CWC 2023, IND vs SA: సౌతాఫ్రికాతో హోరాహోరీ పోరుకు టీమిండియా రెడీ.. రోహిత్ ఏమన్నాడంటే?

India vs South Africa, ICC World Cup 2023: టెంబా బావుమా సారథ్యంలో దక్షిణాఫ్రికా ప్రస్తుత టోర్నీలో ఇప్పటివరకు ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయింది. ఇది కాకుండా మిగతా ఆరు మ్యాచ్‌లు గెలిచి 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో భారత్ తర్వాత రెండో స్థానంలో ఉంది. భారత్‌ను ఓడించడం ద్వారా దక్షిణాఫ్రికా సెమీస్‌లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.

CWC 2023, IND vs SA: సౌతాఫ్రికాతో హోరాహోరీ పోరుకు టీమిండియా రెడీ.. రోహిత్ ఏమన్నాడంటే?
రోహిత్ శర్మ, మార్క్రమ్, మలాన్, రాహుల్‌తో మరికొంత మంది ప్లేయర్లు తలో సెంచరీ చేశారు.

Updated on: Nov 03, 2023 | 7:40 PM

India vs South Africa: ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 (CWC 2023)లో ఆతిథ్య భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఆడిన 7 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి, ఓటమి ఎరగకుండా ముందుకు సాగుతోంది. మొత్తంగా 7 విజయాలతో ఖాతాలో 14 పాయింట్ల చేరాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. గురువారం, భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team) శ్రీలంకను 302 పరుగుల తేడాతో ఘోరంగా ఓడించి ప్రపంచ కప్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. అయితే, తర్వాతి లీగ్ గేమ్‌లో నవంబర్ 5న కోల్‌కతాలో భారత్‌తో సమానంగా రాణిస్తున్న దక్షిణాఫ్రికా (IND vs SA)తో తలపడనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా దక్షిణాఫ్రికా జట్టు ఆటను మెచ్చుకుంటూ కీలక విషయం ప్రకటించాడు.

టెంబా బావుమా సారథ్యంలో దక్షిణాఫ్రికా ప్రస్తుత టోర్నీలో ఇప్పటివరకు ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయింది. ఇది కాకుండా మిగతా ఆరు మ్యాచ్‌లు గెలిచి 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో భారత్ తర్వాత రెండో స్థానంలో ఉంది. భారత్‌ను ఓడించడం ద్వారా దక్షిణాఫ్రికా సెమీస్‌లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.

ఈ టోర్నీలో సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్ వేరే స్థాయిలో ఉంది. ముఖ్యంగా మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, ప్రత్యర్థి బౌలర్లను నాశనం చేసింది. ప్రోటీస్ జట్టు మొదట బ్యాటింగ్ చేసిన అన్ని మ్యాచ్‌ల్లోనూ 300 కంటే ఎక్కువ స్కోరు నమోదు చేశారు. ఓ మ్యాచ్‌లో 400 దాటించారు.

రోహిత్ శర్మ ఏమన్నాడంటే..

శ్రీలంక మ్యాచ్ తర్వాత, పోస్ట్ ప్రెజెంటేషన్ వేడుకలో, దక్షిణాఫ్రికాతో జట్టు తదుపరి ఎన్‌కౌంటర్ గురించి భారత కెప్టెన్‌ను అడిగారు. దీనిపై రోహిత్ మాట్లాడుతూ.. వాళ్లు చాలా బాగా క్రికెట్ ఆడుతున్నారు. మేం కూడా బాగా ఆడుతున్నాం. కాబట్టి, ఇది మంచి మ్యాచ్ అవుతుంది. కోల్‌కతా ప్రజలు ఈ మ్యాచ్‌ను తప్పకుండా ఆనందించబోతున్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు.

ODI ప్రపంచకప్ చరిత్రలో, భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు జరిగాయి. భారత జట్టు మొదటి మూడు మ్యాచ్‌లలో ఓడిపోయింది. చివరి రెండు మ్యాచ్‌లలో విజయం సాధించింది.

ఇరుజట్ల స్వ్కాడ్స్:

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్.

దక్షిణాఫ్రికా జట్టు: క్వింటన్ డి కాక్(కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, లుంగీ న్గిడి, తబ్రైజ్ షమ్సీ, రీజా హెండ్రిక్స్, రీజా హెండ్రిక్స్ రబడ, ఆండిలే ఫెహ్లుక్వాయో, లిజాద్ విలియమ్స్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..