Asia cup 2025 IND vs PAK Highlights: పాకిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం! సూర్య భాయ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్
Asia cup 2025 India vs Pakistan Highlights: ఆసియా కప్ గ్రూప్-ఎ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. బదులుగా టీమిండియా ఛేజింగ్‌లో సూపర్‌గా ఆడింది.

Asia cup 2025 India vs Pakistan Highlights in Telugu: టోర్నీ ఏదైనా.. భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటేనే అభిమానులతో పాటు ఆటగాళ్లలోనూ ఓ ఆసక్తి ఉండేది. కానీ ఇటీవల పహల్గాంలో జరిగిన టెర్రర్ ఎటాక్ తర్వాత అది మొత్తం మారిపోయింది. ఆ టీంతో క్రికెట్ ఆడొద్దని చాలానే డిమాండ్స్ వచ్చాయి. అయితేనేం అవన్నీ పక్కనపెడితే.. బీసీసీఐ ఆసియా కప్‌లో టీమిండియా ఆడేందుకు అనుమతి ఇచ్చింది. టోర్నీలో టీమిండియా మొదటి మ్యాచ్ కూడా పూర్తి చేసింది. ఇక ఇవాళ సూపర్ సండేగా భారత్, పాకిస్తాన్ మధ్య కీలక పోరు జరిగింది. ఈ పోరులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏకంగా 7 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 47 పరుగులతో కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి నాటౌట్‌గా నిలిచాడు.
పాకిస్థాన్: సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, మహ్మద్ హరీస్ (వికెట్ కీపర్), సల్మాన్ అఘా (కెప్టెన్), ఫఖర్ జమాన్, హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, సుఫ్యాన్ ముఖీమ్.
భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
LIVE NEWS & UPDATES
-
పాకిస్థాన్‌కు ఇచ్చిపడేసిన టీమిండియా
పాకిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. 128 పరుగుల టార్గెట్‌ను కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.
-
మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా
97 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. షైమ్ అయ్యూబ్ బౌలింగ్‌లో తిలక్ వర్మ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 31 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్‌తో 31 పరుగులు చేసిన తిలక్ పెవిలియన్ చేరాడు.
-
-
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా..!
128 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ నాలుగో బంతికి రెండో వికెట్ కోల్పోయింది. షైమ్ అయ్యూబ్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 రన్స్ చేసి అభిషేక్ క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు.
-
తొలి వికెట్ కోల్పోయిన భారత్
రెండో ఓవర్ రెండు ఫోర్లు కొట్టి ఊపులోకి వచ్చిన గిల్, చివరి బంతికి ఔటయ్యాడు. దీంతో గిల్ 10 పరుగులకే పెవిలియన్ చేరాడు.
-
తొలి ఓవర్‌లోనే అభిషే’కింగ్’
తొలి ఓవర్ ముగిసే సరికి భారత జట్టు 12 పరుగులు చేసింది. షాహీన్ విసిరిన తొలి రెండు బంతుల్లో అభిషేక్ ఫోర్, సిక్స్‌తో చుక్కలు చూపించాడు.
-
-
భారత్ టార్గెట్ 128
ఆసియా కప్ గ్రూప్-ఎ మ్యాచ్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. సాహిబ్‌జాదా ఫర్హాన్ 40, షాహీన్ షా అఫ్రిది 33 పరుగులు చేశారు. భారత్ తరఫున కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ తలా 2-2 వికెట్లు పడగొట్టారు.
-
8వ వికెట్ డౌన్
పాక్ జట్టు 17.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 98 పరుగులు మాత్రమే చేసింది. షాహీన్ షా అఫ్రిది క్రీజులో ఉన్నాడు.
-
7వ వికెట్ డౌన్..
పాకిస్తాన్ ఇన్నింగ్స్ తడబడుతూనే ఉంది. చైనామన్ దెబ్బకు పాక్ జట్టు కుదేలవుతోంది. 16.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 83 పరుగులు మాత్రమే చేసింది. కుల్దీప్ ఖాతాలో 3 వికెట్లు పడ్డాయి.
-
పాకిస్తాన్ వికెట్లు ఎప్పుడు, ఎలా పడిపోయాయి?
మొదటి వికెట్: హార్దిక్ పాండ్యా మొదటి బంతిని వైడ్‌గా బౌలింగ్ చేశాడు. తరువాతి బంతికి అతను సైమ్ అయూబ్ వికెట్ తీసుకున్నాడు. అయూబ్ క్యాచ్ ను జస్ప్రీత్ బుమ్రా తీసుకున్నాడు.
రెండవ వికెట్: మ్యాచ్ రెండో ఓవర్లో, పాండ్యా వేసిన బంతికి మహమ్మద్ హారిస్ క్యాచ్ ఇచ్చి బుమ్రా భారత్ కు రెండో విజయాన్ని అందించాడు.
మూడో వికెట్: ఎనిమిదో ఓవర్ నాలుగో బంతికి అక్షర్ పటేల్ జమాన్‌ను తిలక్ వర్మ క్యాచ్‌తో అవుట్ చేశాడు. జమాన్ 15 బంతుల్లో 17 పరుగులు చేశాడు.
నాల్గవ వికెట్: 10వ ఓవర్ చివరి బంతికి అభిషేక్ శర్మ బౌలింగ్‌లో సల్మాన్ అలీ ఆఘా ఇచ్చిన క్యాచ్‌ను అక్షర్ అందుకున్నాడు. సల్మాన్ కేవలం 3 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
ఐదో వికెట్: 13వ ఓవర్ నాలుగో బంతికి హసన్ నవాజ్ (5)ను కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు.
ఆరో వికెట్: ఆ తర్వాతి బంతికే కుల్దీప్ మొహమ్మద్ నవాజ్ (0)ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. ఫహీమ్ అష్రఫ్ కుల్దీప్ హ్యాట్రిక్ తీయనివ్వలేదు.
-
కుల్దీప్ హావా..
చైనామన్ కుల్దీప్ దూకుడు ఏమాత్రం ఆగడం లేదు. తన రెండో ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టి, పాక్ జట్టును చీల్చి చెండాడుతున్నాడు. ప్రస్తుతం 13 ఓవర్లకు పాక్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది.
-
4 వికెట్లు డౌన్..
10 ఓవర్లలోపే పాక్ జట్టు 4 వికెట్లు కోల్పోయింది. అక్షర్ 2, బుమ్రా, హార్దిక్ తలో వికెట్ పడగొట్టారు.
-
3వ వికెట్ కోల్పోయిన పాక్..
చైనామన్ కుల్దీప్ రంగంలోకి దిగి వెంటనే పాక్ జట్టుకు షాకిచ్చాడు. జమాన్ (17)ను పెవిలియన్ చేర్చి భారత జట్టుకు ఊరటనిచ్చాడు.
-
ముగసిన పవర్ ప్లే
6 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ 2 వికెట్లు కోల్పోయి 42 పరుగులు చేసింది. సాహిబ్‌జాదా ఫర్హాన్ 16, ఫఖర్ జమాన్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
4 ఓవర్లలో 2 వికెట్లు డౌన్..
4 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ 26 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. సాహిబ్‌జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్ క్రీజులో ఉన్నారు.
-
2వ వికెట్ డౌన్..
టాస్ గెలిచిన పాక్ జట్టుకు ఏమాత్రం కలిసి రావట్లేదు. తొలి ఓవర్ తొలి బంతికే ఓపెనర్ పెవిలియన్ చేరగా, రెండో ఓవర్ రెండో బంతికి మరో వికెట్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకపోయింది. తొలి వికెట్ హార్దిక్ ఖాతాలో చేరగా, రెండో వికెట్ బుమ్రా ఖాతాలో చేరింది.
-
తొలి బంతికే వికెట్..
టాస్ ఓడి బౌలింగ్ చేస్తోన్న భారత జట్టుకు హార్దిక్ పాండ్యా లక్కీ ఛాన్స్ అందించాడు. ఫస్ట్ బంతిని వైడ్‌గా సంధించిన హార్దిక్.. ఆ తర్వాత లీగల్ డెలివరీలో తొలి బంతికే వికెట్ పడగొట్టి, పాక్ జట్టుకు బిగ్ షాక్ ఇచ్చాడు.
-
ఇరుజట్ల ప్లేయింగ్ 11:
పాకిస్థాన్: సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, మహ్మద్ హరీస్ (వికెట్ కీపర్), సల్మాన్ అఘా (కెప్టెన్), ఫఖర్ జమాన్, హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, సుఫ్యాన్ ముఖీమ్.
భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
-
IND vs PAK: టాస్ ఓడిన భారత్..
కీలక మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ ఓడిపోయాడు. దీంతో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
-
స్టేడియం చేరిన భారత జట్టు..
ఆసియా కప్‌లో భాగంగా భారత జట్టు స్టేడియానికి చేరుకుంది.
#WATCH | Dubai | Team India arrives at Dubai International Cricket Stadium for their match against Pakistan in the Asia Cup 2025 pic.twitter.com/JdnFP0ARGz
— ANI (@ANI) September 14, 2025
-
ముందుగా బ్యాటింగ్ చేయాల్సిందే..
ఈమ్యాచ్‌లో భారత్ ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వస్తే, పాకిస్తాన్ గట్టి పోటీ ఇవ్వగలదు. ఇటీవలి సంవత్సరాలలో ఇది రెండుసార్లు జరిగింది. 2021 టీ20 ప్రపంచ కప్‌లో మొదటిసారి, 2022 టీ20 ఆసియా కప్‌లో రెండోసారి. గత 13 సంవత్సరాలలో, పాకిస్తాన్ జట్టు భారత్‌ను ఓడించగలిగిన రెండు టీ20 మ్యాచ్‌లే.
-
దుబాయ్‌లో పాకిస్తాన్‌దే ఆధిక్యం..
ఇప్పటివరకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య మూడు టీ20 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో పాకిస్తాన్ రెండుసార్లు గెలిచింది. భారత్ ఒకసారి గెలిచింది. 2021 ప్రపంచ కప్, 2022 ఆసియా కప్‌లో పాకిస్తాన్ ఒక్కొక్కసారి భారత్‌ను ఓడించింది. అదే సమయంలో, 2022 ఆసియా కప్‌లో భారత జట్టు ఒకసారి పాకిస్థాన్‌ను ఓడించింది.
-
మొదటి ఇన్నింగ్స్‌లో కనీసం 165 పరుగులు..
దుబాయ్‌లో తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 145 పరుగులు మాత్రమే. రెండో ఇన్నింగ్స్‌లో కురుస్తున్న మంచును పరిగణనలోకి తీసుకుంటే, ఈ లక్ష్యాన్ని కూడా సులభంగా ఛేదించవచ్చు. ఇక్కడ ముందుగా బ్యాటింగ్ చేసిన జట్ల సగటు స్కోరు 162 పరుగులు. అయితే, గత 10 సంవత్సరాలలో ఈ స్కోరు 165కి పెరిగింది. అంటే, ముందుగా బ్యాటింగ్ చేస్తూ విజయం సాధించాలని ఆశించాలంటే 165 కంటే ఎక్కువ పరుగులు చేయాలి.
-
టాస్ గెలవడమే కీలకం..
దుబాయ్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇప్పటివరకు 95 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో 46 మ్యాచ్‌లలో, ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. 48 మ్యాచ్‌లలో, లక్ష్యాన్ని ఛేదించిన జట్టు గెలిచింది. 1 మ్యాచ్ టై అయింది. అదే సమయంలో, 2020 నుంచి ఇప్పటివరకు గత ఐదు సంవత్సరాలలో టెస్ట్ ఆడే దేశాల మధ్య ఇక్కడ జరిగిన అన్ని T20 మ్యాచ్‌లలో, లక్ష్యాన్ని ఛేదించిన జట్టు ఆధిక్యంలో ఉంది. ఈ కాలంలో, ఇక్కడ 18 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో రెండు జట్లు టెస్ట్ ఆడే దేశాలు. ఈ 18 మ్యాచ్‌లలో, లక్ష్యాన్ని ఛేదించిన జట్టు 16 గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు 2 మ్యాచ్‌లలో మాత్రమే గెలిచింది.
-
పాక్‌కు కౌంటర్ ఇవ్వనున్న భారత్..
ఈరోజు పాకిస్థాన్‌తో జరిగే ఆసియా కప్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు నల్ల బ్యాండ్‌లు ధరిస్తారు. కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని నిరసిస్తూ భారత జట్టు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. దుబాయ్ స్టేడియంలో బ్యానర్లు, పోస్టర్‌లను తీసుకెళ్లడంపై కూడా నిషేధం ఉంది.
-
14వ పోరుకు సిద్ధం..
భారత్, పాకిస్థాన్ జట్లు టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 14వ సారి తలపడనున్నాయి. ఇంతకు ముందు ఆడిన 13 టీ20 మ్యాచ్‌లలో భారత్ 9 గెలిచగా, పాకిస్తాన్ 3 మ్యాచ్‌లలో గెలిచింది. దుబాయ్ మైదానంలో జరుగుతున్న టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఇరు జట్లు నాల్గవసారి తలపడుతున్నాయి. గత 3 మ్యాచ్‌లలో పాకిస్థాన్ 2 మ్యాచ్‌లలో గెలిచింది. భారత్ 1 మ్యాచ్ గెలిచింది.
-
భారత్ తో మ్యాచ్.. పాక్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
ఆసియా కప్ 2025లో భాగంగా మరికొద్ది గంటల్లో పాక్, భారత్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ పై పాక్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులో కోహ్లీ లేకపోవడాన్ని పాకిస్తాన్ అనుకూలంగా మార్చుకోవాలని పాక్ మాజీ క్రికెటర్ మిస్బా ఉల్ హాక్ అన్నాడు.
-
ఇవాళ మ్యాచ్ ఆడకపోతే
బాయ్ కాట్ డిమాండ్ నేపధ్యంలో ఆసియా కప్ లో ఇవాళ పాకిస్తాన్ తో భారత్ ఆడకపోతే తర్వాతి మ్యాచ్ లో ఒమన్ తో తప్పక గెలవాలి. గ్రూప్ లోని మిగతా జట్ల ప్రదర్శన ఆధారంగా సూర్య సేన సూపర్ 4 కి చెరనుండి. అయితే పాక్ కూడా వచ్చి, భారత్ బాయ్ కాట్ కొనసాగితే మిగతా 2 మ్యాచ్ లు గెలవాలి. ఒకవేళ భారత్, పాక్ ఫైనల్ చేరితే.. ఆ మ్యాచ్ ను బాయ్ కాట్ చేస్తే టోర్నీ దాయాది సొంతం అవుతుంది. వేరే జట్టు ఫైనల్ వస్తే అమీతుమీ తేల్చుకోవాలి.
-
టార్గెట్ ఛేదిస్తేనే లక్..
దుబాయ్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇప్పటివరకు 95 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి. ఈ 46 మ్యాచ్‌ల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. 48 మ్యాచ్‌ల్లో లక్ష్యాన్ని ఛేదించిన జట్టు గెలిచింది. 1 మ్యాచ్ టై అయింది.
-
IND vs PAK: ఆసియా కప్ గణాంకాలు..
ఆసియా కప్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ 19 సార్లు తలపడ్డాయి. వీటిలో వన్డే, టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి. ఇందులో భారత్ 10 మ్యాచ్‌ల్లో గెలిచింది. పాకిస్తాన్ 6 మ్యాచ్‌ల్లో గెలిచింది. రెండు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్‌లు ఎటూ తేల్చుకోలేకపోయాయి.
-
పాక్ తో మ్యాచ్ కు BCCI దూరం!
భారత్, పాక్ మ్యాచ్ కు బీసీసీఐ అధికారులు దూరం పాటిస్తున్నట్టు తెలుస్తోంది. అటు ఐసీసీ చైర్మన్ జైషా కూడా యూఎస్ లో ఉన్నారు. ఒక్క బీసీసీఐ సెక్రటరీ శుక్లా మాత్రమే మ్యాచ్ వీక్షించే అవకాశముంది. కొంతమంది ఫ్యాన్స్ టార్గెట్ చేస్తుండటంతో బీసీసీఐ ఈ మేరకు మ్యాచ్ కు దూరంగా ఉందని సమాచారం.
-
చివరిసారి అమెరికాలో..
ఈ రెండు జట్ల మధ్య చివరిసారిగా జరిగిన మ్యాచ్ అమెరికాలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో జరిగింది. అప్పుడు భారత జట్టు 119 పరుగులు మాత్రమే చేసినప్పటికీ 6 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ ప్రపంచ కప్ తర్వాత, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వంటి అనుభవజ్ఞులైన భారత ఆటగాళ్ళు రిటైర్ అయ్యారు. అయినప్పటికీ, భారత జట్టు ప్రదర్శన మెరుగ్గా మారింది. అప్పటి నుంచి భారత జట్టు తన టీ20 మ్యాచ్‌లలో 86% గెలిచింది.
-
ముందంజలో భారత జట్టు
భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాలలోనూ ముందంజలో ఉంది. పాకిస్తాన్ జట్టు ఫామ్ పరంగా భారతదేశం కంటే ఎక్కడా తక్కువ కాదు.
-
Boycott IND Vs PAK
సోషల్ మీడియాలో ఇండియా వెర్సస్ పాకిస్తాన్ మ్యాచ్ బాయ్ కాట్ కొనసాగుతోంది. టెర్రరిస్టులతో క్రికెట్ వద్దు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్ ను చూడకుండా టీవీలు ఆఫ్ చేసి పహల్గాం దాడి బాధితులకు అండగా నిలవాలని కోరుతున్నారు.
-
ఆసియా కప్ సమరం
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో జరగనుంది. ఈ మ్యాచ్ పై ప్రస్తుతం ఎవ్వరికీ ఆసక్తి లేకపోగా.. మ్యాచ్ ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. పహల్గాం ఎటాక్ తర్వాత పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడొద్దని భారత్ అభిమానులు కోరుతున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య ఈ రసవత్తర మ్యాచ్ జరగనుంది.
Published On - Sep 14,2025 3:16 PM




