AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలా ఉన్నావేందయ్యా.! 5 ఫోర్లు, 4 సిక్సర్లతోనే మ్యాచ్ ఆగమాగం.. ఎవరీ టీమిండియా బౌలర్.?

ప్రస్తుతం టీమిండియా, బంగ్లాదేశ్‌ మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. అదే సమయంలో భారత దేశవాళీ క్రికెట్‌లో దులీప్ ట్రోఫీ కూడా కొనసాగుతోంది. ఈ టోర్నీ చివరి రౌండ్‌లో ఫాస్ట్ బౌలర్ అవేశ్ ఖాన్ బ్యాట్‌తో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

ఇలా ఉన్నావేందయ్యా.! 5 ఫోర్లు, 4 సిక్సర్లతోనే మ్యాచ్ ఆగమాగం.. ఎవరీ టీమిండియా బౌలర్.?
India Player
Ravi Kiran
|

Updated on: Sep 21, 2024 | 10:58 AM

Share

ప్రస్తుతం టీమిండియా, బంగ్లాదేశ్‌ మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. అదే సమయంలో భారత దేశవాళీ క్రికెట్‌లో దులీప్ ట్రోఫీ కూడా కొనసాగుతోంది. ఈ టోర్నీ చివరి రౌండ్‌లో ఫాస్ట్ బౌలర్ అవేశ్ ఖాన్ బ్యాట్‌తో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇండియా-ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అవేశ్ ఖాన్.. అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. ఇండియా-సీతో జరిగిన మ్యాచ్‌లో అవేశ్ ఖాన్ 68 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 51 పరుగులు చేశాడు. దాదాపుగా ఫోర్లు, సిక్సర్లతోనే 44 పరుగులు సాధించాడు. దీంతో భారత్-ఏ తన మొదటి ఇన్నింగ్స్‌లో 297 పరుగులు చేసింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అవేశ్‌కి ఇది రెండో అర్ధ సెంచరీ.

ఇది చదవండి: 16 పరుగులకే 5 వికెట్లు.. ద్వీవుల్లో డైనమేట్ బీభత్సం.. టీ20ల్లో అరుదైన రికార్డు

297 పరుగుల లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన భారత్-సీ జట్టు 234 పరుగులకు ఆలౌట్ చేసింది. ఆ జట్టులో అభిషేక్ పోరెల్ 82 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇండియా-ఏ బౌలర్లలో అవేష్ ఖాన్, ఆకిబ్ ఖాన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఇక పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. భారత్-సీ తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఇండియా-బీ ఏడు పాయింట్లతో, ఇండియా-ఏ ఆరు పాయింట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మరోవైపు అవేశ్ ఖాన్ ఇప్పటివరకు టీమిండియా తరపున 8 వన్డేలు, 23 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 9 వికెట్లు, టీ20లో 25 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల జింబాబ్వే టూర్‌లో అవేష్ ఖాన్ టీమిండియా తరఫున తన చివరి మ్యాచ్ ఆడాడు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: పనికిరాడని వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకోమన్నారు.. కట్ చేస్తే.. ఈ దమ్మున్నోడు దడ పుట్టించాడు

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..