Indian Cricket Team: టీ20 వరల్డ్ కప్ తరువాత టీమిండియా షెడ్యూల్ ఇదే.. ఫుల్ బిజీగా ఆటగాళ్లు.. భారత్ రానున్న దేశాలు ఇవే..!

T20 World Cup: అక్టోబర్- నవంబర్‌లో జరిగే టీ 20 ప్రపంచకప్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీ తరువాత టీమిండియా షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది.

Indian Cricket Team: టీ20 వరల్డ్ కప్ తరువాత టీమిండియా షెడ్యూల్ ఇదే.. ఫుల్ బిజీగా ఆటగాళ్లు.. భారత్ రానున్న దేశాలు ఇవే..!
T20 World Cup
Follow us
Venkata Chari

|

Updated on: Sep 19, 2021 | 5:43 PM

Teamindia Schedule: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఒమన్‌లో అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరిగే టీ20 ప్రపంచ కప్ 2021 లో భారత జట్టు పాల్గొంటున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో మరో టీ 20 ప్రపంచకప్ నిర్వహించాల్సి ఉంది. ఈ ప్రపంచ కప్ ముందు టీమిండియా షెడ్యూల్‌ను సిద్ధం చేసింది. ఆస్ట్రేలియాలో జరిగే పొట్టి ప్రపంచ కప్‌ కోసం భారత ఆటగాళ్లను సిద్ధం చేసేందుకు ఈ సిరీస్‌లను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నవంబర్‌లో పొట్టి ప్రపంచ కప్ ముగిసిన తరువాత న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, దక్షిణాఫ్రికా దేశాలు భారత్‌లో పర్యటించనున్నాయి. ఈ సమయంలోనే వీలైనన్ని టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

నివేదిక ప్రకారం, రాబోయే దేశీయ, అంతర్జాతీయ సీజన్ షెడ్యూల్‌ని బీసీసీఐ సిద్ధం చేసింది. బోర్డు అత్యున్నత మండలి సమావేశం సోమవారం జరగనుంది. ఆన్‌లైన్‌లో జరిగే ఈ సమావేశంలో దేశీయ షెడ్యూల్‌కు పచ్చజెండా ఊపనున్నట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్‌తో మూడు టీ 20 మ్యాచ్‌లు, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఉండనుంది. అలాగే వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ 20 లు, శ్రీలంకతో రెండు టెస్టులు, మూడు టీ 20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇక దక్షిణాఫ్రికాతో భారత్ ఐదు మ్యాచ్‌ల టీ 20 సిరీస్ ఆడనుంది.

స్వదేశంలో 21 అంతర్జాతీయ మ్యాచ్‌లు.. షెడ్యూల్ ప్రకారం, తదుపరి దేశీయ సీజన్‌లో భారత్ మొత్తం 21 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో 14 టీ 20 మ్యాచ్‌లు ఉన్నాయి. అదే సమయంలో, మూడు వన్డేలతోపాటు నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో భారత్ చివరిసారిగా ఇంగ్లండ్‌కు ఆతిథ్యం ఇచ్చింది. అనంతరం ఐపీఎల్‌కు ఆతిథ్యమిచ్చింది. కానీ, కోవిడ్ కారణంగా ఐపీఎల్ మధ్యలోనే వాయిదా పడింది. ఈ కారణంగా, ఐపీఎల్ 2021 రెండవ దశ ఆదివారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరుగుతోంది. టీ 20 ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ, కోవిడ్ కారణంగా అది కూడా కష్టంగా మారింది. పొట్టి ప్రపంచ కప్‌ను కూడా యూఏఈలోనే నిర్వహించనున్నారు.

నవంబర్-డిసెంబర్ నుంచి మొదలు.. నవంబర్-డిసెంబర్‌లో న్యూజిలాండ్‌తో హోం సిరీస్‌లో భారత్ తొలుత తలపడనుంది. దీని తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. అక్కడ మూడు టెస్టులతో పాటు మూడు వన్డేలు, టీ20 సిరీస్‌లు ఆడనుంది. ఈ పర్యటన డిసెంబర్-జనవరిలో జరగనుంది. అనంతరం భారత జట్టు స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో సిరీస్ ఆడనుంది. ఇదే నెలలో శ్రీలంక కూడా భారతదేశంలో పర్యటించనుంది. మార్చి 18 న లక్నోలో జరిగే టీ20 మ్యాచ్‌తో శ్రీలంక పర్యటన ముగుస్తుంది. ఏప్రిల్-మేలో ఐపీఎల్ జరగనుంది. దీని తరువాత, దక్షిణాఫ్రికా టీం భారత్‌లో పర్యటించనుంది. ఇందులో భాగంగా టీ20 మ్యాచ్‌లు జూన్ 9 నుంచి ప్రారంభమవుతాయి. ఈ సిరీస్ జూన్ 19 న ముగుస్తుంది.

Also Read: CSK vs MI: తొలి మ్యాచ్ ఫలితం ముందే డిసైడ్.. తొలి ఫోర్, వికెట్ పడేది అప్పుడే.. భారత మాజీ క్రికెటర్ ఏమంటున్నాడంటే..?

BCCI: మాజీ సెలెక్టర్లపై మహిళా క్రికెటర్ ఫైర్.. అలా ఎందుకు చేస్తారంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం..!

IPL 2021 MI vs CSK: రోహిత్ శర్మ వర్సెస్ సురేష్ రైనా.. ఓ రికార్డు కోసం ఇరువురి పోరాటం.. తొలుత సాధించేదెవరో?