Delhi Capitals vs Lucknow Super Giants: ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం (మే14) జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 19 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్‌పై విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది ఢిల్లీ. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ తమ లీగ్ మ్యాచ్‌లన్నింటినీ ముగించింది. కాబట్టి ఇప్పుడు ప్లేఆఫ్‌ల నెట్ రన్ రేట్‌తో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధార పడి ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేసింది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్‌ను తక్కువ పరుగులకే పరిమితం చేయడంలో విఫలమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో పవర్ ప్లేలో నే కీలక వికెట్లు కోల్పోయింది. దాంతో ఒత్తిడి పెరిగింది. మిడిలార్డర్‌లో నికోలస్ పూరన్ ఒంటరి పోరాటం చేశాడు. అలాగే అర్షద్ ఖాన్ మ్యాచ్ లో మెరుపులు మెరిపించాడు. అయితే టార్గెట్ మరీ పెద్దది కావడంతో లక్నోకు పరాజయం తప్పలేదు. ఆఖరికి లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేయగలిగింది. ఈ ఓటమి కారణంగా లక్నో సూపర్‌జెయింట్ ప్లేఆఫ్‌కు చేరుకోవడం కష్టతరంగా మారింది. నెట్ రన్‌రేట్ చాలా దారుణంగా ఉంది.
అభిషేక్ పోరెల్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, షాయ్ హోప్, రిషబ్ పంత్ (కెప్టెన్ /వికెట్ కీపర్) , ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, గుల్బాదిన్ నాయబ్, రసిఖ్ దార్ సలామ్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్
KL రాహుల్ (కెప్టెన్ /వికెట్ కీపర్), క్వింటన్ డి కాక్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్ చరక్, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్
మణిమారన్ సిద్ధార్థ్, దేవదత్ పడిక్కల్, ఆయుష్ బదోని, ప్రేరక్ మన్కడ్, కృష్ణప్ప గౌతమ్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..