భారత క్రికెట్ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు చేరే దిశగా కీలక టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియాతో ఆరంభించింది. న్యూజిలాండ్‌పై 0-3 తేడాతో పరాజయం పొందడం భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బగా మారింది. అయితే, ఆస్ట్రేలియాతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో గెలుపొందితే, మూడోసారి WTC ఫైనల్‌కు చేరే అవకాశం ఉంది.
4-0 లేదా 5-0: ఆసీస్ తో బోర్డర్ గవాస్కర్ సిరీస్ ను టీమిండియా 4-0 లేదా 5-0తో గెలిస్తే ఇతర జట్లతో సంబంధం లేకుండా లేకుండా WTC ఫైనల్‌కి చేరుతారు. దీంతో వరుసగా మూడో సారి WTC ఫైనల్‌కి చేరిన ఏకైక జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించనుంది.
4-1 గెలుపు: ఒక వేళ టీమిండియా ఓ మ్యాచ్ ఓడిపోయి నాలుగింట్లో గెలిస్తే ఇతర జట్ల ఫలితాల పై ఆధారపడవలసి వస్తుంది. ఇంగ్లాండ్ ఒక మ్యాచ్‌ను డ్రా చేయడం లేదా దక్షిణాఫ్రికా ఓడిపోవాల్సి ఉంటుంది.
3-2 గెలుపు: ఆసీస్ తో సిరీస్ లో టీమిండియా 3-2 తో గెలిస్తే అప్పుడు ఇంగ్లాండ్ న్యూజిలాండ్‌పై విజయాన్ని సాధించి, శ్రీలంక ఆస్ట్రేలియాను ఓడించాల్సి ఉంటుంది. ఇక దక్షిణాఫ్రికా కనీసం రెండు మ్యాచ్‌లైనా ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడే టీమిండియా WTC ఫైనల్‌కి వెళ్తుంది.
2-2 సమానం: ఒకవేళ బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ ని టీమిండియా 2-2తో సమం చేస్తే అవకాశాలు మాత్రం సంక్లిష్టంగా మారతాయి. న్యూజిలాండ్ ఓడడం, శ్రీలంక ఓడిపోవడం, ఆస్ట్రేలియా శ్రీలంకతో రెండు మ్యాచ్‌లు ఓడిపోవడం అవసరం. అప్పుడే టీమిండియాకు WTC ఫైనల్‌కి వెళ్లే అవకాశం దక్కవచ్చు.
2-1 గెలుపు: ఇతర జట్లు అనుకూల ఫలితాలు సాధిస్తే మాత్రమే భారత్‌కు అవకాశం ఉంటుంది.
అయితే, భారత్ కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిస్తే WTC ఫైనల్‌కి చేరే అవకాశం లేదు.
భారత్ WTC ఫైనల్‌కి చేరేందుకు ఆస్ట్రేలియాతో ప్రారంభమైన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో విజయాలు కీలకం. 4-0 లేదా 5-0 గెలిస్తే నేరుగా ఫైనల్‌కి చేరుతారు. తక్కువ విజయాలు సాధిస్తే, ఇతర జట్ల ఫలితాలు ప్రాముఖ్యం సంతరించుకుంటాయి. ఒక మ్యాచ్ మాత్రమే గెలిస్తే, భారత్ అవకాశం కోల్పోతుంది.