CSK vs MI Match Highlights, IPL 2021: 20 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై ధోని సేన ఘన విజయం..!
Chennai Super Kings vs Mumbai Indians: 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై టీం.. నిర్ణీత 20 ఓవర్లతో 7 వికెట్లు కోల్పోయి 136 మాత్రమే చేసింది. దీంతో 20 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది.
CSK vs MI, IPL 2021 Live Cricket Score Streaming Online: ఐపీఎల్ 2021 రెండో దశలో జరిగిన తొలి మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ టీం విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ టీంపై 20 పరుగుల తేడాతో గెలిచింది. 157 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ముంబై టీం త్వరగా వికెట్లను కోల్పోతూ పరాజయం పాలైంది. ముంబై ఇన్నింగ్స్‌లో తివారి(50) ఒక్కడే అర్థ సెంచరీతో అజేయంగా నిలిచాడు. డికాక్ 17, సింగ్ 16, సూర్య కుమార్ యాదవ్ 3, ఇషాన్ కిషన్ 11, పొలార్డ్ 15, పాండ్యా 4, మిల్నే 15 పరుగులు చేశారు. చెన్నై టీం బౌలర్లలో బ్రావో 3, దీపక్ చాహర్ 2, హజల్ వుడ్, శార్దుల్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకు ముందు నిర్ణీత 20 ఓవర్లో చెన్నైటీం 6 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన చెన్నై టీంకు ఆరంభంలో వరుసగా వికెట్లు కోల్పోతూ చిక్కుల్లో పడింది. అయితే మరోవైపు ఓపెనర్ రుతురాజ్ సూపర్ ఇన్నింగ్స్‌తో చెన్నై టీం భారీ స్కోర్ సాధించింది. రుతురాజ్ కేవలం 58 బంతుల్లో 88 పురుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో 9 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. 151. 72 స్రైక్ రేట్‌తో బ్యాటింగ్ అదరగొట్టాడు. చెన్నై టీంలో ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు(డు ఫ్లెసిస్, అలీ, రాయుడు) సున్నాకే పెవిలియన్ చేరాడు. సురేష్ రైనా 4, ధోని 3, జడేజా26, బ్రావో 23 పరుగులు చేశారు. బ్రావో అలా వచ్చి ఇలా వెళ్లినా.. 287 స్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి కేవలం 8 బంతుల్లో 3 సిక్సులతో 23 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో బౌల్ట్ 2, మిల్నే 2, బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు.
LIVE Cricket Score & Updates
-
ఆరో వికెట్ కోల్పోయిన ముంబై
పాండ్యా(4) రూపంలో ఆరో వికెట్‌ను ముంబై టీం కోల్పోయింది. మొయిన్ అలీ బౌలింగ్‌లో రనౌట్‌గా వెనుదిరిగాడు.
-
ఐదో వికెట్ కోల్పోయిన ముంబై
పొలార్డ్(15) రూపంలో ముంబై టీం ఐదో వికెట్ కోల్పోయింది. హజల్ వుడ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.
-
-
13 ఓవర్లకు 87/4
13 ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబై ఇండియన్స్ టీం 4 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది. క్రీజులో తివారి 24, పోలార్డ్ 15 పరుగులతో ఉన్నారు. ఈ ఓవర్లో మొత్తం 5 పరుగులు వచ్చాయి.చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో చాహర్ 2, శార్దుల్, బ్రావో తలో వికెట్ పడగొట్టారు.
-
12 ఓవర్లకు 82/4
12 ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబై ఇండియన్స్ టీం 4 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. క్రీజులో తివారి 22, పోలార్డ్ 12 పరుగులతో ఉన్నారు. ఈ ఓవర్లో మొత్తం 7 పరుగులు వచ్చాయి. బ్రావో ఓ ఫోర్ కొట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో చాహర్ 2, శార్దుల్, బ్రావో తలో వికెట్ పడగొట్టారు.
-
11 ఓవర్లకు 75/4
11 ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబై ఇండియన్స్ టీం 4 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. క్రీజులో తివారి 17, పోలార్డ్ 11 పరుగులతో ఉన్నారు. ఈ ఓవర్లో మొత్తం 13 పరుగులు వచ్చాయి. బ్రావో సిక్స్, తివారి ఫోర్ బాదేశారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో చాహర్ 2, శార్దుల్, బ్రావో తలో వికెట్ పడగొట్టారు.
