ధోనిపై పూలు..రాళ్లు! సంజయ్ పొగిడాడా? తిట్టాడా?

|

Jul 02, 2019 | 2:49 PM

ఎమ్మెస్ ధోని. టీమిండియా సీనియర్ ఆటగాడు. పలు మెగా టోర్నీలను ఇండియాకు అందించిన సారథిగానే కాకుండా..ఒక ఆటగాడిగా కూడా టీమిండియాకు ఎన్నో సేవలందించాడు. ఎంత స్వీటైనా తినగా..తినగా వెగటు వేస్తుంది అన్న చందంగా.. ప్రస్తుత వరల్డ్ కప్‌లో ధోని ప్రదర్శన పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు మాత్రమే కాకుండా పలువురు సీనియర్ ఆటగాళ్లు సైతం ‘తలా’ బ్యాటింగ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారిలో సంజయ్ మంజ్రేకర్ కూడా ఒకరు. ధోని బ్యాటింగ్‌కి దిగినప్పటి నుంచి బంతికి […]

ధోనిపై పూలు..రాళ్లు! సంజయ్ పొగిడాడా? తిట్టాడా?
Follow us on

ఎమ్మెస్ ధోని. టీమిండియా సీనియర్ ఆటగాడు. పలు మెగా టోర్నీలను ఇండియాకు అందించిన సారథిగానే కాకుండా..ఒక ఆటగాడిగా కూడా టీమిండియాకు ఎన్నో సేవలందించాడు. ఎంత స్వీటైనా తినగా..తినగా వెగటు వేస్తుంది అన్న చందంగా.. ప్రస్తుత వరల్డ్ కప్‌లో ధోని ప్రదర్శన పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు మాత్రమే కాకుండా పలువురు సీనియర్ ఆటగాళ్లు సైతం ‘తలా’ బ్యాటింగ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వారిలో సంజయ్ మంజ్రేకర్ కూడా ఒకరు. ధోని బ్యాటింగ్‌కి దిగినప్పటి నుంచి బంతికి ఒకో పరుగు చొప్పున రన్స్ తీసేలా చెప్పమని మేనేజ్‌మెంట్‌కి సలహా ఇచ్చాడు ఈ మాజీ ప్లేయర్. దీంతో ధోని ఫ్యాన్స్ భగ్గుమన్నారు. అతను ఏ పరిస్థితుల్లో అలా ఆడుతున్నారో గమనించాలని..చెప్పే వాళ్లంగా గ్రౌండ్‌లోకి దిగి బ్యాటింగ్ చేస్తే తెలుస్తుందంటూ భారీగానే వ్యగ్యాంస్త్రాలు సంధించారు.

పరిస్థితిని గమనించింన సంజయ్ యూ టర్న్ తీసుకున్నాడు. ఈ వయసులో ధోనీని నిందించడం సరికాదని, అతడికి బదులు కేఎల్‌ రాహల్ వంటి యువకులు జట్టుని గెలిపించేందుకు బాధ్యతలు తీసుకోవాలని తెలిపాడు. మీడియా ధోనీపై ఎక్కువ దృష్టిసారించవద్దని.. నిజంగా ఎవరైనా టీమిండియా అభిమానే అయితే రాహుల్‌ మీద ఒత్తిడి తీసుకురావాలని పేర్కొన్నాడు.

కాగా 5వ ఆటగాడిగా ధోని గ్రౌండ్‌లోకి రావడంతో సహజంగానే అతనిపై ఒత్తిడి ఉంటుంది. అతడు గ్రౌండ్‌లో కుదురుకుని..భారీ షాట్లు ప్రయత్నించేటప్పటికి టార్గెట్ అధికంగా ఉండటం వంటి కారణాలు.. ధోని భారీ స్కోర్లు చేస్తున్నప్పటికి టీం విజయానికి దోహదపడలేకపోయాయి.