటగాళ్ల అభిమానుల మధ్య పెద్దగా ఫ్యాన్‌ వార్‌ ఉండదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..