IPL 2026 : ట్రేడింగ్ ద్వారా వచ్చినా లాభం లేదు.. CSK కెప్టెన్సీ ఛాన్స్ మిస్ చేసుకున్న సంజు శాంసన్
ఐపీఎల్ అభిమానుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న ఒక కీలక ప్రకటన వచ్చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ తమ కెప్టెన్‌ను అధికారికంగా ఖరారు చేసింది. అందరూ ఊహించినట్లుగా రాజస్థాన్ రాయల్స్ నుంచి ట్రేడింగ్ ద్వారా CSK లోకి వచ్చిన సంజు శాంసన్ కెప్టెన్ అవుతారని భావించినా, CSK యాజమాన్యం ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టింది.

IPL 2026 : ఐపీఎల్ అభిమానుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న ఒక కీలక ప్రకటన వచ్చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ తమ కెప్టెన్‌ను అధికారికంగా ఖరారు చేసింది. అందరూ ఊహించినట్లుగా రాజస్థాన్ రాయల్స్ నుంచి ట్రేడింగ్ ద్వారా CSK లోకి వచ్చిన సంజు శాంసన్ కెప్టెన్ అవుతారని భావించినా, CSK యాజమాన్యం ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టింది. రాబోయే సీజన్‌లో కూడా రుతురాజ్ గైక్వాడ్ నే తమ యెల్లో ఆర్మీకి నాయకత్వం వహిస్తారని CSK ప్రకటించింది. దీంతో శాంసన్‌కు కెప్టెన్సీ ఛాన్స్ మిస్ అయింది.
రుతురాజ్ గైక్వాడ్ మొదటిసారిగా ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు ఎంఎస్ ధోనీ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నారు. అయితే, ఐపీఎల్ 2024లో CSK 14 మ్యాచ్‌లలో 7 విజయాలు సాధించి పాయింట్స్ టేబుల్‌లో ఐదవ స్థానంలో నిలిచింది. ఐపీఎల్ 2025లో రుతురాజ్ కేవలం 5 మ్యాచ్‌లలో మాత్రమే కెప్టెన్సీ చేసి గాయం కారణంగా తప్పుకోవడంతో, ధోనీ తిరిగి జట్టును నడిపించారు. దురదృష్టవశాత్తు ఆ సీజన్‌లో CSK 4 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో చివరి స్థానంలో నిలిచింది. దీంతో వరుసగా రెండు సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేరడంలో విఫలమైన CSKకు, ఐపీఎల్ 2026లో రుతురాజ్ కెప్టెన్‌గా పుంజుకోవాల్సిన బాధ్యత ఉంది.
రాజస్థాన్ రాయల్స్‌కు ఐపీఎల్ 2021 నుంచి 2025 వరకు సంజు శాంసన్ కెప్టెన్‌గా వ్యవహరించారు. అతని సారథ్యంలో RR జట్టు ఐపీఎల్ 2022లో అద్భుతమైన ప్రదర్శన చేసి ఫైనల్ వరకు వెళ్లింది. ఆ తర్వాత RR మళ్లీ ఫైనల్ ఆడలేదు. RR తరఫున మొత్తం 67 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన శాంసన్.. 33 విజయాలు, 32 ఓటములు, 2 నో రిజల్ట్స్ రికార్డును కలిగి ఉన్నారు. ట్రేడింగ్ ద్వారా శాంసన్ CSKలోకి రావడంతో, RR కూడా కొత్త కెప్టెన్‌ను ఎంచుకోవాల్సి ఉంది.
రాజస్థాన్ రాయల్స్‌కు కొత్త కెప్టెన్ ఎవరు?
సంజు శాంసన్ CSKలోకి వెళ్లడంతో రాజస్థాన్ రాయల్స్‌కు రవీంద్ర జడేజా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. జడేజా కూడా ట్రేడింగ్ ద్వారా RR లోకి వచ్చారు. గతంలో CSK తరఫున 8 మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేసి, ఆ తర్వాత ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. జడేజాతో పాటు, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ కూడా RR కెప్టెన్సీ రేసులో బలమైన పోటీదారులుగా ఉన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




