పెర్త్‌లో అకాల వర్షాల కారణంగా ఆప్టస్ స్టేడియం పిచ్‌పై ప్రిపరేషన్‌కి ఆటంకం ఏర్పడుతోంది. ఐజాక్ మెక్‌డొనాల్డ్ నేతృత్వంలోని క్యూరేటింగ్ బృందం గతంలో ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మ్యాచ్‌లో కనిపించిన పేస్, బౌన్స్‌ను ప్రతిబింబించే వికెట్‌ను తయారుచేయడానికి ఆ బృందం కృషి చేస్తోంది. కానీ వర్షాలు పిచ్ తయారీ ప్రణాళికలకు ఆటంకం కలిగిస్తున్నాయి.
మెక్‌డొనాల్డ్ ప్రకారం, పిచ్‌పై 8-10 మిల్లీమీటర్ల గడ్డి ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది గతంలో కాకుండా తక్కువ స్థాయిలో దెబ్బతినే అవకాశం ఉంది. “పెద్దగా పగుళ్లు ఈ సారి కనిపించే అవకాశాలు చాలా తక్కువ, అయితే పిచ్‌లో వేరియబుల్ బౌన్స్ ఉండటానికి అవకాశం ఉంది” అని ఆయన తెలిపారు.
ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్‌వుడ్ పెర్త్ వికెట్‌ను “పేస్ బౌలింగ్‌కి అనువైనది”గా పేర్కొంటూ, పిచ్ పరిస్థితులు తమ బౌలింగ్ దాడికి అనుకూలంగా ఉంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక ట్రావిస్ హెడ్ మాట్లాడుతూ, పిచ్‌లో కొన్ని భాగాలు “భయంకరమైనవి”గా ఉండొచ్చని, ముఖ్యంగా మ్యాచ్ మూడో లేదా నాల్గవ రోజు నుంచి మరింత సవాలుగా మారుతుందని అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే, భారత బ్యాట్స్మెన్ కు పెర్త్ పిచ్‌పై టెస్ట్ మ్యాచ్ ఆడటం సవాలుతో కూడుకున్నది. ముఖ్యంగా భారత బ్యాటింగ్ ఆర్డర్ లో ఆడబోతున్న ఆటగాళ్లు పెద్దగా అనుభవం లేని వారే. అయితే వారు ఆస్ట్రేలియా బౌలర్ల పేస్ ని, బౌన్స్ ని ఎదుర్కొవడానికి వ్యుహాలను సిద్దం చేసుకన్నట్లు తెలుస్తోంది. భారత బ్యాటింగ్ లైనప్‌లో సీనియర్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా లేకపోవడం ఆసీస్ బౌలర్లకు ఊరట కలిగించే అంశం.
సుదీర్ఘ సిరీస్ విజయం కోసం ఇరు జట్లు తమ తమ ప్రణాళికలను అమలు చేస్తుండగా, వాతావరణ పరిస్థితులు ఈ సిరీస్‌ను మరింత ఆసక్తికరంగా మార్చబోతున్నాయి.