IND vs AUS: ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విఫలమైతే.. అజిత్ అగార్కర్ ఏమన్నాడో తెలుసా..?
Rohit Sharma - Virat Kohli: అక్టోబర్ 19 నుంచి ప్రారంభమయ్యే భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల ప్రదర్శనలు మాత్రమే కేంద్రబిందువుగా ఉన్నాయి. ఈ సిరీస్‌లో వారి ప్రదర్శనలు వారి భవిష్యత్తును నిర్ణయించడంలో కీలకం కావొచ్చు.

Rohit Sharma – Virat Kohli: ప్రపంచ కప్ 2027 ఇంకా దాదాపు రెండేళ్ల దూరంలో ఉంది. అయినప్పటికీ టోర్నమెంట్ ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం ఇద్దరు మాజీ భారత కెప్టెన్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. ఈ ప్రపంచ కప్‌లో భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఇద్దరు బ్యాటర్స్, ఆటగాళ్ల భాగస్వామ్యం గురించి నిరంతరం ఊహాగానాలు, పుకార్లు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా, ఆస్ట్రేలియా పర్యటనకు వీరి ఎంపికను టెస్ట్ రన్‌గా చూస్తున్నారు. కాబట్టి, వీరిద్దరు బ్యాటింగ్‌లో రాణించకపోతే కెరీర్లు ముగిసిపోతాయా? అనే ప్రశ్నపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ షాకింగ్ న్యూస్ చెప్పాడు. ప్రపంచ కప్‌లో వారి భవిష్యత్తుపై తన అభిప్రాయాన్ని ఇప్పటికే వారికి వ్యక్తం చేశానని పేర్కొన్నాడు.
ఒక వార్తా ఛానల్ కార్యక్రమంలో భాగంగా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2027 ప్రపంచ కప్‌లో ఆడే అవకాశాల గురించి అగార్కర్‌ను అడిగారు. అగార్కర్ మొదట ఆ ప్రశ్నను తిప్పికొట్టడానికి ప్రయత్నించాడు. కేవలం ఒకరు లేదా ఇద్దరు ఆటగాళ్లపై కాదు, జట్టు ప్రదర్శనపైనే తన దృష్టి ఉందని చెప్పుకొచ్చాడు. అయితే, రాబోయే ప్రతి వన్డే సిరీస్‌లో వారి ప్రదర్శన వారి ప్రపంచ కప్ విధిని నిర్ణయిస్తుందా అని అడిగిన ప్రశ్నను కూడా అగార్కర్ ఖండించాడు. ఇద్దరు బ్యాటర్స్ ఏం నిరూపించాల్సిన అవసరం లేదని పేర్కొనడం గమనార్హం.
రోహిత్, విరాట్ బ్యాటర్స్‌గా క్రికెట్‌లో చాలా సాధించారని, కానీ ఒక సిరీస్‌లో వారి ప్రదర్శన ఆధారంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేమని చీఫ్ సెలెక్టర్ అగార్కర్ స్పష్టం చేశఆడు. అగార్కర్ మాట్లాడుతూ, “అది కొంచెం అవివేకం. ఒకరి సగటు 50 కంటే ఎక్కువ, మరొకరి సగటు 50కి దగ్గరగా ఉన్నారు. ప్రతి మ్యాచ్‌లోనూ వారిని ట్రయల్‌లో ఉంచలేం. 2027 ప్రపంచ కప్ ఇంకా చాలా దూరంలో ఉంది. ఇద్దరూ చాలా కాలంగా క్రికెట్ ఆడుతున్నారు. ఈ సిరీస్‌లో వారు పరుగులు సాధించకపోతే, వారు ఎంపిక చేయబడరని లేదా వారు మూడు సెంచరీలు చేస్తేనే 2027 ప్రపంచ కప్‌లో ఆడతారని కాదు” అంటూ తెలిపాడు.
ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల్లో వైఫల్యం రోహిత్, విరాట్ కెరీర్‌లకు ముగింపు కాదని అగార్కర్ ప్రకటన నిర్ధారిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఈ ప్రకటనకు మించి నిజం చెప్పాలంటే, దీనికి మరిన్ని వివరణలు అవసరం లేదు. ఇద్దరు ఆటగాళ్లు తమ చివరి దశలో ఉన్నారని స్పష్టంగా తెలుస్తుంది. యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రియాన్ పరాగ్ వంటి ఆటగాళ్ళు జట్టులోకి వస్తున్నందున, అగార్కర్ మీడియాకు ఏమి చెప్పినా, ప్రతి మ్యాచ్ ఇద్దరు అనుభవజ్ఞులకు ఒక పరీక్ష అవుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








