AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Sri Lanka: 9వసారి పోరుకు సిద్ధమైన భారత్, శ్రీలంక జట్లు.. రికార్డులు ఎలా ఉన్నాయంటే?

Asia Cup 2023: ఆసియా కప్ 2023 ఫైనల్‌లో భారత్ వర్సెస్ శ్రీలంక జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. కాగా, ఇంతకుముందు ఆసియా కప్ ఫైనల్స్‌లో భారత్, శ్రీలంక జట్లు 8 సార్లు తలపడ్డాయి. భారత జట్టు 5 సార్లు గెలుపొందగా, శ్రీలంక జట్టు 3 సార్లు గెలుపొందింది. ఈ లెక్కల ప్రకారం ఫైనల్ మ్యాచ్‌లో లంక జట్టుకు గట్టి పోటీ ఎదురుకావచ్చు.

India vs Sri Lanka: 9వసారి పోరుకు సిద్ధమైన భారత్, శ్రీలంక జట్లు.. రికార్డులు ఎలా ఉన్నాయంటే?
Ind Vs Sl Final
Venkata Chari
|

Updated on: Sep 16, 2023 | 10:13 PM

Share

India Vs Sri Lanka: ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక తలపడనున్నాయి. కొలంబో ఆర్. ప్రేమదాస మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా 8వ సారి ఛాంపియన్‌గా అవతరిస్తామన్న నమ్మకంతో టీమ్‌ఇండియా ఉంది. ఎందుకంటే వన్డే క్రికెట్‌లో శ్రీలంకపై భారత జట్టు ఇబ్బందులు పడుతూనే ఉంది. ఇందుకు ఈ గణాంకాలే నిదర్శనం.

భారత్, శ్రీలంక జట్లు ఇప్పటి వరకు 166 వన్డే మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. శ్రీలంక కేవలం 57 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. కాగా, భారత జట్టు 97 మ్యాచ్‌ల్లో లంకను ఓడించింది. 11 మ్యాచ్‌ల్లో ఫలితం తేలకపోగా, 1 మ్యాచ్ టై అయింది.

అలాగే, గత 6 మ్యాచ్‌ల్లో టీమిండియా 5 మ్యాచ్‌లు గెలుపొందగా, శ్రీలంక 1 మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. అంటే ఇక్కడ లంక సేనపై టీమ్ ఇండియాదే పైచేయి.

ఇవి కూడా చదవండి

ఆసియా కప్ ఫైనల్ ఫైట్..

ఆసియా కప్ ఫైనల్స్‌లో భారత్, శ్రీలంక జట్లు 8 సార్లు తలపడ్డాయి. భారత జట్టు 5 సార్లు గెలుపొందగా, శ్రీలంక జట్టు 3 సార్లు గెలుపొందింది. ఈ లెక్కల ప్రకారం ఫైనల్ మ్యాచ్‌లో లంక జట్టుకు గట్టి పోటీ ఎదురుకావచ్చు.

లంక సైన్యానికి ప్లస్ పాయింట్..

ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో కొలంబోకు చెందిన ఆర్. ప్రేమదాస మైదానంలో జరగడం శ్రీలంకకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఓ వైపు స్వదేశీ అభిమానుల మద్దతుతో సొంత పిచ్‌పై శ్రీలంక రాణిస్తోంది.

ముఖ్యంగా సూపర్-4 దశలో ఇదే మైదానంలో శ్రీలంక జట్టు 213 పరుగులకు టీమిండియా ఆలౌటైంది. అయితే, బౌలర్ల జట్టు ప్రదర్శన కారణంగా భారత జట్టు 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు అదే మైదానంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుండటంతో శ్రీలంక జట్టు నుంచి గట్టిపోటీ ఎదురుకావచ్చు.

ఎవరు బలవంతుడు?

ఇక్కడి మొత్తం గణాంకాలను బట్టి చూస్తే టీమ్ ఇండియా పటిష్టంగా ఉందని స్పష్టమవుతోంది. అయితే, హోం గ్రౌండ్ సపోర్ట్ మాత్రం శ్రీలంక జట్టుకే ఉంటుంది. ముఖ్యంగా కొంతమంది ఆటగాళ్లకు కొలంబో సొంత పిచ్‌. దీంతో లంక దళం నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.

శ్రీలంక జట్టు: దసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ పెరీరా, కుసాల్ మెండిస్ (వైస్ కెప్టెన్), చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, సదీర సమరవిక్రమ, దునిత్ వెల్లాలఘే, మతిషా పతిరణ, కసున్ రజిత, దుషన్ రజిత, బి. ఫెర్నాండో, ప్రమో డి మధుషన్.

టీమ్ ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ప్రసీద్ధ్ కృష్ణ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కివీస్‌తో వన్డే సిరీస్‌.. ఈ నలుగురు బెంచ్‌కే ఫిక్స్.. ఎందుకంటే?
కివీస్‌తో వన్డే సిరీస్‌.. ఈ నలుగురు బెంచ్‌కే ఫిక్స్.. ఎందుకంటే?
పొలంలో పని చేస్తుండగా పంజా విసిరిన చిరుతపులి.. ఆ తర్వాత..
పొలంలో పని చేస్తుండగా పంజా విసిరిన చిరుతపులి.. ఆ తర్వాత..
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి గిఫ్ట్
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి గిఫ్ట్
రాత్రైతే చాలు గ్రామంలో వింత ఆకారం.. ఏంటని సీసీ కెమెరాలు చూడగా..
రాత్రైతే చాలు గ్రామంలో వింత ఆకారం.. ఏంటని సీసీ కెమెరాలు చూడగా..
కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న ముద్దుగుమ్మ..
కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న ముద్దుగుమ్మ..
మనిషి పేగుల్లోకి పాము లాంటి రోబోట్.. లోపలికి వెళ్లి చేసే పనులు..
మనిషి పేగుల్లోకి పాము లాంటి రోబోట్.. లోపలికి వెళ్లి చేసే పనులు..
పది నిమిషాల్లోనే నోట్లో కరిగిపోయే అటుకుల పాయసం..
పది నిమిషాల్లోనే నోట్లో కరిగిపోయే అటుకుల పాయసం..
నాడు ప్లేయర్‌గా.. 9 ఏళ్ల తర్వాత అదే టీంపై కెప్టెన్‌గా విజయం
నాడు ప్లేయర్‌గా.. 9 ఏళ్ల తర్వాత అదే టీంపై కెప్టెన్‌గా విజయం
దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..
దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..
యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్..
యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్..