CSK vs MI: తొలి మ్యాచ్ ఫలితం ముందే డిసైడ్.. తొలి ఫోర్, వికెట్ పడేది అప్పుడే.. భారత మాజీ క్రికెటర్ ఏమంటున్నాడంటే..?

MI vs CSK: ఐపీఎల్ సందడి మొదలైంది. నేడు యూఏఈలో రెండో దశ తొలిమ్యాచ్‌లో కీలక జట్లు ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ టీంల మధ్య జరగనుంది.

CSK vs MI: తొలి మ్యాచ్ ఫలితం ముందే డిసైడ్.. తొలి ఫోర్, వికెట్ పడేది అప్పుడే.. భారత మాజీ క్రికెటర్ ఏమంటున్నాడంటే..?
Csk Vs Mi Ipl 2021
Follow us

|

Updated on: Sep 19, 2021 | 5:01 PM

IPL 2021 MI vs CSK: అదేంటి మ్యాచ్ విజేత ముందే ఫిక్స్ అయ్యిందా ఏంటని అనుకుంటున్నారా? అదేం లేందడి బాబు.. మ్యాచ్ ఫిక్సింగ్ లాంటిదేమీ లేదు. కాకపోతే విజేత ఎలా తెలిసిందని చెబుతున్నారని అడుగుతున్నారా.. అదే చెప్పబోతున్నాం.. అదేంటో తెలియాలంటే ఇది చదవాల్సిందే మరి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎల్ 2021 రెండవ దశ సందడి మొదలైంది. యూఏఈలో నేటి నుంచి ఐపీఎల్ షురూ కానుంది. కీలక జట్లు ముంబై, చెన్నై టీంలు తొలి మ్యాచులో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఇండియాలో రాత్రి 7.30 గంటలకు ప్రత్యక్షప్రసారం కానుంది. అయితే ఫలితాన్ని తెలుసుకోవడానికి మ్యాచ్ ముగిసే వరకు ఎందుకు వేచి ఉండారు. నేను ముందే చేప్పేస్తానని అంటున్నాడు ఈ భారత మాజీ క్రికెటర్. అయనెవరో కాదు ఈరోజు అంటే సెప్టెంబర్ 19 న తన 44 వ పుట్టినరోజు చేసుకుంటున్న భారత మాజీ క్రికెటర్ కం వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా. మ్యాచ్ ఫలితాన్ని ముందే అంచనా వేసి చెప్పేశాడు.

చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ విజయాన్ని సాధించగలదని ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో వెల్లడించాడు. నిజానికి, గత రెండు ఎన్‌కౌంటర్లలో ముంబై చెన్నైని ఓడించింది. ఐపీఎల్ 2021 యూఏఈ ఎడిషన్ ఓపెనర్ విన్నర్‌గా ముంబై ఇండియన్స్‌ ఉండబోతుందని చోప్రా తెలిపాడు. చోప్రా చెప్పిన ఫలితంతో ధోనీ, సీఎస్‌కే అభిమానులలో కోపం తెప్పించిందనే విషయం స్పష్టమవుతుంది. అయితే, చోప్రా అంచనాల్లో నిజం ఉందని మరికొందరు నిపుణులు కూడా అంటున్నారు. ఐపీఎల్ 2020 సమయంలో యూఎస్‌ఈ స్లో పిచ్‌లో సీఎస్‌కే బ్యాటింగ్ చేసేందుకు కష్టపడుతుందని ఆయన అన్నారు. దాని కారణంగా చెన్నై ప్రత్యర్థులు ప్రయోజనం పొందేందుకు అవకాశం ఉంది. ఈసారి కూడా ఇదే జరగవచ్చని చోప్రా అభిప్రాయపడ్డాడు.

చెన్నైపై ముంబై విజయాన్ని అంచనా వేసిన తర్వాత వెలుగులోకి వచ్చిన బర్త్‌డే బాయ్ చోప్రా.. చెన్నైకి రవీంద్ర జడేజా, మొయిన్ అలీల పాత్ర కీలకమని తెలిపాడు. మొయిన్‌ జట్టులో చేర్చడంతో బ్యాటింగ్ నం. 3 సమస్య తీరిందని అన్నాడు. అలాగే గౌతమ్ రూపంలో మరో మంచి ఎంపిక ఉందని అన్నాడు. మరోవైపు ముంబై ఇండియన్స్‌కు రాహుల్ చాహర్ ఎంతో కీలకమని ఆకాశ్ చోప్రా అన్నారు. పీయూష్ చావ్లా, జయంత్ యాదవ్‌లు కూడా ముఖ్య పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నాడు. మణికట్టు స్పిన్నర్ల కంటే ఫింగర్ స్పిన్నర్లే వికెట్లు తీయగల సామర్థ్యం కలిగి ఉంటారని చోప్రా చెప్పాడు. అందుకే రాహుల్ చాహర్‌ని ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంచాటని ముంబై ఇండియన్స్‌కి సూచించాడు. ముంబై వర్సెస్ చెన్నై మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో మొదటి బౌండరీ ఎప్పుడు రానుందో కూడా చోప్రా ఊహించాడు. ఇది తొలి 10 బంతుల్లోనే రానుందని ఆయన అన్నారు. అదే సమయంలో మ్యాచ్‌లో మొదటి వికెట్ 4 ఓవర్లలోపే పడనుందని ఊహించాడు.

సెహ్వాగ్ ఓటు కూడా ముంబైకే.. చోప్రా లాగానే, వీరేంద్ర సెహ్వాగ్ కూడా ముంబై ఇండియన్స్‌ వైపే మొగ్గుచూపాడు. ఆకాష్ చోప్రా ఫైనల్ మ్యాచ్‌ను కూడా అంచనా వేశాడు. ఐపీఎల్ 2021 ఫైనల్ ఏ రెండు జట్ల మధ్య జరుగుతుందో అతను చెప్పాడు. ముంబై, చెన్నై టీంలే ఫైనల్‌లో తలపడతాయని ఊహించాడు. అయితే విజేత ఎవరో మాత్రం చెప్పలేదు.

Also Read: BCCI: మాజీ సెలెక్టర్లపై మహిళా క్రికెటర్ ఫైర్.. అలా ఎందుకు చేస్తారంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం..!

IPL 2021 MI vs CSK: రోహిత్ శర్మ వర్సెస్ సురేష్ రైనా.. ఓ రికార్డు కోసం ఇరువురి పోరాటం.. తొలుత సాధించేదెవరో?

IPL 2021 MI vs CSK: ఐపీఎల్ సందడి షురూ.. తొలిరోజు రోహిత్‌తో తలపడనున్న ధోని.. బలాలు, బలహీనతలు ప్రివ్యూలో చూద్దాం!