Sourav Ganguly Biopic: దాదా పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో ఫిక్స్.. డైరెక్టర్‌గా రజనీకాంత్ డాటర్?

Aishwarya Rajinikanth: తాజాగా భారత దిగ్గజ క్రికెటర్ సౌరవ్ గంగూలీపై బయోపిక్ తెరకెక్కుతోంది. టీం ఇండియా కెప్టెన్‌గా, బీసీసీఐ అధ్యక్షుడిగా ఆయన సేవలందించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన బయోపిక్‌ను రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

Sourav Ganguly Biopic: దాదా పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో ఫిక్స్.. డైరెక్టర్‌గా రజనీకాంత్ డాటర్?
Ganguly

Updated on: May 31, 2023 | 11:18 AM

Ayushmann Khurrana: ఇటీవల బయోపిక్‌ల ట్రెండ్‌ జోరందుకుంది. ముఖ్యంగా క్రికెటర్లపై వరుసగా బయోపిక్‌లు రూపొందుతున్నాయి. వీటిలో చాలా సినిమాలు హిట్ అయ్యాయి. ఇక తాజాగా భారత దిగ్గజ క్రికెటర్ సౌరవ్ గంగూలీపై బయోపిక్ తెరకెక్కుతోంది. టీం ఇండియా కెప్టెన్‌గా, బీసీసీఐ అధ్యక్షుడిగా ఆయన సేవలందించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన బయోపిక్‌ను రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. సౌరవ్ గంగూలీ పాత్రలో బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా నటిస్తున్నట్లు సమాచారం.

బాలీవుడ్‌లో అత్యధిక డిమాండ్ ఉన్న హీరో ఆయుష్మాన్ ఖురానా. తమ సినిమాకు పెట్టుబడి పెడితే మినిమం బిజినెస్ వస్తుందని నిర్మాతలు నమ్ముతుంటారు. కామెడీ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయుష్మాన్.. ఇప్పుడు దాదా బయోపిక్‌లో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

నిర్మాతలు ఇప్పటికే ఆయుష్మాన్ ఖురానాతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఆయుష్మాన్ ఎన్నో విభిన్న పాత్రల ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. మరి ఇప్పుడు సౌరవ్ గంగూలీ పాత్రకు తగ్గట్టుగా రాణిస్తాడో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఈ చిత్రానికి రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించనుందని సమాచారం. ఐశ్వర్య రజనీకాంత్ ఇప్పటికే పలు సినిమాలకు దర్శకత్వం వహించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు భారత దిగ్గజం బయోపిక్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సౌరవ్ గంగూలీ బయోపిక్‌కి దర్శకత్వం వహించడానికి విక్రమాదిత్య మోత్వానే మొదటి ఎంపికగా అనుకున్నారు. కానీ, ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఈ బయోపిక్ ఐశ్వర్య చేతిలో పడిందంట.

ఇంతకుముందు విడుదలైన ’83’ చిత్రం ఓ మోస్తరు లాభాలను అందుకుంది. 1983లో టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. రణవీర్ సింగ్, దీపికా పదుకొణె తదితరులు ఈ సినిమాలో నటించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..