ICC New Chairman: ఐసీసీ బాస్‌గా జైషా.. ఏకగ్రీవంగా ఎన్నికకు రంగం సిద్ధం?

|

Jul 08, 2024 | 5:57 PM

ICC New Chairman: తన హయాంలో భారత క్రికెట్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన బీసీసీఐ సెక్రటరీ జై షా ఇప్పుడు ఐసీసీ అధ్యక్ష పదవిపై కన్నేసినట్లు సమాచారం. వాస్తవానికి వచ్చే నవంబర్‌లో ఐసీసీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఈ మేరకు బీసీసీఐ ప్రస్తుత కార్యదర్శి జే షా ఈ పదవికి బలమైన పోటీదారుగా పరిగణించారు. ఈ పదవికి జై షా ఎంపికైతే ఐసీసీకి అత్యంత పిన్న వయస్కుడైన ప్రెసిడెంట్ అవుతాడు.

ICC New Chairman: ఐసీసీ బాస్‌గా జైషా.. ఏకగ్రీవంగా ఎన్నికకు రంగం సిద్ధం?
Jay Shah Reveals Team India New Coach
Follow us on

BCCI Secretary Jay Shah: తన హయాంలో భారత క్రికెట్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన బీసీసీఐ సెక్రటరీ జై షా ఇప్పుడు ఐసీసీ అధ్యక్ష పదవిపై కన్నేసినట్లు సమాచారం. వాస్తవానికి వచ్చే నవంబర్‌లో ఐసీసీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఈ మేరకు బీసీసీఐ ప్రస్తుత కార్యదర్శి జే షా ఈ పదవికి బలమైన పోటీదారుగా పరిగణించారు. ఈ పదవికి జై షా ఎంపికైతే ఐసీసీకి అత్యంత పిన్న వయస్కుడైన ప్రెసిడెంట్ అవుతాడు.

క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, ఐసీసీ అధ్యక్షుడిగా జై షా బాధ్యతలు స్వీకరిస్తారా లేదా అనే దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. గత నాలుగు సంవత్సరాలుగా ఈ పదవిని న్యూజిలాండ్ ఆటగాడు గ్రెగ్ బార్క్లే నిర్వహిస్తున్నారు. బీసీసీఐ కార్యదర్శి జే షా మద్దతుతో గ్రెగ్ బార్క్లే ఆ పదవిని చేపట్టారు. బార్క్లే మరో పర్యాయం అధ్యక్షుడిగా కొనసాగడానికి అర్హులు. అయితే, జై షా ఎన్నికల్లో పోటీ చేస్తే మాత్రం ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఖాయమనే తెలుస్తోంది.

పదవీకాలం సవరణ..

ఐసీసీ అధ్యక్షుడి పదవీకాలాన్ని సవరించినట్లు ఇప్పటికే నివేదిక వెలువడ్డాయి. గత మూడు టర్మ్‌ల నుంచి మూడేళ్లకు మార్చారు. అలాగే ఒకే అధ్యక్షుడు రెండు పర్యాయాలు మాత్రమే ఐసీసీ అధ్యక్ష పదవిలో ఉండాలని రూల్స్ మార్చారు. షా ఎంపికైతే ఐసీసీ అధ్యక్షుడిగా మూడేళ్లపాటు కొనసాగుతారు. ఆ తరువాత BCCI రాజ్యాంగం ప్రకారం 2028 లో భీసీసీఐ అధ్యక్షుడిగా అర్హత పొందుతాడు.

ఇవి కూడా చదవండి

దుబాయ్ నుంచి ముంబైకి ఐసీసీ ప్రధాన కార్యాలయం..

ఐసీసీ అధ్యక్షుడిగా జై షా ఎన్నికైతే, ఐసీసీ ప్రధాన కార్యాలయాన్ని దుబాయ్ నుంచి ముంబైకి తరలించే ఆలోచనలో ఉన్నారని అంతర్జాతీయ మీడియాలో ఊహాగానాలు వచ్చాయి. కానీ జై షా మాత్రం దీని గురించి ఆలోచించలేదు. బదులుగా, అతను ఐసీసీలో మార్పు తీసుకురావడానికి ఆసక్తి చూపుతున్నట్లు అతని సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. ఇప్పుడు జరగనున్న వార్షిక సదస్సులో ఐసీసీ అధ్యక్షుడి ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా రూపొందిస్తారని భావిస్తున్నారు.

అసిస్టెంట్ మెంబర్ డైరెక్టర్ల ఎన్నిక..

కాగా, జులై 19న జరిగే వార్షిక సమావేశంలో అసోసియేట్ మెంబర్ డైరెక్టర్ల ఎన్నిక జరగనుంది. ఐసీసీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో మూడు స్థానాలకు 11 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఒక్కొక్కరి పదవీకాలం రెండేళ్లు. ప్రస్తుత డైరెక్టర్లు ఓమన్‌కు చెందిన పంకజ్ ఖిమ్జీ, సింగపూర్‌కు చెందిన ఇమ్రాన్ ఖవాజా, బెర్ముడాకు చెందిన నీల్ స్పీట్ ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..