-
-
10 ఓవర్లకు 62/4
10 ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబై ఇండియన్స్ టీం 4 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. క్రీజులో తివారి 11, పోలార్డ్ 4 పరుగులతో ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో చాహర్ 2, శార్దుల్, బ్రావో తలో వికెట్ పడగొట్టారు.
-
నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై
ఇషాన్ కిషన్(11) రూపంలో ముంబై టీం నాలుగో వికెట్‌ను కోల్పోయింది. 9.2 ఓవర్లో బ్రావో బౌలింగ్‌లో సురేష్ రైనాకు క్యాచ్ ఇచ్చి ఇషాన్ కిషన్ పెవిలియన్ చేరాడు.
-
9 ఓవర్లకు 54/3
9 ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబై ఇండియన్స్ టీం 3 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. క్రీజులో తివారి 11, ఇషాన్ కిషన్ 7 పరుగులతో ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో చాహర్ 2, శార్దుల్ 1 వికెట్ పడగొట్టారు.
-
8 ఓవర్లకు 48/3
8 ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబై ఇండియన్స్ టీం 3 వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది. క్రీజులో తివారి 8, ఇషాన్ కిషన్ 4 పరుగులతో ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో చాహర్ 2, శార్దుల్ 1 వికెట్ పడగొట్టారు.
-
మూడో వికెట్ కోల్పోయిన ముంబై
ముంబై ఇండియన్స్ టీం వరుసగా వికెట్లు కోల్పోతూ పీకల్లోతూ కష్టాల్లో కూరకపోతోంది. సూర్య కుమార్ యాదవ్(3) ను శార్ధుల్ ఠాకూర్ బోల్తా కొట్టించాడు. దీంతో ముంబై టీం 6.1 ఓవర్లకు 42/3 పరుగులు చేసింది.
-
రెండో వికెట్ కోల్పోయిన ముంబై
ముంబై టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. వరుస బౌండరీలతో దూసుకెళ్తున్న అన్మోల్‌ప్రీత్ సింగ్(17)ను దీపక్ చాహర్ బోల్తాకొట్టించాడు.
-
అన్మోల్‌ప్రీత్ సింగ్ వరుస బౌండరీలు
3.4 ఓవర్లో ముంబై ఓపెనర్ అన్మోల్‌ప్రీత్ సింగ్ తన తొలి ఫోర్‌ను కొట్టాడు. హజల్ వుడ్ బౌలింగ్‌ను చీల్చి చెండాడు. ఆ తరువాత చివరి రెండు బంతులను సిక్స్, ఫోర్‌గా మలిచి ఆ ఓవర్లో మొత్తం 14 పరుగులను రాబట్టాడు.
-
తొలి వికెట్ కోల్పోయిన ముంబై
వరుస ఫోర్లతో దూసుకపోతున్న డికాక్(17)ను దీపక్ చాహర్ బోల్తా కొట్టించాడు. రెండో ఓవర్ మూడో బంతికి ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు.
ముంబై స్కోర్: 18/1
-
వరుస ఫోర్లతో దూసుకెళ్తున్న డికాక్
ఇప్పటికే రెండో ఓవర్‌లో రెండు ఫోర్లు బాదిన డికాక్, చాహర్ వేసిన రెండో ఓవర్ తొలి బంతిని బౌండరీ తరలించాడు.
-
డికాక్ మరో ఫోర్
హజల్ వుడ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో డికాక్ మరో ఫోర్ బాదేశాడు. ముంబై స్కోర్ 14/0, డికాక్ 13, సింగ్ 1 క్రీజులో ఉన్నారు.
-
ముంబై ఇన్నింగ్స్‌లో తొలి ఫోర్
డికాక్ రెండో ఓవర్ మూడో బంతిని బౌండరీ తరలించి ముంబై ఇన్నింగ్స్‌లో తొలి బౌండరీని నమోదు చేశాడు.
