ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ నవంబరు నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు ఎంపికయ్యాడు . కొన్ని నెలల క్రితం యూఏఈలో జరిగిన ఐపీఎల్ టోర్నీలో సన్‌రైజర్స్ జట్టులో చోటు కోల్పోయిన అతను అదే గడ్డపై నవంబర్ నెలలో జరిగిన టీ- 20 ప్రపంచకప్- 2021లో అద్భుతంగా రాణించాడు. ఈ టోర్నీలో మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 146.70 స్ట్రైక్ రేట్‌తో 289 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. ఆటోర్నీలో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికై ఆసీస్ జట్టు తొలిసారిగా పొట్టి ప్రపంచకప్ సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే వార్నర్‌రె ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు వరించినట్లు ఐసీసీ పేర్కొంది. కాగా ఈ పురస్కారం కోసం న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ, పాకిస్థాన్ ఓపెనర్ అబిద్ అలీ కూడా పోటీపడ్డారు. అయితే చివరకు ఆసీస్ క్రికెటర్‌నే ఈ అవార్డు వరించింది. కాగా వార్నర్ ఈ అవార్డు అందుకోవడం ఇదే మొదటిసారి.
ఇక మహిళా క్రికెటర్ల విషయాని కొస్తే.. నవంబర్ నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ హేలీ మ్యాథ్యూస్ ఎంపికైంది. గత నెలలో జరిగిన వన్డేల్లో మ్యాథ్యూస్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. పాక్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్ నూ, ఆతర్వాత ప్రపంచకప్ అర్హత టోర్నీలో అద్భుతంగా ఆడిన ఆమె మొత్తం 4 మ్యాచ్‌ల్లో 141 పరుగులు చేయడంతో పాటు 9 వికెట్లు నేలకూల్చింది. ఈ ప్రదర్శనే ఆమెకు ఈ పురస్కారం వరించేలా చేసింది. కాగా ఇదే అవార్డు కోసం పాక్ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆనం అమిన్, బంగ్లాదేశ్‌కు చెందిన నహీదా అక్తర్‌లు పోటీ పడ్డారు. కాగా మ్యాథ్యూస్ ఈ అవార్డుకు నామినేట్ కావడం ఇది రెండోసారి. ఈ ఏడాది జులైలో మొదటిసారి ఈ పురస్కారానికి నామినేట్ అయిన ఆమె త్రుటిలో అవార్డు కోల్పోయింది.
Also read:
మెరుపు ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్.. 8 సిక్సర్లు 13 ఫోర్లతో బౌలర్లకు చుక్కలు..
Harbhajan Singh: బీజేపీలో చేరికపై మీడియాలో పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన హర్భజన్ సింగ్..