AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK : సిఎస్కేకి ఇది దెబ్బ మీద దెబ్బ.. కొత్తగా వచ్చిన ఈ కుర్రాడైనా ఆదుకుంటాడా?

CSK : ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. గాయపడిన రామకృష్ణ ఘోష్ స్థానంలో కర్ణాటక ఆల్ రౌండర్ మెక్‌నీల్ నోరోన్హాను జట్టులోకి తీసుకుంది. లీగ్ స్టేజ్‌లో ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉండగా, ప్లే ఆఫ్ రేసులో నిలవడానికి ఈ మార్పు ఎంతో కీలకం కానుంది.

CSK : సిఎస్కేకి ఇది దెబ్బ మీద  దెబ్బ.. కొత్తగా వచ్చిన ఈ కుర్రాడైనా ఆదుకుంటాడా?
Csk
Rakesh
|

Updated on: May 13, 2026 | 3:18 PM

Share

CSK : ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న వేళ ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఒక కీలకమైన మార్పు చేసింది. జట్టులో వరుసగా ఆటగాళ్లు గాయాల బారిన పడుతుండటంతో మేనేజ్‌మెంట్ ఆందోళన చెందుతోంది. ఈ క్రమంలోనే గాయపడిన యువ పేసర్ రామకృష్ణ ఘోష్ స్థానంలో కర్ణాటకకు చెందిన పవర్‌ఫుల్ ఆల్ రౌండర్ మెక్‌నీల్ హాడ్లీ నోరోన్హాను జట్టులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. లీగ్ స్టేజ్‌లో ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉండగా, ప్లే ఆఫ్ రేసులో నిలవడానికి ఈ మార్పు ఎంతో కీలకం కానుంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన రామకృష్ణ ఘోష్, తన తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన డైవింగ్ క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. అయితే, బౌలింగ్ చేస్తున్న సమయంలో పాదం మడతపడటంతో అతడి కుడి పాదం ఫ్రాక్చర్ అయ్యింది. దీంతో ఈ సీజన్ మొత్తానికి అతడు దూరం కావలసి వచ్చింది. గెట్ వెల్ సూన్ రాంబో అంటూ సిఎస్కే తన సోషల్ మీడియాలో అతడికి వీడ్కోలు పలికింది.

ఎవరీ మెక్‌నీల్ నోరోన్హా?

24 ఏళ్ల మెక్‌నీల్ నోరోన్హా కర్ణాటక క్రికెట్‌లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా 2025 మహారాజా ట్రోఫీలో మంగళూరు డ్రాగన్స్ తరఫున ఆడి 253 పరుగులు చేయడంతో పాటు 10 వికెట్లు తీసి ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతడు కేవలం బ్యాటర్ మాత్రమే కాదు, మంచి ఆఫ్ స్పిన్నర్ కూడా. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ కర్ణాటక తరఫున ఆడిన అనుభవం అతడికి ఉంది. సిఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ.. బీసీసీఐ అనుమతి కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు.

గాయాలతో సతమతమవుతున్న సిఎస్కే

ఈ సీజన్ చెన్నైకి అస్సలు కలిసి రావడం లేదు. ఇప్పటికే కీలక బౌలర్ ఖలీల్ అహ్మద్, యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే గాయాల వల్ల జట్టుకు దూరమయ్యారు. ఇక స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోనీ కూడా సీజన్ ఆరంభం నుంచి పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నారు. నాథన్ ఎల్లిస్, స్పెన్సర్ జాన్సన్ వంటి విదేశీ ప్లేయర్లు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ జట్టు ఎంపికలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు.

ప్లే ఆఫ్ రేసులో సిఎస్కే పరిస్థితి

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ క్లిష్ట పరిస్థితిలో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌లు గెలవడం జట్టుకు అత్యంత అవసరం. ఇలాంటి సమయంలో మెక్‌నీల్ నోరోన్హా వంటి ఆల్ రౌండర్ జట్టులోకి రావడం బలాన్ని ఇస్తుందని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అతడి హిట్టింగ్ సామర్థ్యం డెత్ ఓవర్లలో జట్టుకు ఉపయోగపడే అవకాశం ఉంది. కొత్త ప్లేయర్ తన అదృష్టాన్ని ఎలా పరీక్షించుకుంటాడో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సినిమాల జాతకం మాకు ముందే తెలిసిపోతుంది..
సినిమాల జాతకం మాకు ముందే తెలిసిపోతుంది..
గొంతులోని కఫాన్ని కరిగించి, జలుబుకు చెక్ పెట్టే మిరియాల పులిహోర
గొంతులోని కఫాన్ని కరిగించి, జలుబుకు చెక్ పెట్టే మిరియాల పులిహోర
గ్యాస్ సిలిండర్ల డెలివరీలకు ఇకపై ఓటీపీ అక్కర్లేదు.. నో టెన్షన్
గ్యాస్ సిలిండర్ల డెలివరీలకు ఇకపై ఓటీపీ అక్కర్లేదు.. నో టెన్షన్
కాసేపట్లో ఏపీ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. గెలిచేదవరో!
కాసేపట్లో ఏపీ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. గెలిచేదవరో!
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసిన దిగ్గజ ప్లేయర్.. ఎవరంటే?
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసిన దిగ్గజ ప్లేయర్.. ఎవరంటే?
ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురుసు తుఫాను..
ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురుసు తుఫాను..
సైక్లోన్ మురసు ఎఫెక్ట్.. ఈ జిల్లాలో అతి భారీ వర్షాలు
సైక్లోన్ మురసు ఎఫెక్ట్.. ఈ జిల్లాలో అతి భారీ వర్షాలు
గోల్డ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. దీపావళి క్రమంలో ధరల్లో మార్పులు
గోల్డ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. దీపావళి క్రమంలో ధరల్లో మార్పులు
తీరం దాటుతున్న మురసు తుపాన్.. ఈ ప్రాంతాల్లో కుండపోత వానలు..
తీరం దాటుతున్న మురసు తుపాన్.. ఈ ప్రాంతాల్లో కుండపోత వానలు..
రాశిఫలాలు: ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ విషయాల్లో వారికి గుడ్‌న్యూస్
రాశిఫలాలు: ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ విషయాల్లో వారికి గుడ్‌న్యూస్