David Warner: సరదాగా రీల్ పోస్ట్ చేసిన వార్నర్.. ‘తెలుగు పాటలను వదిలేస్తున్నావా..?’ అంటున్న అభిమానులు..

డేవిడ్ వార్నర్ మైదానంలో ఎప్పుడు ఎలా ఆడతాడో ఎవరూ ఊహించలేరు. ఎందుకంటే మామ ఆడిందే ఆట, పాడిందే పాట. ఇక మైదానంలో బ్యాట్‌తో, మైదానం బయట తన హవభావాలతో అభిమానులకు సంతోషాన్ని అందించడంలో వార్నర్

David Warner: సరదాగా రీల్ పోస్ట్ చేసిన వార్నర్.. ‘తెలుగు పాటలను వదిలేస్తున్నావా..?’ అంటున్న అభిమానులు..
David Warner
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 27, 2023 | 9:44 AM

ఐపీఎల్ అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్. ప్రత్యర్థి వికెట్ పడగానే బౌలర్లు వేసే స్టెప్పులు, విన్యాసాలు క్రికెట్ అభిమానులనే కాక సాధారణ వీక్షకులకు కూడా వినోదాన్ని అందిస్తాయి. ఇక అవన్నీ ఒక ఎత్తయితే మన వార్నర్ మామ రీల్స్ మరో ఎత్తు. డేవిడ్ వార్నర్ మైదానంలో ఎప్పుడు ఎలా ఆడతాడో ఎవరూ ఊహించలేరు. ఎందుకంటే మామ ఆడిందే ఆట, పాడిందే పాట. ఇక మైదానంలో బ్యాట్‌తో, మైదానం బయట తన హవభావాలతో అభిమానులకు సంతోషాన్ని అందించడంలో వార్నర్ తనకు తానే సాటి. మరోవైపు రానున్న నాలుగు రోజులలో ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో ఢిల్లీ కాపిటల్స్ సారథిగా బాధ్యతలు నిర్విర్తిస్తున్న వార్నర్ ఐపీఎల్ కాకముందే ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. ఫీల్డ్‌లో దిగితే  ప్రేక్షకుల ముందు నానా రచ్చ చేసే వార్నర్.. తాజాగా ఓ రీల్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ చేశాడు. ఢిల్లీ జెర్సీలో ‘కామ్ డౌన్’.. వచ్చేస్తున్న అన్నట్లుగా స్టెప్పులు కూడా వేశాడు.

ఇటీవలి కాలంలో నెట్టింట వైరల్ అవుతున్న ‘కామ్ డౌన్’ పాటకు స్టెప్పులేసిన వార్నర్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకా ‘షూట్ డేస్ ఆర్ లైక్ ఫన్’ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చాడు వార్నర్. ఇక తమకెంతో ఇష్టమైన వార్నర్ మామ పోస్ట్ పెడితే అభిమానులు ఊరుకుంటారా..? దానిపై లైకులు, కామెంట్లు, షేర్ల వర్షం కురిపిస్తున్నారు.  దీనిపై వార్నర్ భార్య క్యాండీ వార్నర్ స్పందించి..  ‘నా కోసం ఎందుకిలా డ్యాన్స్ చేయవు నువ్వు..?’ అంటూ రాసుకొచ్చింది. మరోవైపు వార్నర్ మామ పోస్ట్‌పై తెలుగు అభిమానులు కూడా స్పందిస్తున్నారు. ‘తెలుగు పాటలు వదిలేస్తున్నావా అన్నా..?’ అంటూ ఒక అభిమాని, ‘డేవిడ్ అన్నా నువ్వు కింగ్‌వి..’ అంటూ మరో అభిమాని రాసుకొచ్చారు. ఇదే క్రమంలో ఇంకకో అభిమాని ‘ఆటలో  నువ్వు ఫెయిలైన సందర్భాలు ఉండొచ్చు గానీ  అభిమానులను ఎంటర్టైన్ చేయడంలో నిన్ను మించినోడు లేడన్న..’ అంటూ కామెంట్ చేశాడు.  ‘తెలుగు, తెలుగు పాటలను మర్చిపోయావా అన్నా.. అంతేనా..?’ అంటూ మరో అభిమాని రాసుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

అయితే ఢిల్లీ క్యాపిటల్స్(2022 నుంచి) కంటే ముందు.. అంటే 2016 నుంచి 2021 దాకా వార్నర్.. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వార్నర్ కోట్లాది మంది తెలుగు అభిమానులను సంపాదించుకున్నాడు. తెలుగు డైలాగులు చెప్పడం, తెలుగు పాటలతో పాటు బాలీవుడ్ ఫేమస్ సాంగ్స్‌కు డాన్సులు చేయడం ద్వారా అస్ట్రేలియాలో కంటే భారత్‌లోనే ఎక్కువ ఫేమస్ అయ్యాడు. ఇక ఈ సీజన్‌ ప్రారంభానికి కొన్ని నెలల ముందే రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అతను ఈ 16వ సీజన్‌కు ఆడలేడని అటు వైద్యులు, ఇటు ఢిల్లీ ఫ్రాంచైజీ ప్రకటించింది. ఫలితంగా  ఈ సీజన్‌లో డేవిడ్ వార్నర్‌కు ఢిల్లీ  సారథ్య పగ్గాలు అందాయి. అలాగే ఈ ఏడాది  ఢిల్లీ తమ తొలి మ్యాచ్‌ను లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..