75 నిమిషాల బ్యాటింగ్.. 500 స్ట్రైక్‌రేట్‌‌తో తుఫాన్ ఇన్నింగ్స్.. మ్యాచ్ విన్నర్‌గా మాజీ ముంబై ప్లేయర్.!

| Edited By: Anil kumar poka

Sep 06, 2021 | 9:41 PM

CPL 2021: సీపీఎల్ 2021లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సహచరులు విజయాలను అందుకున్నారు. వారి జట్టుకు లీగ్‌లో ఇది మూడో విజయం...

75 నిమిషాల బ్యాటింగ్.. 500 స్ట్రైక్‌రేట్‌‌తో తుఫాన్ ఇన్నింగ్స్.. మ్యాచ్ విన్నర్‌గా మాజీ ముంబై ప్లేయర్.!
Simmons
Follow us on

గత రెండు రోజులుగా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ చేసి అదరగొట్టాడు. ఓవర్సీస్‌లో అన్ని ఫార్మాట్లలోనూ శతక్కొట్టిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇదంతా ఒక ఎత్తయితే.. కరేబీయన్ లీగ్ మరో ఎత్తు..

సీపీఎల్ 2021లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సహచరులు విజయాలను అందుకున్నారు. వారి జట్టుకు లీగ్‌లో ఇది మూడో విజయం. ముంబై కీ ప్లేయర్ కిరోన్ పొలార్డ్ జట్టు త్రినబాగో నైట్ రైడర్స్ ఏడు వికెట్ల తేడాతో జమైకా తలైవాస్‌పై అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మాజీ ప్లేయర్ లెండెల్ సిమన్స్ కేవలం 10 బంతుల్లో 50 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జమైకా తలైవాస్ నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. త్రినబాగో బౌలర్ల ధాటికి జమైకా తలైవాస్ తొలి 5 వికెట్లను 15 పరుగులకే కోల్పోయింది. అయితే కార్లోస్ బ్రాత్‌వైట్(58), ఇమాద్ వసీమ్(42)లు ఆరో వికెట్‌కు 83 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తద్వారా జట్టుకు నిర్ణీత ఓవర్లకు 144 పరుగుల గౌరవప్రదమైన స్కోర్‌ను అందించారు. నైట్ రైడర్స్ బౌలర్లలో రవి రాంపాల్, అకిల్ హోస్సేన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

పొలార్డ్ కెప్టెన్సీలో విజయం.. సిమన్స్ 5 సిక్సర్లు..

లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన త్రినబాగో నైట్ రైడర్స్ 17 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ఓపెనర్ లెండెల్ సిమన్స్ మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. 75 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసిన సిమన్స్.. 155.55 స్ట్రైక్ రేట్‌‌తో 45 బంతుల్లో 70 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 5 ఫోర్లు బాదాడు. అలాగే బౌండరీల రూపంలో సిమన్స్ కేవలం 10 బంతుల్లో 50 పరుగులు చేశాడు. కాగా, ఈ గెలుపుతో ప్రస్తుతం త్రినబాగో నైట్ రైడర్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. 6 మ్యాచ్‌లలో మూడు విజయాలు, మూడు ఓటములతో 6 పాయింట్లు దక్కించుకుంది.

Also Read: Viral Video: 90 నిమిషాల పోరాటం.. ముళ్ల పందిని వేటాడబోయిన చిరుత.. కట్ చేస్తే.!

ఓవైపు వ్యాపారం.. మరోవైపు సినిమాలతో దూసుకుపోతున్న ఈ అందాల తార ఎవరో గుర్తుపట్టారా.?

ట్రై యాంగిల్‌ లవ్‌స్టోరీ.. వివాహానికి లాటరీ పద్దతిలో యువతి ఎంపిక.. చివరకు..

టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా…?