AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: విశాఖలో క్రికెట్‌ ఫీవర్‌.. భారత్ vs ఆసీస్‌ మ్యాచ్‌ టికెట్ల కోసం ఎగబడిన ఫ్యాన్స్‌.. వీడియో చూశారా?

విశాఖలో క్రికెట్ ఫీవర్ అపుడే స్టార్ట్ అయిపోయింది..భారత్‌-ఆస్ట్రేలియా మధ్య విశాఖ వేదికగా జరగనున్న టీ20 మ్యాచ్‌కు ఆఫ్‌లైన్‌లో టికెట్ల అమ్మకం ప్రారంభమైంది. ఇప్పటికే ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయం పూర్తి కాగా. ఇవాళ్టి నుంచి ఆఫ్‌లైన్‌లో అమ్ముతున్నారు.దీంతో టికెట్ల కోసం కౌంటర్ల వద్ద యువత ఎగబడ్డారు

IND vs AUS: విశాఖలో క్రికెట్‌ ఫీవర్‌.. భారత్ vs ఆసీస్‌ మ్యాచ్‌ టికెట్ల కోసం ఎగబడిన ఫ్యాన్స్‌.. వీడియో చూశారా?
India Vs Australia
Basha Shek
|

Updated on: Nov 17, 2023 | 12:38 PM

Share

విశాఖలో క్రికెట్ ఫీవర్ అపుడే స్టార్ట్ అయిపోయింది..భారత్‌-ఆస్ట్రేలియా మధ్య విశాఖ వేదికగా జరగనున్న టీ20 మ్యాచ్‌కు ఆఫ్‌లైన్‌లో టికెట్ల అమ్మకం ప్రారంభమైంది. ఇప్పటికే ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయం పూర్తి కాగా. శుక్రవారం (నవంబర్ 17) నుంచి ఆఫ్‌లైన్‌లో అమ్ముతున్నారు.దీంతో టికెట్ల కోసం కౌంటర్ల వద్ద యువత ఎగబడ్డారు. మహిళలు సైతం టికెట్లకు పోటీపడ్డారు. మధురవాడలోని క్రికెట్‌ స్టేడియంతో పాటు మున్సిపల్‌ స్టేడియం, గాజువాకలోని ఇండోర్‌ స్టేడియంలో టికెట్లను విక్రయిస్తున్నారు. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు దొరక్కపోవడంతో ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు కోసం ఫ్యాన్స్‌ బారులు తీరారు. చాలా రోజుల తర్వాత విశాఖలో క్రికెట్ మ్యాచ్ జరుగుతుండటంతో ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. మొత్తానికి విశాఖకు క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. కాగా ఈ మ్యాచ్‌కు సంబంధించి రూ.600, 1,500, 2,000, 3,000, 3,50, 6,000 ధరల్లో టికెట్లను అందుబాటులో ఉంచారు. టికెట్లను కొనుగోలు చేసేందుకు జనాలు పెద్ద ఎత్తున రావడంతో విశాఖలో సందడి వాతావరణం కనిపిస్తోంది. టికెట్ల కోసం కొందరు యువకులు గురువారం రాత్రి స్టేడియాల దగ్గరే నిద్రపోయారు. మహిళలు సైతం శుక్రవారం వేకువజాము నుంచే క్యూలైన్లలోకి చేరుకుని టికెట్ల కోసం పోటీ పడ్డారు.

కాగా ప్రతిష్ఠాత్మక వరల్డ్ కప్ పూర్తికాగానే నవంబర్ 23 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. విశాఖపట్నం, తిరువనంతపురం, గౌహతి, నాగ్‌పూర్, బెంగళూరు వేదికల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. రెండో మ్యాచ్ నవంబర్ 26న, మూడో మ్యాచ్ నవంబర్ 28న, నాలుగో మ్యాచ్ డిసెంబర్ 1న, ఐదో, చివరి మ్యాచ్ డిసెంబర్ 3న హైదరాబాద్‌లో కాకుండా బెంగళూరులో జరగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయడి

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