DCW vs RCBW WPL 2024 Final: టాస్ గెలిచిన ఢిల్లీ.. ప్లేయింగ్ 11లో తెలుగమ్మాయి..

Delhi Capitals Women vs Royal Challengers Bangalore Women: మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ 2లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ టీం ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలుత బౌలింగ్ చేయనుంది.

DCW vs RCBW WPL 2024 Final: టాస్ గెలిచిన ఢిల్లీ.. ప్లేయింగ్ 11లో తెలుగమ్మాయి..
Dcw Vs Rcbw Final 2024

Updated on: Mar 17, 2024 | 7:13 PM

Delhi Capitals Women vs Royal Challengers Bangalore Women: మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ 2లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ టీం ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలుత బౌలింగ్ చేయనుంది.

ఇరు జట్లు తొలి టైటిల్‌ కోసం ఎదురుచూస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌ రెండోసారి ఫైనల్‌ ఆడుతుండగా, బెంగళూరు తొలిసారి టైటిల్‌ మ్యాచ్‌కి చేరుకుంది. గత సీజన్‌లో ఢిల్లీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ముంబై ఇండియన్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి తొలి టైటిల్‌ను గెలుచుకుంది.

ఇవి కూడా చదవండి

గ్రేట్ ఫామ్‌లో ఢిల్లీ..

ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది. 5 జట్ల లీగ్‌లో ఢిల్లీ జట్టు 8 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. మెగ్ లానింగ్ 8 ఇన్నింగ్స్‌లలో 308 పరుగులతో ముందుండి నడింపింది. దక్షిణాఫ్రికా ఆల్-రౌండర్ మరియాన్నే కాప్, ఆస్ట్రేలియా లెఫ్టార్మ్ స్పిన్నర్ జెస్ జోనాస్సెన్ 11 వికెట్లు తీశారు.

ఈ సీజన్‌లో ఢిల్లీకి రెండుసార్లు మాత్రమే ఓటమి ఎదురైంది. ఢిల్లీని ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ ఓడించింది.

ఇరుజట్ల ప్లేయింగ్ 11:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, సబ్బినేని మేఘన, ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్ (కీపర్), సోఫీ మోలినక్స్, జార్జియా వేర్‌హామ్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, శ్రద్ధా పోఖర్కర్, రేణుకా థాకర్కర్, రేణుక.

ఢిల్లీ క్యాపిటల్స్(ప్లేయింగ్ XI): మెగ్ లానింగ్(కెప్టెన్), షఫాలీ వర్మ, అలిస్ క్యాప్సే, జెమిమా రోడ్రిగ్స్, మారిజాన్ కాప్, జెస్ జోనాస్సెన్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, తానియా భాటియా(కీపర్), శిఖా పాండే, మిన్ను మణి.

ఇప్పటి వరకు డీసీపై ఆర్‌సీబీ గెలవలే..

ఇప్పటి వరకు ఆర్‌సీబీతో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ డీసీ టీమ్ గెలిచింది. అయితే ఫైనల్‌లో గత ప్రదర్శన పర్వాలేదు. ఇది కొత్త రోజు, కొత్త మ్యాచ్. ఇందులో ఒత్తిడిని తట్టుకునే జట్టు మాత్రమే ట్రోఫీని అందుకుంటుంది.

లానింగ్‌, షఫాలీ వర్మల నుంచి ఢిల్లీ శుభారంభం పొందాలని భావిస్తోంది. మిడిల్ ఆర్డర్‌లో జెమిమా రోడ్రిగ్స్ కూడా ఫామ్‌లో ఉంది. అయితే, ఆల్ రౌండర్లు ఎలిస్ క్యాప్సే, కాప్ మెరుగైన ప్రదర్శన చేస్తారని భావిస్తున్నారు. బౌలింగ్‌లో జోనాస్సేన్, కాప్, శిఖా పాండేలు మంచి ప్రదర్శన చేశారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రాధా యాదవ్ కూడా పది వికెట్లు పడగొట్టింది. కోట్లా స్లో పిచ్‌లో ఆమె పాత్ర చాలా ముఖ్యమైనది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..