BCCI Best Players 2022: టీమిండియాలో అత్యుత్తమ ఆటగాళ్లు వీరే.. 2022లో దుమ్మురేపిన ఆరుగురు.. సీనియర్లకు బీసీసీఐ భారీ షాక్..

Team India: 2022 భారత జట్టుకు అంతగా కలిసి రాలేదు. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్‌లో జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కానీ, కొంతమంది ఆటగాళ్లు తమ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు.

BCCI Best Players 2022: టీమిండియాలో అత్యుత్తమ ఆటగాళ్లు వీరే.. 2022లో దుమ్మురేపిన ఆరుగురు.. సీనియర్లకు బీసీసీఐ భారీ షాక్..
Team India

Updated on: Jan 02, 2023 | 5:43 PM

2022లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత క్రికెటర్ల పేర్లను బీసీసీఐ ప్రకటించింది. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో అద్భుత ప్రదర్శన చేసిన బ్యాట్స్‌మెన్, బౌలర్ల పేర్లను బీసీసీఐ ప్రకటించింది. ఈ జాబితాలో ఎందరో యువ ఆటగాళ్లకు చోటు దక్కింది. 2022 భారత జట్టుకు అంతగా కలిసి రాలేదు. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్‌లో జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కానీ, కొంతమంది ఆటగాళ్లు తమ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు.

టీ20లల్లో వీరే..

2022లో ఉత్తమ టీ20 భారత బ్యాట్స్‌మెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ ఏడాది 187.43 స్ట్రైక్ రేట్‌తో 1164 పరుగులు చేశాడు. ఈ సమయంలో సూర్య రెండు సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు కూడా చేశాడు. అదే సమయంలో టీ20 బెస్ట్ బౌలర్‌గా భువనేశ్వర్ కుమార్ ఎంపికయ్యాడు. గతేడాది 6.98 ఎకానమీ రేటుతో 37 వికెట్లు తీశాడు. ఇదిలావుండగా, శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌కు భువనేశ్వర్ కుమార్‌ను ఎంపిక చేయకపోవడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

వన్డే ఫార్మాట్‌లో..

వన్డేల్లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా శ్రేయాస్ అయ్యర్ ఎంపికయ్యాడు. 2022 సంవత్సరంలో ODIలలో 15 ఇన్నింగ్స్‌లలో 724 పరుగులు చేశాడు. ఈ కాలంలో సగటు 55.69గా నిలిచింది. ఈ సమయంలో శ్రేయాస్ ఒక సెంచరీ, ఆరు అర్ధ సెంచరీలు చేశాడు. అదే సమయంలో 15 మ్యాచ్‌లలో 4.62 ఎకానమీ రేటుతో 24 వికెట్లు తీసిన మహమ్మద్ సిరాజ్ ఉత్తమ వన్డే బౌలర్‌గా ఎంపికయ్యాడు.

టెస్ట్ క్రికెట్‌లో..

టెస్టు క్రికెట్‌లో రిషబ్ పంత్ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా ఎంపికయ్యాడు. అతను ఈ ఏడాది 12 ఇన్నింగ్స్‌ల్లో 61.81 సగటుతో 680 టెస్టు పరుగులు చేశాడు. ఈ ఏడాది టెస్టుల్లో 500కు పైగా పరుగులు చేసిన ఏకైక భారత క్రికెటర్‌గా నిలిచాడు. టెస్టు ఫార్మాట్‌లో అత్యుత్తమ బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా ఎంపికయ్యాడు. 10 ఇన్నింగ్స్‌ల్లో 22 వికెట్లు తీశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..