Rishabh Pant: పంత్‌ మ్యాచ్‌లు ఆడకపోయినా పర్లేదు.. నవ్వుతూ పక్కనుంటే చాలు.. రికీ పాంటింగ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్

|

Jan 21, 2023 | 6:20 AM

ఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహిస్తున్నాడు రిషబ్‌. దీంతో ఈసారి అతని సేవలను ఢిల్లీ జట్టు కోల్పోనుంది. ఇక పంత్‌ స్థానంలో డేవిడ్‌ వార్నర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Rishabh Pant: పంత్‌ మ్యాచ్‌లు ఆడకపోయినా పర్లేదు.. నవ్వుతూ పక్కనుంటే చాలు.. రికీ పాంటింగ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్
Rishabh Pant
Follow us on

గతేడాది చివరిలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ టీమిండియా వికెట్ కీపర్ రిషబ్‌ పంత్ క్రమంగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్ లో అతను చికిత్స పొందుతున్నాడు. పంత్‌ పూర్తిగా కోలుకోవడానికి సుమారు ఆరు నెలలు పట్టే అవకాశం ఉందని వైద్యులు ఇప్పటికే పేర్కొన్నారు. దీంతో ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌- 2023 సీజన్‌కు కూడా పంత్‌ దూరం కానున్నాడీ స్టార్‌ క్రికెటర్‌. కాగా ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహిస్తున్నాడు రిషబ్‌. దీంతో ఈసారి అతని సేవలను ఢిల్లీ జట్టు కోల్పోనుంది. ఇక పంత్‌ స్థానంలో డేవిడ్‌ వార్నర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తోన్న రికీ పాంటింగ్‌ రిషబ్‌ పంత్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి ఐపీఎల్‌లో పంత్‌ ఆడకపోయినా పర్లేదు.. కానీ డగౌట్‌లో నా పక్కన కూర్చుంటే చాలు అని పేర్కొన్నాడు.

పంత్ అంటే నాకు చాలా ఇష్టం

రిషబ్‌ పంత్‌ లాంటి వ్యక్తులను భర్తీ చేయలేం. అంతే. అలాంటి ప్లేయర్స్ చెట్లపై పెరగరు. పంత్ స్థానంలో వచ్చే వికెట్ కీపర్ బ్యాటర్ కోసం మేం బాగా వెతకాలి. అయితే ఈ సీజన్‌లో పంత్‌ ఆడకపోయినా పర్లేదు. అతను ఓ సారథి గానే కాదు.. అతని నవ్వు జట్టులో సానుకూల దృక్పథాన్ని నింపుతుంది. ఒకవేళ అతను జర్నీకి సిద్ధంగా ఉండి, టీమ్ తో పాటు రాగలిగితే.. నాతోపాటు డగౌట్ లో కూర్చోవాలని కోరుకుంటున్నాను. మార్చి నెలలో మేం క్యాంప్ ఏర్పాటు చేయబోతున్నాం. అప్పటిలోగా అతడు రాగలిగితే టీమ్ తో పాటు ఉండాల్సిందిగా కోరుకుంటున్నా. పంత్ అంటే నాకు చాలా ఇష్టం. అతను త్వరగా కోలుకోవాలని మళ్లీ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నా’ అని చెప్పుకొచ్చాడు పాంటింగ్‌.

ఇవి కూడా చదవండి

కాగా ఈ ఛాంపియన్ ప్లేయర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే కాకుండా టీమ్ ఇండియా కూడా కోల్పోనుంది. వచ్చే నెల నుంచి ఆస్ట్రేలియాతో 4 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభం కానుంది. రిషబ్ పంత్ గైర్హాజరు ఆస్ట్రేలియా జట్టుకు లాభించే విషయమే. ఎందుకంటే కంగారూలపై పంత్ కు అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. గతంలో తన  ఆటతీరుతో  స్వదేశంలో ఆస్ట్రేలియాను ఓడించాడు. గాబాలో పంత్ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా నుండి మ్యాచ్, సిరీస్ రెండింటినీ కైవసం చేసుకుంది. ఇప్పుడు టీమ్ ఇండియాలో పంత్ లేకపోవడం కంగారూ బౌలర్లకు ఉపశమనం కలిగించే విషయమే.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..