AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఇదెక్కడి ట్యాలెంట్ బాసూ.. బ్యాట్, బాల్‌తోనే కాదు.. ట్యూన్‌కు తగ్గ పాటతో నెట్టింట్లో హల్‌చల్.. వైరల్ వీడియో..

Brett Lee And Chris Gayle Video: వెస్టిండీస్ వెటరన్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ మైదానం వెలుపల కూడా చాలా చురుకుగా ఉంటాడు. ఫాస్ట్ బ్యాటింగ్‌కు పేరుగాంచిన గేల్.. తరచుగా నెట్టింట్లో సందడి చేస్తూనే ఉంటాడు.

Video: ఇదెక్కడి ట్యాలెంట్ బాసూ.. బ్యాట్, బాల్‌తోనే కాదు.. ట్యూన్‌కు తగ్గ పాటతో నెట్టింట్లో హల్‌చల్.. వైరల్ వీడియో..
Brett Lee And Chris Gayle Video
Venkata Chari
|

Updated on: Apr 11, 2023 | 6:20 PM

Share

Brett Lee And Chris Gayle Video: వెస్టిండీస్ వెటరన్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ మైదానం వెలుపల కూడా చాలా చురుకుగా ఉంటాడు. ఫాస్ట్ బ్యాటింగ్‌కు పేరుగాంచిన గేల్.. తరచుగా నెట్టింట్లో సందడి చేస్తూనే ఉంటాడు. వెస్టిండీస్‌కు చెందిన ఈ సీనియర్ ప్లేయర్.. తన డ్యాన్స్‌కు చాలా ప్రసిద్ధి చెందాడు. అయితే, తాజాగా ఆస్ట్రేలియన్ మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీతో కలిసి హల్ చల్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. బ్రెట్‌లీ గిటార్ వాయిస్తుంటే.. క్రిస్ గేల్ పాడుతున్న వీడియోను అభిమానులు తెగ ఇష్టపడుతున్నారు. IPL 2023లో భాగంగా వీరిద్దరూ భారతదేశంలో ఉన్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

ఈ వీడియోను క్రిస్ గేల్, బ్రెట్ లీ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా పంచుకున్నారు. ఈ వీడియోలో బ్రెట్ లీ గిటార్ వాయిస్తుండగా, క్రిస్ గేల్ ఆ ట్యూన్‌పై పాడుతున్నట్లు చూడొచ్చు. ఈ వీడియోను ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోను షేర్ చేస్తూ, “గేల్, లీ కొలాబ్రేషన్” అంటూ క్యాప్షన్‌లో అందించారు.

ఇవి కూడా చదవండి

వీరిద్దరి వీడియోపై చాలా మంది భారతీయులు కామెంట్స్ చేశారు. ఇందులో ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ, గాయని అదితి సింగ్ శర్మ కూడా ఉన్నారు. కపిల్ శర్మ కామెంట్ చేస్తూ, ‘అద్భుతమైనది బ్రో’ అంటూ తన స్పందనను పంచుకున్నారు. అదితి సింగ్ శర్మ కామెంట్ చేస్తూ.. ఈ పాటను గేల్, బ్రెట్ లీ అధికారికంగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే యూజర్లు కామెంట్ చేస్తూ.. “గేల్ భాయ్ ఎల్లప్పుడూ మూడ్‌లో ఉంటారు” అంటూ రాసుకొచ్చారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం