భారత మాజీ కోచ్ రవి శాస్త్రీ, విరాట్ కోహ్లి గురించి ఆశక్తికర కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఫామ్ పట్ల విమర్శలు ఎదురవుతున్నప్పటికీ, అతడు తనకు ఇష్టమైన ఆస్రేలియాలో తన అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించడం ఖాయమన్నారు. ప్రస్తుతం కోహ్లి సరిగ్గా ఫామ్‌లో లేకపోయినా, ఆస్రేలియా గ్రౌండ్స్‌లో అతడు మునపటి ఫామ్ ను అందిపుచ్చుకోవడం పక్కా అని పేర్కొన్నారు.
ICC రివ్యూ కార్యక్రమంలో పాల్గొన్న రవిశాస్త్రీ “రాజు తన రాజ్యంలోకి తిరిగి వచ్చాడు. దాన్ని నేను చాలా నమ్మకంగా చెప్పగలను” పేర్కొన్నాడు. కోహ్లి ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో ఎంతో సక్సెస్ సాధించినట్లు ఆయన వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియాలో టెస్టుల్లో కోహ్లి ఇన్నింగ్స్‌కు 50 పైగా పరుగుల సగటు సాధించటంతో పాటు ఆ దేశంలో ఆరు సెంచరీలు నమోదు చేశాడు.
విరాట్ కోహ్లి ఇటీవలి కాలంలో న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో తన బ్యాటింగ్ ఫామ్‌ను కోల్పోయాడు. ఈ సిరీస్‌లో మూడు టెస్టుల్లో అతడు కేవలం 93 పరుగులే సాధించగా, 2024లో అతడు ఆడిన 6 టెస్టుల్లో 250 పరుగులు మాత్రమే చేసారు. వీటిలో ఒక సెంచరీ కూడా లేకపోవడం గమన్హారం. “ఆస్రేలియాలో కోహ్లి తనకు వచ్చిన పేరు గురించి చెప్పడం చాలా తేలికగా ఉంటుంది. కాని అక్కడ కోహ్లీ సాధించినది చాలా అరుదుగా జరుగుతుందన్నాడు.
విరాట్ కోహ్లీకి రవిశాస్త్రీ ఓ సలహా ఇచ్చాడు. అతను న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో హడావిడిగా ఆడి ఔటయ్యాడు. ఫుల్-టాస్ బంతులకు అవుట్ అవ్వడమే కాకుండా కీలక సమయాల్లో రనౌట్ అయ్యాడు. కోహ్లి ముందుగా ఎక్కువ ఆందోళన లేకుండా స్థిరంగా ఆడితే, అతడు తిరిగి తన ఫామ్ లోకి రాగలడని శాస్త్రీ అభిప్రాయపడ్డారు. తొలి 30 నిమిషాల్లో ప్రశాంతంగా ఆడితే కోహ్లీ పుంజుకుంటాడు అని శాస్త్రీ సూచించారు.
2012లో అడిలైడ్ టెస్టులో విరాట్ కోహ్లి తన తొలి సెంచరీని సాధించారు. 2014లో, కోహ్లి ఆస్ట్రేలియాలో నాలుగు టెస్టుల్లో నాలుగు సెంచరీలు సాధించి అతనిలోని అసాధారణమైన బ్యాటింగ్ ప్రదర్శనను చూపించాడు. 2018-19లో కోహ్లి భారత్‌కు తొలిసారి టెస్టు సిరీస్ విజయం అందించారు. ఆ సమయంలో, పెర్త్ లో కోహ్లి ఒక అద్భుతమైన సెంచరీ (123 పరుగులు) చేసి, అత్యంత ప్రతిష్ఠాత్మక టెస్టు సిరీస్ విజయాన్ని అందించారు. ఆస్ట్రేలియాలో కోహ్లి రికార్డులు గమనిస్తే ఖచ్చితంగా కోహ్లీ మరోసారి చెలరేగడానికి సిద్దంగా ఉన్నాడని రవిశాస్త్రి పేర్కొన్నాడు.