AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. రిటైర్మెంట్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన మాజీ ప్లేయర్?

Rohit Sharma Last ICC Tournament: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రోహిత్ శర్మకు చివరి ఐసీసీ టోర్నమెంట్ అవుతుందా? భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కు ముందు రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి మళ్ళీ ఊహాగానాలు మొదలయ్యాయి. రోహిత్ శర్మ గురించి మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక ప్రకటన చేశారు.

Rohit Sharma: రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. రిటైర్మెంట్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన మాజీ ప్లేయర్?
Rohit Sharma
Venkata Chari
|

Updated on: Feb 23, 2025 | 2:31 PM

Share

Rohit Sharma Retirement: ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల కళ్ళు భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే గొప్ప మ్యాచ్ పైనే ఉన్నాయి. 2025లో దుబాయ్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. దీనికి ముందు, భారత కెప్టెన్ రోహిత్ శర్మ పదవీ విరమణ గురించి మరోసారి ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక ప్రకటన చేశారు. మంజ్రేకర్ మాటల ప్రకారం, ఇది రోహిత్ చివరి ఐసీసీ టోర్నమెంట్ కావొచ్చు. రోహిత్ గురించి మంజ్రేకర్ ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం..

రోహిత్ శర్మ చివరి ఐసీసీ టోర్నమెంట్ ఇదేనా?

ESPN లో మాట్లాడుతూ సంజయ్ మంజ్రేకర్ రోహిత్ శర్మ గురించి కీలక ప్రకటన చేశారు. ఆయన మాట్లాడుతూ, ‘రోహిత్ శర్మ 2027 ODI ప్రపంచ కప్‌లో కనిపించే అవకాశం లేదు. నేను అలా అనుకోను. ఇదే చివరి టోర్నమెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. రోహిత్ శర్మ అక్కడికి వెళ్తాడని నేను అనుకోను’ అంటూ చెప్పుకొచ్చాడు.

రోహిత్ ఈ శైలిపై మంజ్రేకర్ ప్రశంసలు..

రోహిత్ శర్మ నిర్భయమైన, దూకుడుగా బ్యాటింగ్ చేసే శైలిని మంజ్రేకర్ ప్రశంసించాడు. మంజ్రేకర్ మాట్లాడుతూ, ‘2023 వన్డే ప్రపంచ కప్ కారణంగా రోహిత్ శర్మ ప్రజాదరణ పెరిగింది. అతనిలో నాకు నచ్చిన విషయం ఏమిటంటే అతను నిస్వార్థ క్రికెట్ ఆడాడు. అతని సెంచరీతో సంబంధం లేకుండా, అతను జట్టుకు మంచి, వేగవంతమైన ఆరంభాన్ని అందించడంపై దృష్టి పెట్టాడు. ఇది రాబోయే ఆటగాళ్లకు ఆడటానికి సులభతరం చేసింది’ అంటూ తెలిపాడు.

ఇవి కూడా చదవండి

రోహిత్ 2027 వన్డే ప్రపంచ కప్ ఆడగలడా?

రోహిత్ శర్మ వయసు ప్రస్తుతం 37 సంవత్సరాలు. ఏప్రిల్‌లో 38 ఏళ్లు నిండుతాయి. 2027 వన్డే ప్రపంచ కప్ నాటికి రోహిత్ వయస్సు 40 సంవత్సరాలు దాటుతుంది. రోహిత్ టీ20 ఇంటర్నేషనల్ నుంచి రిటైర్ అయ్యాడు. ఇప్పుడు అతనికి తదుపరి ఐసీసీ టోర్నమెంట్ 2027 వన్డే ప్రపంచ కప్ అవుతుంది. రోహిత్ మనసులో ఏముందో అతనికి మాత్రమే తెలుసు. మిగిలినవన్నీ పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి. అది వయస్సు విషయమైతే అది పట్టింపు లేదు. ఎందుకంటే రోహిత్ ఫిట్‌నెస్ అద్భుతంగా ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..