-
మొదలైన ముంబై బ్యాటింగ్
ముంబై ఓపెనర్లుగా డికాక్, అన్మోల్‌ప్రీత్ సింగ్ దిగారు. ముంబై ముందు చెన్నై 157 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
-
20 ఓవర్లకు 156/6
20 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై టీం 6 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ 88, శార్దుల్ 1 పరుగులతో ఉన్నారు. ముంబై బౌలర్లలో బౌల్ట్ 2, మిల్నే 2, బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. ఈ ఓవర్లో మొత్తం 15 పరుగులు వచ్చాయి.
-
ఆరో వికెట్ కోల్పోయిన చెన్నై టీం
బ్రావో రూపంలో చెన్నై టీం ఆరో వికెట్‌ను కోల్పోయింది. బుమ్రా బైలింగ్‌లో పాండ్యాకు క్యాచ్ ఇచ్చి బ్రావో పెవిలియన్ చేరాడు.
-
19 ఓవర్లకు 141/5
19 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై టీం ఐదు వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ 78, బ్రావో 21 పరుగులతో ఉన్నారు. ముంబై బౌలర్లలో బౌల్ట్ 2, మిల్నే 2, బుమ్రా 1 వికెట్ పడగొట్టారు. ఈ ఓవర్‌లో ఒక ఫోర్, మూడు సిక్స్‌లతో మొత్తం 24 పరుగులు వచ్చాయి.
-
18 ఓవర్లకు 117/5
పద్దెనిమిది ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై టీం ఐదు వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ 67, బ్రావో 8 పరుగులతో ఉన్నారు. ముంబై బౌలర్లలో బౌల్ట్ 2, మిల్నే 2, బుమ్రా 1 వికెట్ పడగొట్టారు. ఈ ఓవర్‌లో ఒక సిక్స్‌తో మొత్తం 10 పరుగులు వచ్చాయి.
-
ఐదో వికెట్ కోల్పోయిన చెన్నై టీం
ఎట్టకేలకు కీలక భాగస్వామ్యాన్ని బుమ్రా విడదీశాడు. జడేజా (26)రూపంలో చెన్నై టీం ఐదో వికెట్‌ను కోల్పోయింది.
-
16 ఓవర్లకు 98/4
పదహారు ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై టీం నాలుగు వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ 55, జడేజా 26 పరుగులతో ఉన్నారు. ముంబై బౌలర్లలో బౌల్ట్ 2, మిల్నే 2 వికెట్లు పడగొట్టారు. ఈ ఓవర్‌లో రెండు ఫోర్లతో మొత్తం 11 పరుగులు వచ్చాయి.
-
హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రుతురాజ్
చెన్నై ఓపెనర్ రుతురాజ్ ఓ వైపు వికెట్లు పడుతున్నా ఎంతో సంయమనంతో బ్యాటింగ్ చేసి తన అర్థ సెంచరీని పూర్తిచేశాడు. 41 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. ఫోర్‌తో తన అర్థ శతకాన్ని పూర్తి చేశాడు. చెన్నై స్కోర్: 93/4
-
15 ఓవర్లకు 87/4
పదిహేను ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై టీం నాలుగు వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ 46, జడేజా 25 పరుగులతో ఉన్నారు. ముంబై బౌలర్లలో బౌల్ట్ 2, మిల్నే 2 వికెట్లు పడగొట్టారు. ఈ ఓవర్లో మొత్తం 6 పరుగులు వచ్చాయి.
-
14 ఓవర్లకు 81/4
పద్నాలుగు ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై టీం నాలుగు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ 45, జడేజా 20 పరుగులతో ఉన్నారు. ముంబై బౌలర్లలో బౌల్ట్ 2, మిల్నే 2 వికెట్లు పడగొట్టారు. ఈ ఓవర్లో మొత్తం 7 పరుగులు వచ్చాయి.
-
13 ఓవర్లకు 74/4
పదమూడు ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై టీం నాలుగు వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ 44, జడేజా 15 పరుగులతో ఉన్నారు. ముంబై బౌలర్లలో బౌల్ట్ 2, మిల్నే 2 వికెట్లు పడగొట్టారు. ఈ ఓవర్లో మొత్తం 8 పరుగులు వచ్చాయి.
-
12 ఓవర్లకు 66/4
పన్నెండు ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై టీం నాలుగు వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ 37, జడేజా 14 పరుగులతో ఉన్నారు. ముంబై బౌలర్లలో బౌల్ట్ 2, మిల్నే 2 వికెట్లు పడగొట్టారు. ఈ ఓవర్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో మొత్తం 18 పరుగులు వచ్చాయి.
