34 బంతుల్లో విధ్వంసం సృష్టించాడు.. టెస్టు మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ.. ఎవరో తెలుసా.!

| Edited By: Anil kumar poka

Oct 26, 2021 | 7:30 PM

క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ డేవిడ్ మిల్లర్(35 బంతుల్లో) పేరిట ఉండగా..

34 బంతుల్లో విధ్వంసం సృష్టించాడు.. టెస్టు మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ.. ఎవరో తెలుసా.!
Cricket
Follow us on

క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ డేవిడ్ మిల్లర్(35 బంతుల్లో) పేరిట ఉండగా.. వన్డేల్లో ఏబీ డివిలియర్స్(31 బంతుల్లో) ఈ ఘనత సాధించాడు. ఇక టెస్టుల్లో న్యూజిలాండ్‌ ఆటగాడు బ్రెండన్‌ మెకల్లమ్‌(54 బంతుల్లో) ఫాస్టెస్ట్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. అయితే నేటికి టెస్టుల్లో నమోదైన ఓ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఇప్పటికీ అలాగే ఉంది. 39 ఏళ్ల క్రితం కేవలం 34 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు ఓ బ్యాట్స్‌మెన్. అది కూడా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో జరిగింది. ఇక ఆ ఆటగాడి పేరు డేవిడ్ హుక్స్. ఆ మ్యాచ్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే..

ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ హుక్స్ ఎడమ చేతి బ్యాట్స్‌మన్. అతడు అడిలైడ్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో విక్టోరియాపై తుఫాను ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో సౌత్ ఆస్ట్రేలియా తరపున బ్యాటింగ్‌కు దిగిన హుక్స్.. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. టెస్టు మ్యాచ్‌లో గెలవాలంటే.. విక్టోరియా విధించిన 270 పరుగుల చేయాలి. అది కూడా 30 ఓవర్లలో చేధించాలి. ఈ పరిస్థితిలో బ్యాటింగ్‌కు దిగిన హుక్స్.. 55 నిమిషాల్లో మొత్తంగా 107 పరుగులు సాధించాడు. 34 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. అయితే ఈ మ్యాచ్ చివరికి డ్రాగా ముగిసింది.

హుక్స్ అంతర్జాతీయ కెరీర్ ఎక్కువ కాలం నిలవలేదు…

డేవిడ్ హుక్స్ తన ఇంటర్నేషనల్ కెరీర్‌లో 23 టెస్టులు ఆడాడు. మొత్తంగా 34.36 సగటుతో 1306 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, ఎనిమిది అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. ఇక తన కెరీర్‌లో 178 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన హుక్స్.. 43.99 సగటుతో 12671 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 306 నాటౌట్. 32 సెంచరీలు, 65 అర్ధ సెంచరీలు నమోదు చేసిన హుక్స్.. 82 లిస్ట్ A మ్యాచ్‌లలో 2041 పరుగులు చేశాడు.

Read Also: ఆ ఒక్క కారణమే.. సమంతకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది..!! అందుకే అలా చేసింది.

డాగ్జిల్లా Vs కాంగ్.. కర్ర తీసుకుని కుక్కను కొట్టిన కోతి.. క్రేజీ వీడియో నెట్టింట వైరల్!

రోజూ భార్యతో గొడవలు.. చివరికి భర్త ఏం పని చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

వార్నర్, విలియమ్సన్, నబీ మెగా ఆక్షన్‌లోకి.! వచ్చే ఏడాది మారనున్న సన్‌రైజర్స్ జట్టు..