WPL 2026 Prize Money: ఆర్సీబీ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. ఆ స్పెషల్ అవార్డ్ ఎవరికంటే..?

WPL 2026 Prize Money: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల ప్రీమియర్ లీగ్ 2026 టైటిల్‌ను రెండోసారి గెలుచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ట్రోఫీని తిరిగి దక్కించుకుంది. ఈ విజయంతో ఆర్సీబీపై కోట్ల వర్షం కురిసింది. అలాగే, ఢిల్లీ కూడా భారీగానే ప్రైజ్ మనీ అందుకుంది.

WPL 2026 Prize Money: ఆర్సీబీ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. ఆ స్పెషల్ అవార్డ్ ఎవరికంటే..?
Wpl 2026 Prize Money

Updated on: Feb 06, 2026 | 8:45 AM

WPL 2026 Prize Money: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నిలిచింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC)ను ఓడించి రెండోసారి విజేతగా నిలిచింది. కెప్టెన్ స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ జట్టు 2024 సీజన్ మరోసారి టైటిల్ అందుకుని, ముంబై ఇండియన్స్‌ తో సమానంగా నిలిచింది.

డబ్బుల వర్షం..

విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రూ. 6 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ కు రూ. 3 కోట్లు బహుమతిగా అందించారు. ముంబై ఇండియన్స్ రెండుసార్లు టైటిల్ గెలుచుకుంది.

అలాగే, టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ మంధానకు ఆరెంజ్ క్యాప్, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ సోఫీకి పర్పుల్ క్యాప్ అందించారు. వీరికి రూ. 5 లక్షలు అందించారు. అలాగే, అత్యధిక సిక్సర్లు బాదిన సోఫీతోపాటు ఉత్తమ స్ట్రైక్ రేట్ కలిగిన గ్రేస్ హారిస్ కు తలో రూ. 5 లక్షలు లభించాయి.

రికార్డు బద్దలు కొట్టిన ఆర్సీబీ..

ఈ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రత్యేకమైనది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 203 పరుగులు చేసి ఆర్సీబీ ముందు 204 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంత భారీ లక్ష్యాన్ని ఫైనల్లోనే కాదు, మహిళల ప్రీమియర్ లీగ్‌లో కూడా ఇంతవరకు ఎప్పుడూ ఛేదించలేదు. అయితే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రికార్డు స్థాయిలో పరుగుల వేటలో పాల్గొని 19.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి

Loading...
Unable to load recommendations.
Follow Us