-
చెన్నై తొలి సిక్స్
చెన్నై ఇన్నింగ్స్‌లో రుతురాజ్ భారీ సిక్స్ కొట్టాడు. పాండ్యా బౌలింగ్‌లో 11.2 ఓవర్లో చెన్నై ఇన్నింగ్స్‌లోనే తొలి సిక్స్ కొట్టాడు.
-
11 ఓవర్లకు 48/4
పదకొండు ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై టీం నాలుగు వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ 26, జడేజా 8 పరుగులతో ఉన్నారు. ముంబై బౌలర్లలో బౌల్ట్ 2, మిల్నే 2 వికెట్లు పడగొట్టారు.
-
10 ఓవర్లకు 44/4
పది ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై టీం నాలుగు వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ 23, జడేజా 7 పరుగులతో ఉన్నారు. ముంబై బౌలర్లలో బౌల్ట్ 2, మిల్నే 2 వికెట్లు పడగొట్టారు.
-
9 ఓవర్లకు 35/4
తొమ్మిది ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై టీం నాలుగు వికెట్లు కోల్పోయి 35 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ 19, జడేజా 6 పరుగులతో ఉన్నారు. ముంబై బౌలర్లలో బౌల్ట్ 2, మిల్నే 2 వికెట్లు పడగొట్టారు.
-
8 ఓవర్లకు 31/4
ఎనిమిది ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై టీం నాలుగు వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ 18, జడేజా 3 పరుగులతో ఉన్నారు. ముంబై బౌలర్లలో బౌల్ట్ 2, మిల్నే 2 వికెట్లు పడగొట్టారు.
-
7 ఓవర్లకు 27/4
ఏడు ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై టీం నాలుగు వికెట్లు కోల్పోయి 27 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ 17, జడేజా 2 పరుగులతో ఉన్నారు. ముంబై బౌలర్లలో బౌల్ట్ 2, మిల్నే 2 వికెట్లు పడగొట్టారు.
-
తొలి పవర్ ప్లేలో ముంబైదే ఆధిపత్యం
తొలి పవర్ ప్లే ముగిసే వరకు చెన్నై సూపర్ కింగ్స్ టీంపై ముంబై బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. మొత్తానికి 6 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై టీం నాలుగు వికెట్లు కోల్పోయి 23 పరుగుల చేసింది. చెన్నై స్కోర్: 24/4
-
నాలుగో వికెట్ డౌన్
చెన్నై టీం నాలుగో వికెట్ కూడా కోల్పోయింది. కెప్టెన్ మిస్టర్ కూల్ ధోని(3) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో చెన్నై కష్టాలు మరింతగా పెరిగాయి.
చెన్నై స్కోర్: 24/4
-
5 ఓవర్లకు 18/3
ఐదు ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై టీం మూడు వికెట్లు కోల్పోయి 18 పరుగులు చేసింది. క్రీజులో ధోని2, రుతురాజ్ 10పరుగులతో ఉన్నారు. ముంబై బౌలర్లలో బౌల్ట్ 2, మిల్నే 1 వికెట్ పడగొట్టారు.
-
4 ఓవర్లకు 11/3
చెన్నై టీం 4 ఓవర్లు పూర్తయ్యే సరికి మూడు వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసింది.
-
మూడో వికెట్ కోల్పోయిన చెన్నై టీం
వరుసగా వికెట్లు కోల్పోతూ చెన్నై టీం పీకల్లోతూ కష్టాల్లో మునిగిపోతోంది. తొలి బౌండరీ సాధించి మంచి ఊపులో ఉన్న సురేష్ రైనా(4) కూడా బౌల్ట్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు
చెన్నై టీం స్కోర్: 7/3
-
తొలి బౌండరీ
వరుస వికెట్లతో సతమతమవుతోన్న చెన్నై టీంకు సురేష్ రైనా రూపంలో తొలి బౌండరీ దక్కింది.
