IPL 2025: షాకింగ్ న్యూస్.. ఇద్దరు టీమిండియా ప్లేయర్లపై నిషేధం.. బీసీసీఐ కీలక నిర్ణయం

IPL 2025 Mega Auction: అనుమానాస్పద బౌలింగ్ కారణంగా నిషేధానికి గురైన లేదా నిషేధానికి గురయ్యే ప్రమాదం ఉన్న బౌలర్ల జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. ఇందులో ఇద్దరు టీమిండియా బౌలర్లు కూడా ఉన్నారు. దీంతో వీరు ఇప్పుడు ఐపీఎల్‌లో బౌలింగ్ చేయలేరు.

IPL 2025: షాకింగ్ న్యూస్.. ఇద్దరు టీమిండియా ప్లేయర్లపై నిషేధం.. బీసీసీఐ కీలక నిర్ణయం
Ipl 2025 Mega Auction
Follow us
Venkata Chari

|

Updated on: Nov 23, 2024 | 12:19 PM

Deepak Hooda IPL 2025: అనుమానాస్పద బౌలింగ్ కారణంగా నిషేధానికి గురైన లేదా నిషేధానికి గురయ్యే ప్రమాదంలో ఉన్న బౌలర్ల జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. మనీష్ పాండే (కెఎస్‌సిఎ, 157), సృజిత్ కృష్ణన్ (కెఎస్‌సిఎ, 281) బౌలింగ్ చేయకుండా ఇప్పటికే నిషేధించిన సంగతి తెలిసిందే. అలాగే, రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్‌సిఎ) దీపక్ హుడా అనుమానాస్పద బౌలింగ్ జాబితాలో చేరాడు. సౌరభ్ దూబే (344, వీసీఏ), కేసీ కరియప్ప (381, సీఏఎం) కూడా సందేహాస్పద జాబితాలో ఉన్నారు.

భారత్ తరపున ఆడిన మనీష్ పాండే, దీపక్ హుడా..

మనీష్ పాండే, దీపక్ హుడా భారత క్రికెట్ జట్టుకు ఆడారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు భారత్ తరపున వైట్ బాల్ క్రికెట్ ఆడారు. గతంలో మనీష్ పాండే చర్యపై ప్రశ్నలు తలెత్తాయి. అతడితో పాటు శ్రీజిత్ కృష్ణన్‌పై కూడా బీసీసీఐ గతంలో నిషేధం విధించింది. 35 ఏళ్ల మనీష్ పాండే భారత జట్టు తరపున తన కెరీర్‌లో 39 టీ20లు ఆడాడు. 33 ఇన్నింగ్స్‌ల్లో 709 పరుగులు చేశాడు. బ్యాట్‌తో మూడు అర్ధశతకాలు కూడా సాధించాడు. దీంతో పాటు ఐపీఎల్‌లో పాండేకు మంచి అనుభవం కూడా ఉంది.

మనీష్ ఐపీఎల్‌లో 172 మ్యాచ్‌లు ఆడి 3850 పరుగులు చేశాడు. త్వరలో జరగనున్న ఐపీఎల్ మెగా వేలంలో మనీష్ పాండే తన పేరును కూడా నమోదు చేసుకున్నాడు. దీపక్ హుడా గురించి మాట్లాడితే, అతను తన కెరీర్‌లో భారత్ తరపున 10 వన్డేలు, 21 టీ20లు ఆడాడు. వన్డేల్లో 153 పరుగులు, టీ20ల్లో 368 పరుగులు చేశాడు. హుడా వన్డేల్లో 3 వికెట్లు, టీ20ల్లో 6 వికెట్లు పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి

మనీష్ పాండే IPL 2024 కెరీర్..

ఐపీఎల్ 2024 వేలానికి ముందు మనీష్ పాండేపై బీసీసీఐ నిషేధం విధించింది. దీని కారణంగా, ఐపీఎల్ 2024లో పాండే బౌలింగ్ చేయలేడని అతను ఇప్పటికే స్పష్టం చేశాడు. బౌలింగ్ నిషేధం ఉన్నప్పటికీ కోల్‌కతా గత వేలంలో మనీష్ పాండేను రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2025కి మనీష్ ఏ జట్టుతో ఆడతాడనే విషయం తర్వలో తేలనుంది. గత సీజన్‌లో కోల్‌కతా తరపున ఆడిన అతడిని ఈ సీజన్‌లో కోల్‌కతా రిటైన్ చేయలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..