BCCI vs Ganguly: కలకత్తా హైకోర్టుకు చేరిన గంగూలీ వివాదం.. బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి నుంచి కావాలనే తప్పించారంటూ పిటీషన్..

|

Nov 05, 2022 | 5:56 PM

BCCI President: బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని తొలగించిన అంశం కలకత్తా హైకోర్టుకు చేరింది. ఆయన తొలగింపు చట్టవిరుద్ధమని పేర్కొంటూ శుక్రవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

BCCI vs Ganguly: కలకత్తా హైకోర్టుకు చేరిన గంగూలీ వివాదం.. బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి నుంచి కావాలనే తప్పించారంటూ పిటీషన్..
Sourav Ganguly, Jay Shah
Follow us on

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీని భారత క్రికెట్ బోర్డు అధ్యక్ష పదవి నుంచి అక్రమంగా తొలగించారా? అంటే అవునంటున్నారు లాయర్ రాంప్రసార్.  ఇదే ప్రశ్నను లేవనెత్తుతూ ఆయన కలకత్తా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు . ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ, జస్టిస్ రాజర్షి భరద్వాజ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ముందు ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. ఇది వచ్చే వారం విచారణకు రావచ్చని తెలుస్తోంది. ఇటీవల సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా బీసీసీఐ నుంచి సౌరవ్ గంగూలీని తప్పించాన్ని ప్రశ్నించారు. ప్రధాని మోడీని జోక్యం చేసుకోవాలని కోరారు.

బీసీసీఐ నుంచి సౌరవ్ గంగూలీని తొలగించారా?

బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ పదవీకాలం ఈ ఏడాదితో ముగిసింది. ఆ తర్వాత మరోసారి అవకాశం ఇవ్వలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, ఒక అధికారి రాష్ట్ర సంస్థలో ఆరేళ్లు, బోర్డులో ఆరేళ్లపాటు పదవిలో కొనసాగవచ్చు. ఆ లెక్కన సౌరవ్ బోర్డు ఛైర్మన్ గా కొనసాగేందుకు మరో మూడేళ్ల సమయం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా కార్యదర్శిగా కొనసాగిస్తుండగా, సౌరవ్‌ను ఎందుకు కొనసాగించలేదని ఆయన తప్పుబట్టారు.

బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తొలగించడంపై ప్రశ్నలు..

బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి సౌరవ్‌ను తొలగించాన్ని ప్రశ్నిస్తూ శుక్రవారం న్యాయవాది రాంప్రసాద్ కేసు దాఖలు చేశారు. బీసీసీఐ ప్రెసిడెంట్, సెక్రటరీ నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయం అమలులో ఉందని ఆయన అన్నారు. సౌరవ్‌ను తొలగించే విషయంలో ఈ నియమాలు సరిగ్గా పాటించలేదని అందులో పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా మళ్లీ బోర్డులోకి రాగలిగినప్పుడు, సౌరవ్ ఎందుకు రాకూడదు?, అలాగే రాజకీయ కారణాలతో ఆయనను ఛైర్మన్ పదవి నుంచి పదవి నుంచి తొలగించారంటూ అందులో పేర్కొన్నారు. ఈ వాజ్యంపై వచ్చే వారం చీఫ్ జస్టిస్ శ్రీవాస్తవ, జస్టిస్ భరద్వాజ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

సౌరవ్ CAB ఎన్నికలలో పోటీ చేయలేదు..

బీసీసీఐ నుంచి వైదొలిగిన తర్వాత.. తాను బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని సౌరవ్ చెప్పుకొచ్చారు. అయితే చివరికి ఎన్నికలు జరగలేదు. అయితే, గంగూలీ తాత స్నేహాశిష్ గంగోపాధ్యాయ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడయ్యాడు. CAB అధ్యక్షుడిగా స్నేహశిష్ గంగోపాధ్యాయ కూడా ప్రమాణం చేశారు. ఇది సౌరవ్ గంగూలీ విజయంగానే పరిగణిస్తున్నారు. ఎందుకంటే అతని తాత అధ్యక్షుడైన తర్వాత క్యాబ్ పగ్గాలు సౌరవ్ చేతిలో ఉంటాయని అంటున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయిండి..