సుమారు నెలన్నర రోజుల పాటు క్రికెట్ అభిమానులను అలరిస్తోన్న ఐపీఎల్ ముగిసింది. ఎంఎస్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి ధనాధాన్ లీగ్ ట్రోఫీని కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన ఫైనల్‌లో సీఎస్కే 5 వికెట్ల తేడాతో (డక్ వర్త్ లూయిస్) గుజరాత్‌పై విజయం సాధించింది సీఎస్కే. దీంతో చెన్నై ఆటగాళ్ల ఆనందానికి హద్దులేకుండా పోయాయి. మ్యాచ్ ప్రజెంటేషన్ అనంతరం చెన్నై ఆటగాళ్లతో పాటు వారి భార్య, పిల్లలు కూడా ఐపీఎల్ ట్రోఫీలతో కలిసి కెమెరాలకు పోజులిచ్చారు. ఈ క్రమంలో సీఎస్కే ఓపెనర్, టీమిండియా యంగ్ సెన్సేషన్ రుతురాజ్ గైక్వాడ్ ఒక అందమైన అమ్మాయితో కలిసి ఐపీఎల్ ట్రోఫీతో ఫొటోలు దిగాడు. ఆ అమ్మాయి మరెవరో కాదు రుతురాజ్‌కు కాబోయే సతీమణినే. తన పేరు ఉత్కర్ష. వీరి ద్దరి పెళ్లి జూన్ 3-4 తేదీల్లో జరగనుందని తెలుస్తోంది. అందుకే వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ నుంచి కూడా విశ్రాంతి తీసుకున్నాడని తెలుస్తోంది.
కాగా 26 ఏళ్ల రుతురాజ్ మొదటిసారిగా 2020 ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సీజన్ లో సీఎస్కే తరఫున కేవలం 6 మ్యాచులే ఆడినప్పటికీ 204 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత సీజన్ లో అన్నీ మ్యాచ్ లు ఆడి 635 రన్స్ కొట్టాడు. గతేడాది 368 రన్స్ కొట్టాడు. ఇక ఈసారి మాత్రం ఏకంగా 590 పరుగులు చేసి చెన్నై కప్ కొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. రుతురాజ్ ఇప్పటికే టీమిండియా తరఫున కొన్ని టీ 20 మ్యాచ్‌లు కూడా ఆడాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..