
సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ.. ఆటగాళ్లుగా భారత క్రికెట్‌లో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన పేర్లు. అలాగే కెప్టెన్లుగా తమదైన ముద్ర వేశారు. వీరిలో ఇవి మాత్రమే కామన్ పాయింట్స్ అనుకుంటే పొరపాటే. మరో ఆసక్తికర విషయం ఒకటి ఉంది. అదేంటో తెలిస్తే.. షాక్ అవుతూ నిజమే కాదా అని అనుకుంటారు. ఇంతకీ ఆ ఇంట్రెస్టింగ్ మ్యాటరేంటో ఇప్పుడు చూద్దాం.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో వన్డేల్లో మొట్టమొదటి డబుల్ సెంచరీ కొట్టిన ప్లేయర్ సచిన్ టెండూల్కర్. 2010 ఫిబ్రవరి 24న సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ వన్డేల్లో 200 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.
ఇది కూడా చదవండి: క్రికెట్ దేవుడినే భయపెట్టిన బౌలర్..! వార్న్, మెక్‌గ్రాత్, అలెన్, అక్రమ్ కానే కాదు..
కానీ, నిజానికి ఈ రికార్డును సౌరవ్ గంగూలీ, ధోని ఎప్పుడో క్రియేట్ చేసి ఉండాల్సింది. ఆల్ మోస్ట్.. డబుల్ సెంచరీకి దగ్గరగా వచ్చేసి.. హిస్టరీ క్రియేట్ చేయడానికి కేవలం 17 పరుగుల దూరంలో నిలిచిపోయి, భారత క్రికెట్ అభిమానుల హార్ట్ బ్రేక్ చేశారు. వారిద్దరి బాటలోనే విరాట్ కోహ్లీ కూడా సాగాడు. విచిత్రం ఏంటంటే.. ఈ ముగ్గురు కూడా 183 పరుగుల వద్దే అవుట్ అవ్వడం. చాలా విచిత్రంగా ఉంది కదూ. మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్స్, అద్భుతమైన బ్యాటర్లు, అలాగే వన్డేల్లో అత్యధిక స్కోర్ ముగ్గురిది ఒక్కటే.. 183.
విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో అత్యుత్తమ వన్డే ఇన్నింగ్స్‌లలో 2012 మార్చి 18న ఆసియా కప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఆడాడు. 330 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోహ్లీ కేవలం 148 బంతుల్లో 183 పరుగులు చేసి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో అద్భుతమైన టైమింగ్, దూకుడు, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం స్పష్టంగా కనిపించాయి. ఆ ఇన్నింగ్స్‌తో భారత్ లక్ష్యాన్ని విజయవంతంగా చేధించడమే కాకుండా, కోహ్లీ ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఛేజ్ మాస్టర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు.
ఇది కూడా చదవండి: గంగూలీని దాదా అని ఎందుకంటారు? రోమాలు నిక్కబొడుచుకునే చరిత్ర అది..
అలాగే 1999లో శ్రీలంకపై జరిగిన వన్డే మ్యాచ్‌లో గంగూలీ 183 పరుగులు చేసి అప్పట్లో భారత క్రికెట్‌లో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. అతని అద్భుతమైన ఇన్నింగ్స్ భారత జట్టుకు భారీ విజయాన్ని అందించింది. అనంతరం 2005లో మహేంద్ర సింగ్ ధోనీ కూడా శ్రీలంకపైనే 183 పరుగులతో అజేయంగా నిలిచి సంచలనం సృష్టించాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కేవలం 145 బంతుల్లో 183 నాటౌట్ చేసి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఆ ఇన్నింగ్స్ ధోనీ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లడంతో పాటు, ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విధ్వంసక ఫినిషర్‌గా అతని ఎదుగుదలకు పునాది వేసింది. అయితే ప్రస్తుతం భారత తరఫున వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉంది. ఆయన 2014లో శ్రీలంకపై 264 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి