Viral Photo: తినడానికే త్వరగా ఔటయ్యవా ఏంది కోహ్లీ.. సచిన్ ఏకంగా 3 రోజులు తినలేదంటూ నెటిజన్ల ఫైర్..

|

Jun 09, 2023 | 3:54 PM

IND vs AUS WTC Final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఔట్ అయిన తర్వాత, విరాట్ కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్‌లో భోజనం చేస్తూ కనిపించాడు. దీంతో ఈ ఫొటోపై నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు.

Viral Photo: తినడానికే త్వరగా ఔటయ్యవా ఏంది కోహ్లీ.. సచిన్ ఏకంగా 3 రోజులు తినలేదంటూ నెటిజన్ల ఫైర్..
Vira Kohli Photo Viral
Follow us on

ఇప్పటివరకు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్‌లో మొదటి రెండు రోజులు పూర్తిగా ఆస్ట్రేలియా జట్టే ఆధిపత్యం ప్రదర్శించింది. రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 151 పరుగులకే సగం వికెట్లను కోల్పోయింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరు కంటే టీమిండియా ఇంకా 318 పరుగులు వెనుకంజలో నిలిచింది. కాగా, రెండో రోజు ఆటలో విరాట్ కోహ్లీ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఫొటోపై, అభిమానులు అతనిని ట్రోల్ చేస్తున్నారు. కొందరు మీమ్స్ ద్వారా విరాట్ ఫొటోపై కామెంట్లు చేస్తున్నారు.

టీమిండియా స్కోరు 30 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ నుంచి అందరూ భారీ ఇన్నింగ్స్‌ను ఆశించారు. కోహ్లీ కూడా చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాడు. కానీ, మిచెల్ స్టార్క్ వేసిన బంతికి స్లిప్‌లో క్యాచ్ అయ్యాడు. 31 బంతుల్లో 14 పరుగులు చేసి కోహ్లీ పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఔట్ అయ్యి పెవిలియన్‌కు తిరిగి వచ్చిన తర్వాత విరాట్ కోహ్లీ భోజనం చేస్తూ కనిపించాడు.

ఇవి కూడా చదవండి

ఈ ఫొటో బయటికి రావడంతో అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విరాట్ కోహ్లీకి వికెట్ కోల్పోయిన బాధ అస్సలు లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. 2003 ప్రపంచకప్ ఫైనల్‌లో త్వరగా ఔటైన సచిన్.. 3 రోజులు తిండి తినలేదంటూ దెప్పి పొడుస్తున్నారు.

అందరి దృష్టి అజింక్యా రహానెపైనే..

దాదాపు 18-19 నెలల తర్వాత టెస్టు క్రికెట్‌లోకి పునరాగమనం చేసిన అజింక్య రహానే.. రెండో రోజు ఆట ముగిసేసరికి అజేయంగా నిలిచాడు. ప్రస్తుతం అతనితో కలిసి ఆల్ రౌండర్ శార్దుల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు ఆశలన్నీ అజింక్యా రహానేపైనే ఉన్నాయి. ప్రస్తుతం రహానే 79 బంతుల్లో 33 పరుగులతో క్రీజులో నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..