IND vs BAN: ఆరుగురు బ్యాటర్లు, ముగ్గురు ఆల్ రౌండర్లు.. బంగ్లాకు దబిడ దిబిడే..

|

Sep 09, 2024 | 4:01 PM

India Test Squad: సెప్టెంబర్ 19 నుంచి భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. చెన్నైలోని చెపాక్ మైదానంలో జరగనున్న తొలి మ్యాచ్‌కు టీమిండియాను ప్రకటించారు. రెండో టెస్టు మార్చి 27 నుంచి కాన్పూర్‌లో ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఇరు జట్లు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనున్నాయి.

IND vs BAN: ఆరుగురు బ్యాటర్లు, ముగ్గురు ఆల్ రౌండర్లు.. బంగ్లాకు దబిడ దిబిడే..
India Squad For Bangladesh
Follow us on

India Test Squad: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు. తొలి టెస్టు మ్యాచ్‌కు ప్రకటించిన 16 మంది సభ్యుల జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. ఎడమచేతి వాటం పేసర్ యశ్ దయాల్‌కు జట్టులో చోటు దక్కడం ఇదే తొలిసారి. అలాగే, రిషబ్ పంత్ ఈ సిరీస్ ద్వారా భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేశాడు .

తొలి టెస్ట్‌కు ఎంపికైన 16 మంది సభ్యుల్లో ఆరుగురు పర్ఫెక్ట్ బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. వారితోపాటు ముగ్గురు ఆల్‌రౌండర్లకు చోటు కల్పించారు. అదేవిధంగా ఇద్దరు వికెట్ కీపర్లు, ఐదుగురు బౌలర్లు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ ఇక్కడ సరైన బ్యాట్స్‌మెన్స్‌గా బరిలోకి దిగనున్నారు.

రిషబ్ పంత్, ధృవ్ జురైల్ ఈసారి వికెట్ కీపర్‌లుగా ఎంపికయ్యారు.

ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్‌లు ఎంపికయ్యారు.

ఇక బౌలర్ల విషయానికి వస్తే జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, ఆకాష్ దీప్ పేసర్లుగా కనిపించనుండగా.. వీరికి అండగా కుల్దీప్ యాదవ్ పూర్తి స్థాయి స్పిన్నర్‌గా ఉన్నాడు.

దీంతో బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌కు బలమైన జట్టును బీసీసీఐ ప్రకటించింది. 2వ టెస్టు మ్యాచ్‌లో జట్టు మారే అవకాశం ఉంది. అంటే, తొలి టెస్టు మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యే అవకాశం ఉందని, తద్వారా దులీప్ ట్రోఫీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవచ్చని తెలుస్తోంది. అందుకే తొలి టెస్టు మ్యాచ్‌కు మాత్రమే టీమిండియాను ప్రకటించారు. భారత టెస్ట్ జట్టు ఎలా ఉందంటే..

రోహిత్ శర్మ (కెప్టెన్)

యశస్వి జైస్వాల్,

శుభమాన్ గిల్,

విరాట్ కోహ్లీ,

సర్ఫరాజ్ ఖాన్,

కేఎల్ రాహుల్,

రిషబ్ పంత్ (వికెట్ కీపర్),

ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్),

రవిచంద్రన్ అశ్విన్,

రవీంద్ర జడేజా,

కుల్దీప్ యాదవ్,

అక్షర్ పటేల్,

మహ్మద్ సిరాజ్,

జస్ప్రీత్ బుమ్రా,

ఆకాష్ దీప్,

యశ్ దయాళ్.

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ సిరీస్ షెడ్యూల్:

జట్లు తేదీ సమయం స్థానం
1వ టెస్టు, భారత్ vs బంగ్లాదేశ్ గురువారం, 19 సెప్టెంబర్ 2024 9:30 AM చెన్నై
2వ టెస్టు, భారత్ vs బంగ్లాదేశ్ శుక్రవారం, 27 సెప్టెంబర్ 2024 9:30 AM కాన్పూర్
1వ టీ20, భారత్ vs బంగ్లాదేశ్ సోమవారం, 7 అక్టోబర్ 2024 7 PM గ్వాలియర్
2వ టీ20, భారత్ vs బంగ్లాదేశ్ గురువారం, 10 అక్టోబర్ 2024 7 PM ఢిల్లీ
3వ టీ20, భారత్ vs బంగ్లాదేశ్ ఆదివారం, 13 అక్టోబర్ 2024 7 PM హైదరాబాద్

టీమిండియా టెస్ట్ జట్టు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..