ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏదో ఒక చోట క్రికెట్ లీగ్‌లు నడుస్తూనే ఉన్నాయి. వీటిలో పలు రికార్డులు కూడా నమోదవుతున్నాయి. అలాగే, కొందరి అద్భుతమైన ప్రదర్శనలు కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా చురుకైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంటుంటారు. బౌండరీ లైన్‌లో పట్టే క్యాచ్‌ల గురించి ఇక చెప్పాల్సిన పనే లేదు. అయితే, ఆ క్యాచ్‌లన్నింటిలోనూ ఇంగ్లండ్ టీ20 లీగ్ వైటాలిటీ బ్లాస్ట్‌లో క్యాచ్ మాత్రం అగ్రస్థానంలో ఉంటుదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్యాచ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
టీ20 బ్లాస్ట్‌లో ససెక్స్, హాంప్‌షైర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ‘బెస్ట్ క్యాచ్ ఆఫ్ ఆల్ టైమ్’గా పిలుస్తున్న ఈ అద్భుతమైన క్యాచ్‌కు 24 ఏళ్ల స్కాటిష్ ఆటగాడు బ్రాడ్ కర్రీ స్క్రిప్ట్ రాశాడు. 34 ఏళ్ల ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ బెన్నీ హోవెల్ అందించిన క్యాచ్‌ను బౌండరీ లైన్‌లో అందుకుని, ఆశ్యర్యపరిచాడు.
బెన్నీ హోవెల్స్ మిల్స్ బంతిపై భారీ షాట్ ఆడాడు. బంతి నేరుగా బౌండరీ లైన్ వైపు వెళ్తోంది. అయితే బంతిని పట్టుకునేందుకు బ్రాడ్ కర్రీ గాలిలోకి అమాంతం జంప్ చేశాడు. గాలిలోకి ఎగరడమే కాకుండా కొంత దూరం కూడా ప్రయాణించి, అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.
STOP WHAT YOU ARE DOING
BRAD CURRIE HAS JUST TAKEN THE BEST CATCH OF ALL TIME ?#Blast23 pic.twitter.com/9tQTYmWxWI
— Vitality Blast (@VitalityBlast) June 16, 2023
ఈ క్యాచ్‌ని చూసిన వారంతా.. అవాక్కవుతున్నారు. ఈ వీడియోను షేర్ చేస్తూ.. బెస్ట్ క్యాచ్ ఆఫ్ ఆల్ టైమ్ అంటూ క్యాఫ్షన్ అందించారు. ఇంతకంటే బెస్ట్ క్యాచ్ చూడలేదంటూ నిపుణులు, మాజీలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
అయితే, ఈ క్యాచ్ అత్యుత్తమమో కాదో తెలియదు కానీ, దానిని పట్టుకున్న తర్వాత, బ్రాడ్లీ కర్రీ ఖచ్చితంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. హాంప్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో సస్సెక్స్ విజయం సాధించింది. ఇందులో బ్రాడ్లీ కర్రీ హీరో అయ్యాడు. ఈ క్యాచ్ మాత్రమే కాకుండా ఈ మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టాడు. ససెక్స్ తరపున కర్రీ 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..