-
రెండో వికెట్ కోల్పోయిన చెన్నై
చెన్నై బ్యాటింగ్ ఆరభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వరుసగా వికెట్లు కోల్పోతూ పీకల్లోతూ కష్టాల్లో మునిగిపోతోంది. తొలి ఓవర్‌లో ఓపెనర్ డుప్లెసిస్ సున్నాకే పెవిలియన్ చేరాడు. బౌల్ట్ బౌలింగ్‌లో మిలెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక ఆడం మిల్నే వేసిన రెండో ఓవర్ మూడో బంతికి మొయిన్ అలీ కూడా సున్నాకే పెవిలియన్ చేరాడు.
చెన్నై స్కోర్: 2/2
-
తొలి వికెట్ డౌన్
చెన్నై బ్యాటింగ్ ఆరభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డుప్లెసిస్ సున్నాకే పెవిలియన్ చేరాడు. బౌల్ట్ బౌలింగ్‌లో మిలెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
చెన్నై స్కోర్: 2/1
-
మొదలైన బ్యాటింగ్
టాస్ గెలిచిన చెన్నై టీం బ్యాటింగ్ ఆరంభించింది. ఓపెనర్లుగా ఓపెనర్లుగా ఫాఫ్ డు ప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్ బరిలోకి దిగారు.
-
ఆరునెలల క్రితమే ప్రజలు బ్రహ్మరధం పట్టారుః సురేష్
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఆరునెలల క్రితమే ప్రజలు బ్రహ్మరధం పట్టారని, నేడు కౌంటింగ్‌లో తెలిసిపోయిందని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు బుద్ది తెచ్చుకోవాలన్నారు. చివరకు ప్రజలు ఇచ్చిన ఫలితాలపై కూడా చంద్రబాబు వక్రీకరిస్తున్నారన్నారు. తాము ఎన్నికలను బహిష్కరించామని చెప్పడం మంచి పద్దతి కాదన్నారు. ఒక్కసారిగా ఎన్నికల్లో గెలవలేని లోకేష్ కూడా మాట్లాడుతున్నారని విమర్శించారు.
-
టీంలు- ప్లేయింగ్ ఎలెవన్
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్ (కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, అన్మోల్‌ప్రీత్ సింగ్, కిరాన్ పొలార్డ్ (కెప్టెన్), సౌరభ్ తివారీ, కృనాల్ పాండ్యా, ఆడమ్ మిల్నే, రాహుల్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (కెప్టెన్, కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్
-
టాస్ గెలిచిన చెన్నై టీం
రెండవ దశలో తొలి మ్యాచులో చెన్నై వర్సెస్ ముంబై టీంలు తలపడుతున్నాయి. ఇందులో భాగంగా ధోని టీం టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ముంబై టీం నుంచి రోహిత్, హార్దిక్ పాండ్యా ప్లేయింగ్ ఎలెవన్ నుంచి మిస్ అయ్యారు. ఇంకా పూర్తిగా ఫిట్‌గా లేనందున ఈ మ్యాచులో బరిలోకి దిగడం లేదని కెప్టెన్ పోలార్డ్ వెల్లడించాడు.
-
CSK vs MI – ముఖాముఖి పోరాటాలు
ఆడిన మ్యాచ్‌లు – 33
ముంబై గెలిచింది – 20
సీఎస్‌కే గెలిచింది – 13
గత ఆరు మ్యాచ్‌లలో ముంబై టీం.. ఐదు సందర్భాలలో విజయం సాధించింది.
-
CSK vs MI – అత్యధిక, తక్కువ స్కోర్లు
ముంబై ఇండియన్స్ అత్యధిక స్కోరు – 219
చెన్నై సూపర్ కింగ్స్ అత్యధిక స్కోరు – 218
ముంబై ఇండియన్స్ అత్యల్ప స్కోరు – 141
చెన్నై సూపర్ కింగ్స్ అత్యల్ప స్కోరు – 79
-
బుమ్రా @ 100వ మ్యాచ్
ముంబై ఇండియన్స్ తరపున స్టార్ బౌలర్ బుమ్రా తన 100వ మ్యాచ్‌ను ఆడనున్నాడు. ఇప్పటి వరకు 99 మ్యాచులాడిన బుమ్రా 115 వికెట్లు తీశాడు.
IPL Matches – ? Memories – ♾️#OneFamily #MumbaiIndians #IPL2021 #CSKvMI @Jaspritbumrah93 pic.twitter.com/KSZYacv9Sr
— Mumbai Indians (@mipaltan) September 19, 2021
Published On - Sep 19,2021 6:45 PM