భారత్- ఆస్ట్రేలియా టీ20 సిరీస్ లో భాగంగా ఈ నెల 25న హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మూడో మ్యాచ్ జరిగింది. కాగా ఈ మ్యాచ్ టికెట్ల విక్రయంలో తీవ్ర గందరగోళం ఏర్పడి తొక్కిసలాట కూడా జరిగిన సంగతి తెలిసిందే. ఇది తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కాగా ఈ విషయాలకు సంబంధించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై ఇప్పటికే మూడు కేసులు నమోదయ్యాయి. తాజాగా బేగంపేట పోలీసులు హెచ్‌సీఏపై మరో కేసు నమోదు చేశారు. మ్యాచ్ టికెట్ పై ఉన్న సమయం, మ్యాచ్ ప్రారంభమైన మ్యాచ్ వ్యత్యాసం ఉందంటూ ఓ యువకుడు బేగంపేట్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. టికెట్‌పై మ్యాచ్ ప్రారంభ సమయం 7.30 ఉండగా.. 7 గంటలకే మ్యాచ్ ప్రారంభమైందని ఈ ఫిర్యాదులో పేర్కొన్నాడా యువకుడు. దీంతో బేగంపేట పోలీసులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై కేసు ఫైల్ చేశారు. తాజాగా నమోదైన కేసుతో హెచ్‌సీపై నమోదైన కేసుల సంఖ్య మొత్తం 4 కు చేరింది.
కాగా ఉప్పల్ మ్యాచ్ టికెట్ల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆన్ లైన్ లో పెట్టిన కాసేపటికే టికెట్లు అమ్ముడుపోయానని చూపించడంతో క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆఫ్ లైన్ లో టికెట్లు ఇస్తామని హెచ్‌సీఏ ప్రకటించడంతో వేల సంఖ్యలో క్రికెట్ అభిమానులు జింఖానా మైదానానికి చేరుకుని టికెట్లు దక్కించుకోవడానికి ఎగబడ్డారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట చోటుచేసుకుంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈనేపథ్యంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహణ, ఏర్పాట్లలో హెచ్‌సీఏ నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ పలు సెక్షన్లపై కేసులు నమోదయ్యాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..